S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/12/2016 - 12:04

గుంటూరు: తెలంగాణలో అక్రమ నీటి ప్రాజెక్టులను ఆపాలంటూ ఎపిలో దీక్షలు చేస్తున్న వైకాపా అధినేత జగన్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ప్రభుత్వ విప్ ధూళిపాళ్ల నరేంద్ర గురువారం ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టులు వద్దంటున్న జగన్ తన మనుషులకు అవే ప్రాజెక్టు పనులు దక్కేలా తెరాస సర్కారుపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. కెసిఆర్‌తో ఒప్పందాలు చేసుకున్న జగన్ ఎపిలో దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.

05/12/2016 - 12:00

విజయవాడ: వైకాపా అధినేత వైఎస్ జగన్ అక్రమ సంపాదన గురించి పనామా పేపర్లలోనూ ప్రస్తావన ఉన్నందున సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంటు డిపార్ట్‌మెంట్ (ఈడీ) వెంటనే స్పందించి కేసులు నమోదు చేయాలని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ఇక్కడ డిమాండ్ చేశారు. జగన్ అక్రమాస్తుల విషయమై సిబిఐ కేసుల విచారణ ఇప్పటికీ కొలిక్కిరాలేదని ఆయన గుర్తు చేశారు.

05/12/2016 - 08:35

విశాఖపట్నం, మే 11: జగద్గురు ఆది శంకరాచార్య జయంతిని జాతీయ పండుగగా ప్రకటించాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ఆది శంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని శారదాపీఠంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన అనుగ్రహభాషణం చేస్తూ ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించాయంటే అందుకు శంకరాచార్యుని ఉపదేశాలే కారణమని అన్నారు.

05/12/2016 - 08:33

సూళ్లూరుపేట, మే 11: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నాహం చేస్తోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి జూన్ 10న పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.

05/12/2016 - 08:33

ఆలమూరు, మే 11: తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన దూలం వెంకటేశ్వరరావు అనే రైతు అరటి తోటలోని ఒక చెట్టుకు వేసిన గెల చూపరులకు ఆశ్చర్యం గొలుపుతోంది. ఈ గెలకు ఉన్న ఒక అత్తానికి ఏకంగా 72 అరటి పండ్లు ఉన్నాయి. సాధారణంగా కర్పూరం వెరైటీ అరటి గెలకు నాలుగు నుండి పది అత్తాలుంటాయి. ఒక్కో అత్తానికి 12 నుండి 18 వరకు పండ్లు ఉంటాయి.

05/12/2016 - 08:32

గుంటూరు, మే 11 : బౌద్ధం పరిఢవిల్లి.. శాతవాహనులు, ఇక్ష్వాకులు ఏలిన అమరావతిలోని శిల్పకళా సంపద ఖండాంతరాలకు తరలిపోయింది. బ్రిటీష్ పాలకుల హయాంలో వివిధ మ్యూజియంలలో అమరావతి పురావస్తు సంపదను భద్రపరిచారు. కొన్నింటిని లండన్ మ్యూజియంకు తరలించారు. అమరావతి పేరిట రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో దేశ, విదేశాల్లో ఉన్న పురావస్తు శిల్పాలను ఏపికి తీసుకురావటానికి ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.

05/12/2016 - 08:32

విజయవాడ, మే 11: రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం. మన రాష్ట్రంలో ఎవరు ఏ పుణ్యక్షేత్రాన్ని సందర్శించినా, తిరిగి వచ్చినప్పుడు విధిగా కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. దేశ, విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

05/12/2016 - 08:31

విజయవాడ, మే 11: గత పదేళ్ళ కాలంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నది ఎండిఎండిపోయంది. విభజన తరువాత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు పంతాలకుపోయి, నీటిని ఇష్టానుసారంగా వాడుకోవడం వలన ఇప్పుడు రిజర్వాయర్లు నేడు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఘోర తప్పిదం వలన నేడు కృష్ణా డెల్టాలో పంటలకే కాదు, తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి నెలకొంది.

05/12/2016 - 05:33

రామకుప్పం, మే 11 : లక్ష్మి అనే వివాహిత అక్క కుమారుడి చేతిలో హత్యకు గురైన సంఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలోని వీర్నమల తాండ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం గ్రామానికి చెందిన శ్యామరాజు (30) ఈ హత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. ఇతను తరచూ మద్యం సేవించి దొంగతనాలు చేసుకుంటూ బతికేవాడని స్థానికులు పసిగట్టారు.

05/12/2016 - 05:31

హైదరాబాద్, మే 11: రాష్ట్రంలో చిన్న,సన్నకారు రైతు లు, ఎస్టీ, ఎస్టీ రైతుల వ్యవసాయానికి కొత్తగా 1.25 లక్షల బోరు బావులు, వాటికి పంపుసెట్లను అమర్చేందుకు రూ.1400 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసినట్లు ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ తెలిపారు. ఈ పథకానికి ‘ఎన్టీఆర్ జలరాశి’ అని నామకరణం చేశారు.

Pages