S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/13/2016 - 04:33

తిరుపతి, మే 12: రాష్ట్ర విభజన నేపధ్యంలో ప్రత్యేక హోదా కల్పించాల్సిన్న ప్రజల మాటలను ప్రధాని మాట్లాడడు, వెంకయ్యనాయుడు వినడు, చంద్రబాబు నాయుడు చూడడని వీరి ముగ్గురు వైఖరి మూడు కోతుల తీరులా తయారైయ్యారని సి పి ఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఎద్దేవా చేశారు. గురువారం తిరుపతిలోని సి పి ఐ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు.

05/13/2016 - 04:32

గుంటూరు, మే 12: ప్రపంచ ప్రజారాజధానిగా ప్రభుత్వం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరానికి అనుమతులపై స్పష్టతలేదు. రాజధాని పేరుతో పంట పొలాలను ధ్వంసం చేస్తున్నారంటూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వాదోపవాదాలు జరుగుతున్నాయి.. మరోవైపు నగరం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలేవీ ఇప్పటికీ సిద్ధం కాలేదు.

05/13/2016 - 04:31

పిఠాపురం, మే 12: కాపుల స్థితిగతులపై జూన్ 1వ తేదీ నుండి 15రోజులపాటు రాష్టవ్య్రాప్తంగా సర్వే నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కాపులతో ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతుందన్న ముద్రగడ ప్రకటనను ఆయన ఖండించారు.

05/13/2016 - 04:31

విజయవాడ (క్రైం), మే 12: రాజధాని అమరావతిలో రాష్ట్ర పోలీసు కార్యాలయం ఏర్పాటుకు స్థల కేటాయింపు కోసం ఆశాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం క్యాపిటల్ రీజియన్ డవలప్‌మెంట్ అథారిటి (సిఆర్‌డిఏ)ని సంప్రదింపులు జరుపునుంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు చకాచకా కొనసాగుతున్న నేపధ్యంలో ఈ ఏడాది జూన్ నాటికి ప్రభుత్వ పాలన మొత్తం ఇక్కడి నుంచి జరుగనుంది.

05/13/2016 - 04:13

హైదరాబాద్, మే 12: వైకాపా నుంచి టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కె నారాయణ స్వామి, ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు గురువారం అసెంబ్లీ ఉప కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారని, చంద్రబాబు అనైతిక విధానాలకు పాల్పడ్డారన్నారు.

05/12/2016 - 18:25

కర్నూలు: చాగలమర్రి మండలం గొడిగనూరులో ఓ రోడ్డు పనుల విషయమై టిడిపి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, గంగుల ప్రతాపరెడ్డి వర్గీయుల మధ్య గురువారం ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్ సహా ఇద్దరు గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

05/12/2016 - 17:28

తిరుపతి: తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలంటే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎపికి ప్రత్యేకహోదాపై కాంగ్రెస్ ఎంపీ కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందేలా కృషి చేయాలని సిపిఐ నేత నారాయణ హితవు పలికారు. ప్రత్యేక హోదా విషయమై ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్య, ఎపి సిఎం చంద్రబాబు నిజాయితీగా వ్యవహరించడం లేదన్నారు.

05/12/2016 - 17:28

చిత్తూరు: విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన గడ్డం శ్రీనివాసరావు అనే వృద్ధుడు అక్కడే గుండెపోటుకు గురై మరణించడంతో అతని బంధువులు ఆందోళన చేపట్టారు. వాల్మీకిపురం పోలీస్ స్టేషన్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. ఓ ఫైనాన్స్ వ్యాపారి ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావు కుమారుడిపై పోలీసులు కేసు పెట్టారు. విచారణకు రావాల్సిందిగా శ్రీనివాసరావును పోలీసులు పిలిపించారు.

05/12/2016 - 17:27

హైదరాబాద్: వచ్చే నెలాఖరునాటికి అమరావతి ప్రాంతానికి తాము వెళ్తామని ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రకటించారు. ఇక్కడ గురువారం జరిగిన ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎపి రాజధానికి వెళ్లే సిబ్బందికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. నూతన రాజధానిలో వారానికి అయిదురోజుల పని విషయమై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని ఆయన తెలిపారు.

05/12/2016 - 17:27

విశాఖ: డుంబ్రిగుడ మండలం బిల్లాపుట్‌లో గురువారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి మేఘాలు ఆవరించి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఇదే సమయంలో గ్రామం సమీపంలో పిడుగుపడి వీరు మరణించారు.

Pages