S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/13/2017 - 00:51

న్యూఢిల్లీ, మార్చి 12: భారతీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. నిరుడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభ నెలైన జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు..

03/12/2017 - 09:25

న్యూఢిల్లీ, మార్చి 11: కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపు మరిన్ని సంస్కరణలకు ఊతమివ్వగలదన్న అభిప్రాయాన్ని భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలు వ్యక్తం చేశాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఫలితాలు విడుదలైయ్యాయి. ఇందులో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ లభించింది.

03/12/2017 - 09:23

ఏలూరు, మార్చి 11: పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి జిల్లా కేంద్రం ఏలూరులోని సర్ సిఆర్‌ఆర్ కళాశాలలో చదువుకుని, అంచెలంచెలుగా ఎదిగిన తాను ఏలూరు సమీపంలో వెమ్ ఏరోసిటీ ఏర్పాటుద్వారా జిల్లా రుణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆ సంస్థ సిఎండి వి వెంకట్రాజు పేర్కొన్నారు. పెదపాడు మండలం వట్లూరు వద్ద వెమ్ ఏరోసిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

03/12/2017 - 09:23

కరీంనగర్, మార్చి 11: త్వరలో స్థానిక కేబుల్ నెట్‌వర్క్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో ప్రభుత్వరంగ టెలి కామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) తెలంగా ణలోని తమ కస్టమర్లకు బ్రాడ్‌బాండ్ సేవలను అందించనుంది. ఇప్పటికే వరంగల్ జిల్లాలోని కొందరు కేబుల్ ఆపరేటర్లతో టైఅప్ అయ్యామని, కరీంనగర్‌లోనూ మే నెలకల్లా టైఅప్ పెట్టుకుంటామని సంస్థ తెలంగాణ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ (సిజిఎం) ఎల్ అనంతరామ్ తెలిపారు.

03/12/2017 - 09:26

రాజమహేంద్రవరం, మార్చి 11: కేంద్ర జల రవాణా ప్రాజెక్టు భూసేకరణ దశకు చేరింది. బకింగ్‌హామ్ కెనాల్ నుంచి ఇటు పుదుచ్చెరి వరకు ఇప్పటికే సర్వే పూర్తికావడంతో ప్రస్తుతం భూసేకరణపై దృష్టి సారించారు. జల వనరుల శాఖ ఎల్‌పి షెడ్యూలు సిద్ధం చేస్తోంది. ఈ షెడ్యూలు ప్రకారం రెవెన్యూ యంత్రాంగం భూసేకరణ నోటిఫికేషన్‌కు కసరత్తు మొదలుపెట్టింది.

03/12/2017 - 09:15

కాకినాడ, మార్చి 11: ఆంధ్ర రాష్ట్రంలో మామిడి తాండ్ర తయారీలో అగ్రభాగాన ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మామిడి తాండ్ర తయారీదారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. మామిడి తాండ్ర తయారీ కేంద్రాలను కుటీర పరిశ్రమగా గుర్తించి, నాణ్యమైన ఉత్పత్తులు సాధించడంతోపాటు పెద్ద ఎత్తున మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.

03/11/2017 - 00:43

న్యూఢిల్లీ, మార్చి 10: దేశంలో ప్రస్తుతం 12 లక్షల కోట్ల రూపాయలకుపైగా విలువైన కొత్త కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.

03/11/2017 - 00:41

న్యూఢిల్లీ, మార్చి 10: బంగారం ధరలు శుక్రవారం పడిపోయాయి. బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర 400 రూపాయలు క్షీణించి 29 వేల దిగువకు చేరి 28,850 రూపాయల వద్ద స్థిరపడింది. 99.5 స్వచ్ఛత కలిగిన దాని ధర 28,700 రూపాయలు పలకగా, కిలో వెండి ధర కూడా 525 రూపాయలు తగ్గి 41 వేల స్థాయిని కోల్పోయి 40,975 రూపాయల వద్ద నిలిచింది.

03/11/2017 - 00:40

హైదరాబాద్, మార్చి 10: రబీ సీజన్ ప్రారంభానికి ముందే ఖరీఫ్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) అదే సీజన్‌లో 99 శాతం అప్పగించడం ఇదే తొలిసారి అని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఒకే సీజన్‌లో గడువు పొడిగించకుండా ఈ స్థాయిలో సిఎంఆర్ అప్పగించడం పౌరసరఫరాల శాఖ చరిత్రలోనే ఒక రికార్డు అని చెప్పారు.

03/11/2017 - 00:43

న్యూఢిల్లీ, మార్చి 10: అనుమతి లేకుండా తమ ప్రకటనల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని వాడుకున్నందుకుగాను రిలయన్స్ జియో, పేటిఎమ్ సంస్థలు క్షమాపణలు చెప్పాయి. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్‌లో ప్రభుత్వం తెలియజేసింది. 1950 చిహ్నాలు, పేర్ల చట్టం ప్రకారం ఈ రెండు సంస్థలకు వినియోగదారుల సంబంధాల మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.

Pages