S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/12/2016 - 05:24

విజయవాడ, మే 11: గ్యాస్ వినియోగదారులకు వచ్చే సబ్సిడీ ప్రస్తుతం బ్యాంకుల్లో ఏ విధంగా నేరుగా జమవుతోందో, ఇకపై రేషన్ వినియోగదారులకు వచ్చే సబ్సిడీని కూడా బ్యాంకు ఖాతాల్లోకి జమ కాబోతోంది. గ్యాస్ సబ్సిడీని బ్యాంకులకు బదలాయించడంలో ఇప్పటికే అనేక లోపాలు దొర్లుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రేషన్ వినియోగదారుల సబ్సిడీని బ్యాంకులకు బదలాయించడం ఎంతవరూ విజయవంతం అవుతుందో చూడాలి.

05/12/2016 - 05:22

హైదరాబాద్, మే 11: రాష్ట్రం విడిపోతే సాగరతీర సంపదవల్ల ప్రాజెక్టులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడి ఉద్యోగాలొస్తాయన్న భ్రమలు క్రమంగా కరిగిపోతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ కలగానే మిగిలింది. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి హామీలను ప్రభుత్వం జమ్మిచెట్టు ఎక్కించింది. కొత్తగా ఉద్యోగాలివ్వకపోగా, ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను ఊడబెరికింది.

05/11/2016 - 17:02

విశాఖ: విశాఖ జిల్లాలో ప్రఖ్యాతి చెందిన పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల్లో బుధవారం బాణసంచా పేలడంతో తొక్కిసలాట జరిగి 13 మంది ఆస్పత్రి పాలయ్యారు. అమ్మవారి ఆలయం వద్ద బాణసంచా కాలుస్తుండగా నిప్పురవ్వ ఎగరిపడి తారాజువ్వల కట్టపై పడింది. దీంతో ఒక్కసారిగా తారాజువ్వలు జనంపైకి దూసుకుపోయాయి. అనుకోని ఈ పరిణామానికి భక్తులు పరుగులు తీశారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని పాడేరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

05/11/2016 - 17:01

పాడేరు: విశాఖ జిల్లా పాడేరు జరుగుతున్న మోదకొండమ్మ ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఆలయ ప్రాంగణంలో బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం జరిగింది. తారాజువ్వల కట్టపై నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగగా భక్తులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. 13మంది గాయపడగా ఓ బాలుడి పరిస్తితి విషమంగా ఉంది. అతడిని విశాఖ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..

05/11/2016 - 17:01

విశాఖ: మర్రిపాకల బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 16న మన్యం బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ పిలుపునిచ్చింది. కొంతమంది ప్రజాద్రోహులు పోలీసులకు సహకరించడం వల్లే బూటకపు ఎన్‌కౌంటర్లలో మావోలు ప్రాణాలు కోల్పోతున్నారని కమిటీ బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించింది. వన్యసంపదను దోచుకునేందుకు మన్యంలో యుద్ధ వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తోందని కమిటీ పేర్కొంది.

05/11/2016 - 12:37

విజయవాడ: మండవిల్లి మండలం భైరవపట్నం వద్ద రైలుపట్టా విరిగి ఉండడాన్ని స్థానికులు గమనించి రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. మరమ్మతులు చేపడుతున్నందున కైకలూరు-గుడివాడ మధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

05/11/2016 - 12:36

నెల్లూరు: ఎపి అభివృద్ధికి కేంద్ర సర్కారు తగినన్ని నిధులను విడుదల చేస్తూనే ఉందని, ఈ సమయంలో ప్రత్యేక హోదా గురించి అంత ఆందోళన చెందాల్సిన పనిలేదని బిజెపి నాయకుడు ఆంజనేయరెడ్డి అన్నారు. హోదా విషయమై బిజెపిపై కొందరు టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సమంజసంగా లేవన్నారు.

05/11/2016 - 12:32

విశాఖ: విశాఖ రేంజి డిఐజిగా శ్రీకాంత్ బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తానని ఆయన మీడియాకు తెలిపారు. పోలీసు వ్యవస్థలో మార్పులు చేపట్టి భూకబ్జాలు, గంజాయి రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారిస్తానన్నారు.

05/11/2016 - 12:31

నెల్లూరు: జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో పైపులైన్లకు రంధ్రాలు చేసి కొనే్నళ్లుగా పామాయిల్‌ను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. స్థానికంగా కొందరి అండదండలతో ఈ ముఠా పామాయిల్‌ను చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

05/11/2016 - 07:09

హైదరాబాద్, మే 10 : ప్రస్తుతం ఎండాకాలం వర్షాకాలాన్ని తలపిస్తోంది. మహబూబ్‌నగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. గత 24 గంటల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారిక లెక్కలు వెల్లడించాయి. గడచిన 24 గంటల్లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, వరంగల్, నల్లగొండ తదితర జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.

Pages