S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/11/2016 - 07:06

విజయవాడ, మే 10: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణ విషయంలో నేల విడిచి సాము చేస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మించాలని భావిస్తున్నారు. ఇందుకు వివిధ దేశాల నుంచి ఆర్కిటెక్ట్‌లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే సింగపూర్, జపాన్, యుకే వంటి అనేక దేశాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించడం, ఆయా దేశాల్లో వివిధ సంస్థలన సంప్రదించడం జరిగిపోయింది.

05/11/2016 - 07:04

విశాఖపట్నం, మే 10: వచ్చే ఏడాది నుంచి అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో రూ. 5 వేల కోట్లతో వౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అటెండెన్సు అమలు చేస్తామన్నారు.

05/11/2016 - 07:00

తిరుపతి, మే 10: శ్రీ భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రామానుజాచార్యులకు సంబంధించిన అధికారిక వెబ్ పేజ్‌ను ప్రారంభించాలని టిటిడి ఇ ఒ డి.సాంబశివరావు నిర్ణయించారు. మంగళవారం మహతి ఆడిటోరియంలో జరిగిన రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల సదస్సులో పలు పుస్తకాలు, సీడీలను గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

05/10/2016 - 17:46

నెల్లూరు: తమ పార్టీలోకి అతి త్వరలోనే పదిమంది వైకాపా ఎమ్మెల్యేలు చేరబోతున్నారని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకుడు ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. జగన్ వైఖరితో విసిగి పోవడం వల్లే వైకాపా ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారని అన్నారు. జగన్ మానసిక పరిస్థితి మెరుగుపడాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు.

05/10/2016 - 14:20

కాకినాడ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైకాపా ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడి కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా జరిగింది. ఆ పార్టీ అధినేత జగన్ ధర్నా సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం లేదన్నారు.

05/10/2016 - 14:20

దిల్లీ: విజయవాడలోని ప్రఖ్యాత ప్రకాశం బ్యారేజీపై భారీ వాహనాలను అనుమతించవద్దంటూ వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను మంగళవారం నాడు సుప్రీం కోర్టు త్రోసిపుచ్చింది. ఇలాంటి విషయాలపై హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలంటూ న్యాయస్థానం సూచించింది.

05/10/2016 - 14:19

తిరుపతి: ఏడాదిపాటు నిర్వహించే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది మే 10 వరకూ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు రామానుజ రథాన్ని ప్రారంభించారు.

05/10/2016 - 11:29

గుంటూరు: వెలగపూడి వద్ద తాత్కాలిక రాజధాని నిర్మాణం పనుల్లో మంగళవారం జరిగిన ప్రమాదంలో యుపికి చెందిన దేవేందర్ అనే కార్మికుడు కాంక్రీట్ మిషన్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఎపి హోం మంత్రి చినరాజప్ప తెలిపారు.

05/10/2016 - 11:28

కర్నూలు: కిడ్నాపర్ల బారి నుంచి ఓ బాలిక చాకచక్యంగా తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు మంగళవారం ఉదయం క్షేమంగా చేరింది. బాలిక మాధవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మద్దికెర గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఆగంతకులు కిడ్నాప్ చేశారు. వారి కళ్లుగప్పి అక్కడి నుంచి ఆమె బయటపడింది. కిడ్నాపర్లు క్షుద్రపూజలు చేస్తున్నారని ఆమె చెబుతోంది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

05/10/2016 - 11:27

విశాఖ: ఎపిలో పదో తరగతి పరీక్షా ఫలితాలను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. పరీక్ష రాసిన వారిలో 94.52 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 94.77, బాలురు 94.30 శాతం ఉత్తీర్ణత సాధించగా, కడప జిల్లా ప్రథమస్థానంలో, చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 4217 పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది.

Pages