S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/09/2018 - 02:09

ముంబయి, సెప్టెంబర్ 8: దేశంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజు శనివారం తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. వంద తగ్గి, రూ. 31,350కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో పాటు స్థానికంగా డిమాండ్ అంతగా లేకపోవడంతో దేశంలో పసిడి ధర తగ్గింది. అయితే, వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి ధర రూ. 275 పెరిగి, రూ. 37,775కు చేరుకుంది.

09/09/2018 - 02:08

బీజింగ్, సెప్టెంబర్ 8: చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అలీబాబా సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ జాక్ మా సోమవారం కంపెనీ పదవుల నుంచి రిటైర్ కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ద న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ మా ఈ విషయం వెల్లడించారు. విద్యారంగంపై కేంద్రీకరించి సామాజిక సేవ చేసేందుకు సమయాన్ని కేటాయించడం కోసం కంపెనీ పదవుల నుంచి రిటైర్ కావాలని జాక్ మా భావిస్తున్నారు.

09/09/2018 - 02:06

సంగారెడ్డి, సెప్టెంబర్ 8: పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్లుగా రీజినల్ రూరల్ బ్యాంక్ (ఏపీజీవీబీ)ల పరిస్థితి దాపురించింది. ప్రభుత్వాలే ఈ బ్యాంకులను ఏర్పాటు చేసి లావాదేవీలు కొనసాగిస్తున్నా అదే ప్రభుత్వాలకు సంబంధించిన డిపాజిట్లకు నోచుకోని వైనం నాలుగు దశాబ్దాలకుపైగా కొనసాగుతోంది. ఈ విషయమై అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోకపోవడం దురదృష్టకరం.

09/09/2018 - 02:06

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: గతంలో ఎన్నడూ లేని రీతిలో శనివారం తొలిసారి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80 దాటింది. రూపాయి విలువ పతనమయి, దిగుమతులు ప్రియం కావడం వల్ల పెట్రోల్ ధర బాగా పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం సవరించిన ధరల ప్రకారం దేశంలో లీటర్ పెట్రోల్ ధర 39 పైసలు పెరగగా, డీజిల్ ధర 44 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.38కి చేరుకుంది.

09/08/2018 - 05:49

ముంబయి: వరుసగా ఏడు రోజుల పాటు పతనమయిన రూపాయి మారకం విలువ శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తీవ్ర స్థాయిలో జోక్యం చేసుకోవడంతో పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారంతో పోలిస్తే 26 పైసలు పెరిగి, 71.73 వద్ద ముగిసింది.

09/08/2018 - 01:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: మ్యూచువల్ ఫండ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు చివరి నాటికి మూల ఆస్తుల విలు 25 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించడం రికార్డుగా నమోదైంది. ఒక్క నెలలోనే 8.41 శాతం పెరగడంతో మ్యూచువల్ ఫండ్స్‌కు ఈ అరుదైన అవకాశం సాధ్యమైంది.

09/08/2018 - 01:29

ముంబయి, సెప్టెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు శుక్రవారం బలపడ్డాయి. శుక్రవారం రూపాయి స్వల్పంగా బలపడిన నేపథ్యంలో వాహన షేర్లలో వచ్చిన ర్యాలీ కారణంగా మార్కెట్ కీలక సూచీలు పుంజుకున్నాయి.

09/08/2018 - 01:27

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశంలో ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీంతో వీటి ధరలు సరికొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 50 పైసల వరకు పెరిగాయి. ఈ పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి వచ్చాయి.

09/08/2018 - 01:53

ముంబయి, సెప్టెంబర్ 7: రుణభారంతో కుంగిపోతున్న ఐడీబీఐ బ్యాంకులో పెట్టుబడులను 15 శాతానకి మించకుండా చూడాలని జీవత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది. ఇందుకుగాను కాలపరిమితిని త్వరలోనే వెళ్లడిస్తామని తెలిపింది. ప్రస్తుం ఎల్‌ఐసీకి ఐడీబీఐలో 7.98 శాతం వాటా ఉంది. అయితే, వాటాను 51 శాతానికి పెంచాలని ఎల్‌ఐసీ తీర్మానించింది.

09/06/2018 - 23:41

ముంబయి, సెప్టెంబర్ 6: వరుసగా ఆరు సెషన్ల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి బలంగా పుంజుకున్నాయి. ఒకవైపు రూపాయి విలువ పడిపోయినప్పటికీ దేశీయ మార్కెట్లు పుంజుకోవడం విశేషం. ఇటీవల ధరలు పడిపోయిన ఆరోగ్య సంరక్షణ, ఇంధన, పవర్ రంగాల షేర్లను చేజిక్కించుకోవడానికి మదుపరులు పూనుకోవడంతో మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ వచ్చింది.

Pages