S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/20/2018 - 01:24

ముంబయి: మదుపరులు ఆచితూచి వ్యవహరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు గురువారం స్వల్పంగా పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ సెషన్ ఆరంభంలో పొందిన లాభాలను కోల్పోయి, చివరకు 22 పాయింట్లు పడిపోయి 36,351.23 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 23.35 పాయింట్లు (0.21 శాతం) దిగజారి 10,957 పాయింట్ల వద్ద స్థిరపడింది.

07/20/2018 - 00:23

తిరుపతి, జూలై 19: మేలైన కాటన్ వస్త్రాలకు రామ్‌రాజ్ కాటన్ షోరూమ్ పెట్టింది పేరని ప్రజల్లో అపారమైన విశ్వాసం ఏర్పడిందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు.

07/20/2018 - 00:22

అహ్మదాబాద్, జూలై 19: ప్రస్తుతం వ్యక్తులు, సంస్థల వద్ద ఉండే నగదు నిల్వలపై ఉన్న నిబంధనను సవరించాలని, 20లక్షలు ఉన్న దీనిని కోటి రూపాయలకు పెంచాలని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

07/20/2018 - 00:51

ముంబయి, జూలై 19: త్వరలో కొత్త వంద రూపాయల కరెన్సీ నోటును విడుదల చేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మహాత్మాగాంధీ సీరిస్‌లో భాగంగా కొత్త నోటును విడుదలచేస్తారు. కొత్త వంద నోటు లావెండర్ (ఊదా) రంగు కలిగి ఉంటుంది. గుజరాత్‌కు చెందిన రాణి కీ వావ్ హెరిటేజ్ ప్రదేశాన్ని ఈ నోటుపై ముద్రిస్తారు. కొత్త నోటు సైజు 66ఎంఎం, 142 ఎంఎం.

07/20/2018 - 00:48

న్యూఢిల్లీ, జూలై 19: రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం (రెరా) అమలు కారణంగా గత సంవత్సరం దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగ నియామకాలు ఎనిమిది శాతం తగ్గాయి. గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ ఇండియా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

07/20/2018 - 00:17

న్యూఢిల్లీ, జూలై 19: భారత్ ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతుందని, చైనాను అధిగమించిందని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబి) ప్రకటించింది. 2018-19లో 7.3 శాతం, 2019-20లో 7.6 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తుందని ఆ బ్యాంకు పేర్కొంది. ప్రజా వ్యయం పెరగడం, వినిమయ రేటు, ప్రైవేట్ పెట్టుబడుల్లో వృద్ధిరేటు వల్ల భారత్ దేదీప్యమానంగా ఆర్థిక రంగంలో వెలుగుతుందని ఏడీబి అవుట్‌లుక్‌లో పేర్కొంది.

07/20/2018 - 00:16

న్యూఢిల్లీ, జూలై 19: విశాఖపట్నంలో పీపీపీ విధానంలో మెట్రోరైల్ నిర్మాణం చేపట్టడానికి అయిదు సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసింది. వారికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)ను జారీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి గురువారం రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
కాకినాడ-చెన్నై జలమార్గం సర్వే పూర్తీ

07/19/2018 - 17:25

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఈ ఉదయం 35,515,58 వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ వెంటనే నష్టాల్లోకి జారుకొని 36,279.33 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 22 పాయింట్లు కోల్పోయి 36,351 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 23 పాయింట్ల నష్టంతో 10,957 వద్ద ముగిసింది.

07/18/2018 - 22:47

ముంబయి: దేశీయ విమానాల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జూన్ నెలలో వృద్ధిరేటు 18.36 శాతం నమోదైంది. విమానాల్లో 2017 జూన్ నెలలో 95.68 లక్షల మంది ప్రయాణించగా, ఈ ఏడాది జూన్ నెలలో 17.57 లక్షల మంది అదనంగా అంటే 113.25 లక్షల మంది ప్రయాణించారు. ఈ వివరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. విమాన సంస్థలో ఇండిగో మొదటి స్థానంలో నిలిచింది.

07/18/2018 - 22:48

ముంబయి, జూలై 18: మదుపరుల లాభాల స్వీకరణతో పాటు ప్రతిపక్షాలు బుధవారం లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బతీసింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లో ఊగిసలాటలో సాగిన లావాదేవీల మధ్య సెనె్సక్స్ 147 పాయింట్లు పడిపోయి 36,373.44 పాయింట్ల వద్ద ముగిసింది.

Pages