S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/14/2016 - 08:06

విశాఖపట్నం, మే 13: రాష్ట్రంలో కరవు, ఇతర సమస్యలపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్టు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్‌లో కరవు, ప్రాథమిక రంగాల్లో అభివృద్ధిపై అధికారులతో శుక్రవారం చర్చించిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఇప్పటికే కేంద్రం కరవు సహాయ పనుల కింద రూ.700 కోట్లు మంజూరు చేసిందన్నారు.

05/14/2016 - 08:05

విశాఖపట్నం, మే 13: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ఉద్దేశించిన జిఓ 97ను ప్రభుత్వం బేషరతుగా రద్దుచేయాలని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే ఎపి గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి బాక్సైట్ తవ్వకాలను చేపట్టకుండా తీర్మానం చేయాలన్నారు.

05/14/2016 - 08:04

నూజెండ్ల, మే 13: ఇంకుడు గుంతలు మూగజీవాలకు శాపంగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంకుడు గుంతలు మూగ జీవాల ప్రాణాలు తీస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో నూజెండ్ల మండలం ములకలూరు, పాత ఉప్పలపాడు, నూజెండ్ల, ముప్పరాజువారిపాలెం తదితర గ్రామాల్లో నాలుగు గేదెలు, ఒక ఆవు మృత్యువాత పడ్డాయి.

05/14/2016 - 05:46

రాజమహేంద్రవరం, మే 13: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్న అధికార తెలుగుదేశం పార్టీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రూపంలో మరో సవాల్ ఎదురుకానుంది. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన నినాదంతో ఉద్యమం ప్రారంభించిన ముద్రగడ త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

05/14/2016 - 05:20

ఏపికి కేంద్రం ఇంత చేసినా, ఏమీ చేయలేదని దుష్ప్రచారం చేయడం సరికాదు. బిజెపిని రాష్ట్రంలో ఎదగకుండా కొన్ని పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయ. టిడిపి తన రాజకీయ ఎదుగుదల కోసం బిజెపిని బలి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, వాటిని ఖర్చు చేస్తున్న తీరును పరిశీలించేందుకు, ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.
- బిజెపి ఇంచార్జి సిద్దార్థనాథ్

05/14/2016 - 05:16

విజయవాడ, మే 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడూ అడగలేదని బిజె పి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జి సిద్దార్థ్‌నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టా రు. బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది.

05/13/2016 - 18:55

ఏలూరు: అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకటరామారావు, ఎండి శేషుకుమార్‌లకు స్థానిక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 5 లక్షల రూపాయల చొప్పున నగదు , ఇద్దరు పూచీకత్తులపై షరతులతో బెయిల్ ఇచ్చారు. అయితే, వీరు నెలకు రెండుసార్లు సిఐడి కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.

05/13/2016 - 16:24

న్యూదిల్లి:గుంటూరు జిల్లా పెద్దనందిపాడుకు చెందిన న్యాయవాది లావు నాగేశ్వరరావుకు అరుదైన గౌరవం లభించింది. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయనకు అదే కోర్టులో న్యాయమూర్తిగా అవకాశం వచ్చింది. శుక్రవారంనాడు ఆయన ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. మూడు దశాబ్దాలుగా ఆయన న్యాయవాద వృత్తిలో ఉన్నారు. సేవారంగంలో తనదైన ముద్రవేసిన లావు తెలుగువాడు కావడం విశేషం.

05/13/2016 - 16:22

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు అయ్యే వ్యయం మొత్తాన్ని కేంద్రప్రభుత్వమే భరిస్తుందని ఏపి బిజెపి వ్యవహారాల పరిశీలకుడు సిద్దార్థ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జాతీయ ప్రాజెక్టుల వ్యయంలో 70శాతం మాత్రమే కేంద్రం భరించాల్సి ఉన్నప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉండటంతో కేంద్రం సానుకూలంగా స్పందించి మొత్తం వ్యయాన్ని భరిస్తోందని ఆయన చెప్పారు.

05/13/2016 - 12:22

గుంటూరు: స్వల్ప తగాదాలతో దంపతులు కాపురాలను నాశనం చేసుకోరాదని ఎపి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో అన్నారు. రాజీమార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప కోర్టులకు వెళ్లి కాపురాలను కాదనుకుంటే సమస్యలు తప్పవన్నారు. కొత్తగా పెళ్లయిన దంపతులు వింత పోకడలతో దాంపత్య జీవితాన్ని పాడుచేసుకోరాదని ఆమె హితవు పలికారు.

Pages