S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/15/2019 - 04:27

ముంబయి, నవంబర్ 14: భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలను ఎదుర్కొనే ప్రమాదంలో పడినప్పటికీ, చివరి క్షణాల్లో పెట్టుబడిదారులు షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో కోలుకొని, లాభాలను ఆర్జించాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు మొదలైన మరుక్షణం నుంచే పతనం ప్రారంభమైంది. మధ్యాహ్నంలోగా భారీ పతనం తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి.

11/14/2019 - 05:58

న్యూఢిల్లీ: దిగ్గజ సూచీ ‘నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్చేంజ్ లిమిటెడ్’ (ఎన్‌సీడీఈఎక్స్) ప్రత్యేకంగా రిటర్న్‌ల ఆధారిత వ్యవసాయ అంశాలతో కూడిన సూచీ (ఏజీఆర్‌ఐడీఈఎక్స్)ని బుధవారం ప్రారంభించింది. జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఇండిసెస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో తమ సూచీ పనిచేస్తుందని ఎన్‌సీడీఈఎక్స్ ఈ సందర్భంగా పేర్కొంది.

11/13/2019 - 23:06

ముంబయి, నవంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలపాలయ్యాయి.

11/13/2019 - 23:04

న్యూఢిల్లీ, నవంబర్ 13: రేబిస్ చికిత్సకు కైరోర్యాబ్ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసింది. ఢిల్లీలో బుధవారం భారత డ్రగ్ కంట్రోల్ అధికారి డా. ఎస్ ఈశ్వర్‌రెడ్డి, కేంద్ర బయోటెక్నాలజీ కార్యదర్శి డా. రేణు స్వరూప్, భారత్ బయోటెక్ ప్రైవేటు లిమిటెడ్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేశారు.

11/13/2019 - 23:02

న్యూఢిల్లీ, నవంబర్ 13: నిర్థిష్టమైన పెట్టుబడుల ప్రణాళికలు (ఎస్‌ఐపీలు) అమలు చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ గత అక్టోబర్ మాసంలో రూ. 8,246 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే ఇది 3.2 శాతం అధికం.

11/13/2019 - 22:28

న్యూఢిల్లీ, నవంబర్ 13: కేంద్ర ఆర్థిక మంత్రి త్వ శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ను రూపొందించే కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో చేయవలసిన మార్పుల గురించి సూచనలు ఇవ్వవలసిందిగా పరిశ్రమ వర్గాలను, వాణిజ్య సంస్థలను కోరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇలా సూచనలు ఇవ్వాల్సిందిగా కోర డం బహుశా ఇదే మొదటిసారి.

11/13/2019 - 06:13

విశాఖపట్నం: అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి వచ్చే పర్యాటకుల కోసం విశాఖ-అరకు మధ్య ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐఆర్‌సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య తెలిపారు.

11/12/2019 - 23:20

న్యూఢిల్లీ, నవంబర్ 12: మదుపర్లు గడచిన అక్టోబర్ మాసంలో ‘బంగారు మారక వాణిజ్య నిధి’ (ఈటీఎఫ్‌లు) నుంచి రూ. 31 కోట్లు ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు రెండు నెలల కాలంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారానే్న పెట్టుబడులకు భత్రతతో కూడిన మార్గంగా భావించి రూ. 200 కోట్లు మదుపుచేశారు. తాజా పరిస్థితుల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారని వాణిజ్య వర్గాలు తెలిపాయి.

11/12/2019 - 23:20

న్యూఢిల్లీ, నవంబర్ 12: సమాచార సంకేతిక (ఐటీ) రంగంలో ప్రత్యేక ఆర్థిక జోన్లు (సెజ్‌లు) ఏర్పాటుకు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్‌లు వేర్వేరుగా సమర్పించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం వచ్చే శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెజ్‌లపై అత్యున్నత నిర్ణయాధికారాలు కలిగిన విభాగం ‘బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్’ ఈనెల 15 జరిగే సమావేశంలో ఈప్రతిపాదనలపై చర్చించనుంది.

11/12/2019 - 23:19

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థిక పరిశోథనా విభాగం తాజాగా 5 శాతానికి కుదించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా ఉంటుందని గతంలోప్రకటించిన ఈ విభాగం తాజాగా ఆ అంచనాలను సవరించి 5 శాతానికి కుందించడం విశేషం.

Pages