S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/25/2019 - 00:56

హైదరాబాద్, జూలై 24: పారిశ్రామికంగా బలమైన రాష్ట్రంగా అవతరిస్తున్న తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ దిశగా విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదికను ఇచ్చే బాధ్యతను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి అప్పగించనున్నారు.

07/24/2019 - 23:22

న్యూఢిల్లీ, జూలై 24: వాహన తయారీ పరిశ్రమ మొత్తానికి ఒకే రకమైన పన్ను విధానాన్ని అమలు చేయాలని, ప్రత్యేకించి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ని అందరికీ 18 శాతంగా నిర్థారించాలని ‘జాతీయ వాహన విడిభాగాల తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) బుధవారం నాడిక్కడ ప్రభుత్వాన్ని కోరింది.

07/24/2019 - 23:21

న్యూఢిల్లీ, జూలై 24: కరూర్ వైశ్యా బ్యాంకు త్రైమాసిక లాభాల్లో 59 శాతం వృద్ధి నమోదైంది. గత జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలను ఆ బ్యాంకు బుధవారం నాడిక్కడ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. రూ. 72.92 కోట్ల నికర లాభాలు వచ్చిందని ఆ బ్యాంకు తెలిపింది.

07/24/2019 - 23:20

న్యూఢిల్లీ, జూలై 24: రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలోని విద్యుదుత్పాదక పరిశ్రమ (జన్‌కో)లకు సరికొత్త ‘భద్రతా నిధి చెల్లింపుల’ విధానం వర్తించదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ బుధవారం నాడిక్కడ స్పష్టం చేసింది. ఈ విధానంలో డిస్ట్రిబూషన్ కంపెనీలు విద్యుదుత్పాక పరిశ్రమలకు ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ కింద ముందస్తుగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

07/24/2019 - 23:19

న్యూఢిల్లీ, జూలై 24: సెబీలో నమోదైన 254 స్టార్టప్ కంపెనీలకు 1,700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఆల్టర్‌నేటివ్ ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్), కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) సంయుక్తంగా ఈ పెట్టుబడులను అందించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.

07/24/2019 - 04:32

న్యూఢిల్లీ : పరోక్ష పన్నులకు సంబంధించిన అప్పీళ్లపై అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య 61 శాతం తగ్గిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం రాజ్యసభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు.

07/24/2019 - 04:26

విశాఖపట్నం, జూలై 23: అటవీ ఉత్పత్తులకు విశేష ఆదరణ తెచ్చిపెడుతున్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇపుడు సరికొత్త పంథాను అనుసరిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాగించడంపైనే వ్యక్తిగత శ్రద్ధ చూపుతున్న మానవాళి ఇపుడు సహజ సిద్ధమైన చిరుధాన్యాలవైపు చూస్తోంది. దీనిని జీసీసీ అవకాశంగా చేసుకుంటోంది. ప్రతిఒక్కరూ కోరుకునే చిరుధాన్యాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

07/24/2019 - 04:13

రేణిగుంట, జూలై 23: తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియా దేశానికి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు యత్నిస్తున్నామని మలేషియా బృందం వెల్లడించింది. మంగళవారం మలేషియా బృందం శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో విమానాశ్రయ అధికారులతో మలేషియాకు విమాన సర్వీసులు నడిపే విషయమై సమావేశం నిర్వహించారు.

07/23/2019 - 23:10

న్యూఢిల్లీ, జూలై 23: ఉన్నత విద్యనభ్యసించేందుకు వివిధ విశ్వ విద్యాలయాల్లో చేరే విద్యార్థులు ఆ విశ్వ విద్యాలయాలకు గుర్తింపు ఉందా? లేదా? అవి నకిలీవా? అనే అప్రమత్తతో అడుగు వేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. దేశంలో 23 యూనివర్సిటీలు నకిలీవి అని, వాటికి తమ గుర్తింపు లేదని యూజీసీ మంగళవారం ప్రకటించింది.

07/23/2019 - 22:38

ముంబయి, జూలై 23: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజైన మంగళవారం సైతం సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీల బలహీన త్రైమాసిక ఫలితాలతో ఫైనాన్షియల్ స్టాక్స్ పెద్దమొత్తాల్లో నష్టపోయాయి. తొలుత మెరుగైన లాభాలతోనే ఆరంభమైన బీఎస్‌సీ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనై నష్టాల్లోకి జారుకుంది.

Pages