S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/14/2016 - 15:07

గుంటూరు : కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన గుంటూరు యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడడంతో అక్కడి యాత్రికులను హెలికాప్టర్లలో తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ ‌రావు ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడి తెలుగువారిని హెలికాప్టర్ల ద్వారా తరలించాలని విజ్ఞప్తి చేశారు.

05/14/2016 - 12:26

తిరుపతి: టెన్త్, ఇంటర్, ఎంసెట్ వంటి పరీక్షా ఫలితాలు ప్రకటించడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్యూ లైన్లలో అన్ని కంపార్టుమెంట్లు కిటకిటలాడుతున్నాయి. ధర్మ దర్శనానికి 15 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా క్యూ లైన్ల వద్దనే భక్తులకు మంచినీరు, ఫలహారాలను అందిస్తున్నారు.

05/14/2016 - 12:25

ఏలూరు: కాకినాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న మేఘనా ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు శనివారం ఉదయం బుద్ధంపూడి వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో గాయపడిన 8 మందిని తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

05/14/2016 - 12:24

విశాఖ: విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తగరపువలసలోని షాపింగ్ కాంప్లెక్సులో తన షాపును తొలగించడంపై మనస్తాపం చెందిన ఆటోమోబైల్ దుకాణం యజమాని కుమార్ శనివారం ఉదయం వొంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు వెంటనే గమనించి కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. కుమార్ ఆత్మహత్యకు యత్నించడం తగరపువలసలో సంచలనం కలిగించింది.

05/14/2016 - 12:23

విశాఖ: ఈనెల 16న జరిగే ఐసెట్ పరీక్షకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 138 కేంద్రాల్లో సుమారు 72వేల మంది ఈ ఎంట్రన్స్‌కు హాజరవుతున్నట్లు ఐసెట్ కన్వీనర్ రామ్మోహన్‌రావు తెలిపారు.

05/14/2016 - 12:23

విశాఖ: జివిఎంసి పరిధిలోని మధురవాడ ప్రాంతంలో మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం పర్యటించి పారిశుద్ధ్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

05/14/2016 - 12:22

విజయవాడ: నగరంలోని పాయకాపురం, వాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 15 మందిని అరెస్టు చేసి, సరైన పత్రాలు లేని 35 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

05/14/2016 - 12:21

కడప: వైకాపా అధినేత జగన్ సొంత జిల్లా కడపకు నీళ్లు ఇచ్చినా ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించడం విడ్డూరంగా ఉందని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ శనివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు పూర్తి కావడం జగన్‌కు ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పట్టిసీమ ద్వారా 40 టిఎంసిల నీటిని ఆదా చేసి దాదాపు 4లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామన్నారు.

05/14/2016 - 08:24

రావులపాలెం, మే 13: ఇంకా తల్లిపాలు తాగుతున్న ఆ ఆవుదూడ పాలిస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ వింత వెలుగుచూసింది. పెచ్చెట్టి సత్యనారాయణ సుమారు అయిదేళ్ల వయసున్న జెర్సీ ఆవును పెంచుతున్నారు. ఈ ఆవు గతంలో రెండు దూడలకు జన్మనివ్వగా, సుమారు 40 రోజుల క్రితం మరో పెయ్యి దూడకు జన్మనిచ్చింది.

05/14/2016 - 08:07

గూడూరు, మే 13: తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని పుట్టంరాజు కండ్రిక గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆక్సిజన్ సర్వీస్ కంపెనీకి యాజమాన్యాన్ని కోరారు. ఈమేరకు ఆ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం నెల్లూరు వచ్చి గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్‌తో సంప్రదింపులు జరిపారు.

Pages