S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/28/2016 - 00:51

విశాఖపట్నం అక్టోబర్ 27: కొర్రీలతో పెండింగ్‌లోనున్న పరిశ్రమలకు, గత ఏడాది జనవరిలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ఎంఒయు చేసుకున్న పరిశ్రమల స్థాపనకు సంబంధించిన సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ తెలిపారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సిఎస్ టక్కర్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.

10/27/2016 - 07:17

ముంబయి, అక్టోబర్ 26: టాటా సన్స్ నుంచి దిగ్భ్రాంతికర రీతిలో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్ర్తి.. ఆ సంస్థ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చైర్మన్‌గా తనకు ఎలాంటి అధికారాలు లేకుండా అచేతనంగా ఉంచారని, అలాగే టాటా గ్రూప్‌లో ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలు కూడా వెలిశాయని తెలిపారు. టాటా సన్స్ బోర్డు సభ్యులకు పంపిన ఈ-మెయిల్‌లో అత్యంత తీవ్రమైన ఆరోపణలే ఆయన చేశారు.

10/27/2016 - 07:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశీయ ఆటో రంగంలో ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 1,004.22 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌తో పోల్చితే ఇది 27.74 శాతం అధికం. నిరుడు 786.12 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ అందుకుంది. ఈ మేరకు బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలియజేసింది.

10/27/2016 - 07:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: నార్వేకు చెందిన టెలికామ్ సంస్థ టెలినార్.. భారతీయ విభాగమైన టెలినార్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ నష్టాలపాలైంది. ఏకంగా 3,226.31 కోట్ల రూపాయల నిర్వహణ నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో సంస్థ నష్టం కేవలం 299.52 కోట్ల రూపాయలుగా ఉంది.

10/27/2016 - 07:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: వ్యాపారానికి అత్యుత్తమ దేశాల జాబితాను ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన ఈ జాబితాలో భారత్‌కు 130వ స్థానం లభించగా, నిరుడు 131వ స్థానంలో ఉంది. దీంతో జాబితాపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

10/27/2016 - 07:13

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం, ప్రైవేట్‌రంగ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ బుధవారం ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌తో విదేశీ రోమింగ్ పథకాలను ప్రారంభించింది. 1,199 రూపాయల ప్రారంభ ధరతో మొదలయ్యే 10 రోజుల అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్‌తో మొబైల్ ఇంటర్నెట్ ధరలు 99 శాతం వరకు తగ్గుతుండటం గమనార్హం. మెగాబైట్ 3 రూపాయలకే లభించనుంది. అంతకుముందు దీని ధర 650 రూపాయలు.

10/27/2016 - 07:12

ముంబయి, అక్టోబర్ 26: మార్ట్‌గేజ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో 16 శాతం పెరిగి 2,446.21 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 2,103.51 కోట్ల రూపాయలుగా ఉంది.

10/26/2016 - 08:34

ముంబయి, అక్టోబర్ 25: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 20.4 శాతం పెరిగి 3,455.3 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం 2,869.5 కోట్ల రూపాయలుగా ఉంది.

10/26/2016 - 08:33

ముంబయి, అక్టోబర్ 25: దేశీయ ప్రముఖ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహీంద్ర బ్యాంక్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై- సెప్టెంబర్)లో నిరుడుతో పోల్చితే 27.6 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో బ్యాంక్ లాభం 941.89 కోట్ల రూపాయలుగా ఉంటే, ఈసారి 1,202.40 కోట్ల రూపాయలుగా ఉంది.

10/26/2016 - 08:33

ముంబయి, అక్టోబర్ 25: దేశీయ ప్రముఖ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 83 శాతం తగ్గింది. మొండి బకాయిల కారణంగా 319 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో బ్యాంక్ లాభం 1,915.64 కోట్ల రూపాయలుగా నమోదైంది.

Pages