S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/13/2016 - 12:21

విశాఖ: అనుమతులు లేకుండా తెలంగాణలో చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్‌లో రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని వైకాపా నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు. ఈ ప్రాజెక్టులను అడ్డుకునేందుకే తమ పార్టీ అధినేత జగన్ ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు కర్నూలులో దీక్ష చేస్తారని ఆయన తెలిపారు. 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు జరుగుతాయన్నారు.

05/13/2016 - 12:20

గుంటూరు: నాదెండ్ల మండలం గణపవరం వద్ద శుక్రవారం ఉదయం రోడ్డుపక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ముగ్గురిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్నాటకలోని మంగళూరుకు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరంతా విజయవాడ నుంచి కారులో కర్నాటకకు వెళుతుండగా ప్రమాదం జరిగింది.

05/13/2016 - 12:20

కాకినాడ: మధ్యాహ్న భోజన పథకం, ఉద్యోగుల ఆర్జిత సెలవులకు సంబంధించి తప్పుడు బిల్లులతో ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించినందుకు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో ఇద్దరు సబ్ ట్రెజరీ అధికారులు, ఇద్దరు గుమస్తాలు ఉన్నారు.

05/13/2016 - 05:16

రాజమహేంద్రవరం, మే 12: కృష్ణా - గోదావరి బేసిన్లలో తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై గోదావరి రైతులు భగ్గుమంటున్నారు. తెలంగాణ అక్రమ వినియోగానికి పూనుకుంటున్నా 70 వేల క్యూసెక్కుల నీటి వినియోగంపై కృష్ణా - గోదావరి బేసిన్లు అధోగతి పాలయ్యే ప్రమాదం ఉందని ఇక్కడ ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో గురువారం జరిగిన సాగునీటి జలాల పంపిణీ సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.

05/13/2016 - 05:14

విజయవాడ, మే 12: వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి సాంఘిక సంక్షేమ వసతి గృహాలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దటమేగాక, ఉత్తమ ఫలితాలను సాధించేందుకై బృహత్తర ప్రణాళికను రూపొందించే నిమిత్తమై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు గురువారం నగరంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వర్క్ షాపులో రసాబాస నెలకొని అర్ధంతరంగా ముగిసింది.

05/13/2016 - 05:10

అనంతపురం, మే 12: అనంతపురం జిల్లాలో గురువారం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. హిందూపురం, పెనుకొండ, కొత్తచెరువు, బత్తలపల్లి, కూడేరు, తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పెనుకొండలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఓ పండ్ల దుకాణంపై భారీ వృక్షం నేలకొరగడంతో రెండు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.

05/13/2016 - 05:08

విజయవాడ, మే 12: రాజధాని ప్రాంతాన్ని బాహ్య ప్రపంచానికి చూపించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ చొరవ తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ ఈ బస్సు రాజధాని ప్రాంతంలోని ముఖ్యమైన ప్రదేశాలను, దేవాలయాలను పర్యాటకులకు చూపించబోతోంది. ప్రతి రోజు ఈ బస్సు ఉదయం విజయవాడ సెంట్రల్ రిజర్వేషన్ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది.

05/13/2016 - 05:08

విజయవాడ, మే 12: ‘కాలుష్య నివారణే తక్షణ కర్తవ్యం’గా రాష్ట్ర కాలుష్య నివారణ సంస్థ పనిచేస్తోందని అందుకు అనుగుణంగా నిపుణులతోను, శాస్తవ్రేత్తలతోను, ఉన్నత విద్యావంతులతోను ఆయా పరిశ్రమలపై అవగాహన కార్యక్రమాలను చేపట్టి ‘క్లీనిక్’లను నిర్వహిస్తున్నామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఛైర్మన్ జి.్ఫణికుమార్ పేర్కొన్నారు.

05/13/2016 - 05:05

విజయవాడ, మే 12: ఆంధ్రుల హక్కైన ప్రత్యేక హోదాకు చెల్లు చీటి పాడిన కేంద్రంలోని అధికార పక్షం బిజెపితో తమ దోస్తి కొనసాగిస్తారో లేక ఆంధ్రుల పక్షాన నిలిచి కయ్యానికి దిగుతారో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చుకోవాలంటూ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు సవాల్ చేశారు.

05/13/2016 - 04:34

డుంబ్రిగుడ/సాలూరు, మే 12: విశాఖ, విజయనగరం జిల్లాల్లో గురువారం పిడుగుపాటుకు నలుగురు మృత్యువాతపడ్డారు. విశాఖ జిల్లాలో ఇద్దరు చిన్నారులు చనిపోగా, విజయనగరం జిల్లాలో ఇద్దరు గొర్రెల కాపరులు మరణించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

Pages