S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/29/2016 - 07:23

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చుట్టూ రహదారులు నిర్మించడంతోపాటు, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుండి రాజధానికి అతి తక్కువ సమయంలో చేరుకునేలా రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగా అనంతపురం నుండి అమరావతికి 371 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తారు. ఈ రహదారిలో 33 మేజర్ బ్రిడ్జిలను నిర్మిస్తారు.

09/29/2016 - 05:48

విజయవాడ, సెప్టెంబర్ 28: అభివృద్ధి సాధించడంతో పాటు ఆ ఫలాలు ప్రజలకు అందేలా చేయడలోనే పాలనా యంత్రాంగం పటుత్వం ఆధారపడి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అభివృద్ధి ప్రజల వాస్తవ జీవితాల్లో కనిపించే విధంగా ప్రభుత్వంలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

09/29/2016 - 05:46

విజయవాడ, సెప్టెంబర్ 28: కొన్నిరోజులుగా ప్రయాణికులు అనునిత్యం విజయవాడ రైల్వేస్టేషన్ ఔటర్‌ల వద్ద గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి ఎట్టకేలకు తప్పింది. దాదాపు రూ. 150 కోట్లతో రూట్ ఇంటర్ లాకింగ్ సిస్టం ఏర్పాటు కోసం ఈ నెల 21 నుంచి 28వరకు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచినప్పటికీ ప్రయాణికులు ఎంతగానో సహకరించారు.

09/29/2016 - 06:58

విశాఖపట్నం (గాజువాక), సెప్టెంబర్ 28: మూడు వారాలుగా భక్తుల పూజలందుకున్న 78 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిర్వాహకులు బుధవారం రాత్రి నిమజ్జనం చేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో విశ్వా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకుని 78 అడుగుల భారీ గణపతిని ప్రతిష్ఠించిన విషయం విదితమే.

09/28/2016 - 07:20

విజయవాడ, సెప్టెంబర్ 27: ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద గతంలో లక్షా 45వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం జరిపిన గృహ నిర్మాణశాఖ సమీక్షా సమావేశంలో అదనంగా మరో 55వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. ఈ పథకం కింద నిర్మితమయ్యే ఒక్కో ఇంటికి లక్షా 50వేల రూపాయలను ప్రభుత్వం భరించనుంది. నూతనంగా వచ్చిన అనుమతులతో ప్రతి నియోజకవర్గానికి 1250 ఇళ్లు లభించనున్నాయి.

09/28/2016 - 07:20

గుంటూరు, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి తొలివిడత ఫైళ్లను తీసుకువచ్చారు. ఆర్థికశాఖకు సంబంధించిన ఈ ఫైళ్లను సెక్రటేరియట్‌లో భద్రపరిచారు. వచ్చేనెల 3వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ఉద్యోగులు ఇక్కడి నుంచే విధులు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది.

09/28/2016 - 07:07

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సుపరిపాలనకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై ఏర్పాట్లు చేస్తోంది. వెలగపూడిలో పూర్తిస్థాయి సచివాలయ పాలన అక్టోబర్ 3వ తేదీన ప్రారంభం కావాలని ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. వెలగపూడి సచివాలయంలో ఏ శాఖను ఎక్కడ నిర్వహించాలో కూడా వివరించింది.

09/28/2016 - 07:04

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఈ ఏడాది వర్ష రుతువు ప్రారంభమైనతర్వాత గత నాలుగు నెలల్లో కృష్ణా, గోదావరి నదుల ద్వారా 2175 టిఎంసి నీరు సముద్రంలో కలిశాయి. నాగార్జునసాగర్‌లో 167 టిఎంసి, తుంగభద్రలో 60 టిఎంసి, శ్రీశైలంలో మరో 40 టిఎంసి నీరు వస్తే ఈ ప్రాజెక్టులు పూర్తిగా నిండుతాయి. ఈ ప్రాజెక్టులు నిండాయంటే ఈ ఏడాది ఖరీఫ్, రబీకి లోటు ఉండదు.

09/28/2016 - 07:03

శ్రీశైలం, సెప్టెంబర్ 27: రెండేళ్ల తరువాత శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి జలకళ సంతరించుకుని నిండుకుండలా ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో వరదనీరు జలాశయం చేరుకోవడంతో నిండుగా తొణికిసలాడుతోంది. జలాశయం నిండడంతో బుధవారం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 881.70 అడుగులకు చేరుకుంది.

09/28/2016 - 07:03

శ్రీశైలం, సెప్టెంబర్ 27: శ్రీశైలం మహాక్షేత్రంలో చెంచులకు పెద్దపీట వేయనున్నారు. మల్లికార్జునస్వామిని ఇలవేల్పుగా భావించే చెంచులకు ఇకపై పలు సౌకర్యాలు కల్పించనున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్‌గుప్త మంగళవారం ఆలయంలోని అక్కమహాదేవి మండపంలో చెంచు ప్రతినిధులతో ధార్మిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంచుల కోసం లక్ష్మీకల్యాణం పథకం ప్రవేశపెట్టామన్నారు.

Pages