S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/09/2017 - 07:45

విజయవాడ (క్రైం), మార్చి 8: కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సెంట్రల్ ఎక్సైజ్ సేవాపన్ను చెల్లింపుదారులు ఈ నెల 31లోగా జిఎస్‌టికి బదలాయింపు కావాలని సెంట్రల్ ఎక్సైజ్ అదనపు కమిషనర్ వి నాగేంద్రరావు సూచించారు.

03/09/2017 - 07:45

శ్రీకాకుళం, మార్చి 8: ఒడిశా అక్రమ ఇటుకబట్టీ వ్యాపారం ఆంధ్రాను కాలుష్యం రూపంలో కాటేస్తోంది. ఇప్పటికే మూలాలు దొరకని కిడ్నీ రోగాలు ఉద్దానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, గత కొద్ది నెలలుగా ఇటుక బట్టీల కాలుష్యం ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామీణ ప్రజల ఊపిరితిత్తులను హరించేస్తోంది.

03/09/2017 - 07:44

హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చే మహిళలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పరిశ్రమ భవన్‌లో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

03/09/2017 - 07:44

హైదరాబాద్, మార్చి 8: సెక్యూరిటీ మార్కెట్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. డిస్కాంల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్వారా వేలం వేసిన బాండ్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. తెలంగాణ డిస్కాంలను నష్టాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బాండ్లను విడుదల చేసింది. మొత్తం రూ. 8,923 కోట్ల విలువైన బాండ్లను వేలం వేయగా, రూ. 7,120 కోట్ల బాండ్లు అమ్ముడయ్యాయి. బాండ్లకు ఏ రేటింగ్ లభించింది.

03/08/2017 - 00:51

జెనీవా, మార్చి 7: స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న 87వ అంతర్జా తీయ మోటార్ షోలో భారతీయ ఆటోరంగ దిగ్గజం టాటా మోటార్స్ తమ తొలి స్పోర్ట్స్ కారును ప్రదర్శిం చింది. టాటా మోటార్స్ లగ్జరీ బ్రాండైన జాగ్వార్ లాండ్ రోవర్ తమ నూతన సబ్-బ్రాండ్ టమో రెసమో ద్వారా ఈ స్పోర్ట్స్ కారును పరిచయం చేసింది.

03/08/2017 - 00:49

న్యూఢిల్లీ, మార్చి 7: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ మధ్యంతర డివిడెండ్‌ను ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు 55 రూపాయలుగా ప్రకటించింది. మంగళవారం జరిగిన సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించిందని పేర్కొంది.

03/08/2017 - 00:48

న్యూఢిల్లీ, మార్చి 7: దేశీయ ఆటోరంగ దిగ్గజం టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) గత నెల అమ్మకాలు 9.3 శాతం పెరిగాయి. ఈ ఫిబ్రవరిలో 40,978 యూనిట్ల విక్రయాలు జరిగాయి. జాగ్వార్ ఎఫ్-పేస్, ఎక్స్‌ఇ, లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్, ఎవోక్ మోడల్ అమ్మకాలు అధికంగా జరిగినట్లు మంగళవారం ఓ ప్రకటనలో టాటా మోటార్స్ తెలిపింది.

03/08/2017 - 00:53

న్యూఢిల్లీ, మార్చి 7: భారతీయ కుబేరులపై పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం కనిపించింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8న పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. దీంతో దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాల వృద్ధి కుంటుపడగా, ఆయా రంగాల్లోని సంపన్నుల సంపద కూడా పడిపోయింది.

03/08/2017 - 00:47

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణలో తొలి మహిళా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పడబోతోంది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఇందుకోసం ఇప్పటికే 50 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. భూమి కేటాయింపునకు సంబంధించి కొంత మంది మహిళా పారిశ్రామికవేత్తలకు సర్ట్ఫికెట్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ బుధవారం జరిగే ఒక సమావేశంలో అందజేస్తారు.

03/08/2017 - 00:46

న్యూఢిల్లీ, మార్చి 7: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ సంస్థ.. డిజిటల్ పేమెంట్స్ సంస్థ అయిన పేటిఎమ్‌లో దాదాపు తమ 1 శాతం వాటాను అమ్మేసింది. 275 కోట్ల రూపాయలతో ఈ వాటాను చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ కొనుగోలు చేసింది.
పేటిఎమ్‌లో ఈ వాటాను కేవలం 10 కోట్ల రూపాయలకే గతంలో రిలయన్స్ క్యాపిటల్ దక్కించుకుంది. కాగా, ఈ లావాదేవీపై మాట్లాడేందుకు రిలయన్స్ క్యాపిటల్ వర్గాలు నిరాకరించాయి.

Pages