S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/15/2016 - 07:49

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమ ల్యాండ్‌లైన్ వినియోగదారులకు సోమవారం అపరిమితంగా ఉచిత కాల్స్ ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే ఈ నెల 21 నుంచి ప్రతి ఆదివారం దేశంలోని ఏ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నెంబర్లకైనాసరే ఉచితంగా ఎంతసేపైనా ల్యాండ్‌లైన్ నుంచి మాట్లాడుకోవచ్చని టెలికామ్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

08/15/2016 - 07:48

హైదరాబాద్, ఆగస్టు 14: ఔషధరంగ సంస్థ అరబిందో ఫార్మా.. ఓ వ్యాక్సిన్ ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఏటా 50 మిలియన్ మోతాదులతో తయారయ్యే ఈ వ్యాక్సిన్ల ప్లాంట్.. 2018 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుంది.

08/15/2016 - 08:14

రాయ్‌పూర్, ఆగస్టు 14: వ్యాపార నిర్వహణ సులభతరం కావాలంటే క్షేత్ర స్థాయిల్లోనూ సంస్కరణలు అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఆదివారం దుర్గ్ జిల్లా ప్రధాన కేంద్రంలో జరిగిన సెమినార్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ పురపాలక, పంచాయతీలను కూడా సంస్కరించాలని అన్నారు.

08/14/2016 - 07:33

న్యూఢిల్లీ, ఆగస్టు 13: రుణపీడిత విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ.. తాజాగా మరో కేసును నమోదు చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నుంచి తీసుకున్న 1,600 కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించడంలో మాల్యా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేసింది.

08/14/2016 - 07:31

కాకినాడ, ఆగస్టు 13: రానున్న రెండేళ్ళలో తూర్పు గోదావరి జిల్లాలో పలు భారీ పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సుమారు 2 వేల కోట్ల రూపాయలతో జిల్లాలో 6 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ యంత్రాంగం అనుమతులు జారీ చేసింది. జిల్లా కేంద్రం కాకినాడ సహా తీర ప్రాంతంలో ఈ భారీ పరిశ్రమలను ఏర్పాటుచేయనున్నారు. భారీ పరిశ్రమలతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా తూర్పు తీరంలో ఏర్పాటుకానున్నాయి.

08/14/2016 - 07:30

కడప, ఆగస్టు 13: స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు వేలం వేసేందుకు గ్లోబల్ టెండర్లకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు శనివారం ఎర్రచందనం భద్రపరిచిన గోడౌన్ల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో వివిధ గోడౌన్లలో భద్రపరచిన దాదాపు 8,585 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను ఏ-గ్రేడ్, బి-గ్రేడ్, సి-గ్రేడ్‌లుగా విభజించారు.

08/14/2016 - 07:30

ముంబయి, ఆగస్టు 13: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ గడచిన వారం కూడా లాభాల్లోనే ముగిసింది. అంతకుముందు రెండు వారాల్లో మాదిరిగానే.. పడుతూ లేస్తూ సాగిన ట్రేడింగ్‌లో మూడో వారమూ సెనె్సక్స్ లాభాలను అందుకోగలిగింది. 74.05 పాయింట్లు పెరిగి 28,152.40 వద్ద స్థిరపడింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం గడచిన వారం 11 పాయింట్లు పడిపోయి 8,672.15 వద్ద నిలిచింది.

08/14/2016 - 07:29

న్యూఢిల్లీ, ఆగస్టు 13: లిక్కర్ తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 20.40 శాతం పెరిగి 147.06 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో లాభం 122.14 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శనివారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలియజేసింది.

08/14/2016 - 07:28

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. తమ ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఈ నెల 21 నుంచి ఆదివారాల్లో అపరిమిత కాల్స్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా దేశంలోని ఏ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నెంబర్లకైనాసరే ఉచితంగా ప్రతి ఆదివారం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు.

08/13/2016 - 04:44

ముంబయి, ఆగస్టు 12: దేశీయ బ్యాంకింగ్‌రంగ దిగ్గజం, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో భారీగా క్షీణించింది. 1,046 కోట్ల రూపాయలుగానే నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో లాభం 4,714 కోట్ల రూపాయలుగా ఉంది. పెరిగిన మొండి బకాయిలే లాభాల్లో క్షీణతకు ప్రధాన కారణం.

Pages