S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/06/2016 - 08:13

న్యూఢిల్లీ, ఆగస్టు 5: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని శుక్రవారం ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ కలుసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఈ నెల 9న జరగనున్న క్రమంలో జైట్లీని రాజన్ కలుసుకున్నారు.

08/05/2016 - 02:19

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ప్రభుత్వరంగ మైనింగ్ సంస్థ ఎన్‌ఎమ్‌డిసికి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో వజ్రాల అనే్వషణకు కావాల్సిన అనుమతిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో అత్యున్నత వ్యవస్థ అయిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్‌ఎసి) ఈ అనుమతిని ఎన్‌ఎమ్‌డిసికి అందించింది.

08/05/2016 - 02:20

చిత్రం.. గురువారం హైదరాబాద్‌లో టిస్సాట్ సరికొత్త వాచీలను
మార్కెట్‌కు పరిచయం చేస్తున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనె

08/05/2016 - 02:17

దేశంలోనే సంపన్నుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వేతనం వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా 15 కోట్ల రూపాయలుగానే ఉంది. సంస్థకు చెందిన మిగతా ఉద్యోగులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వేతనాలు పెరిగినప్పటికీ అంబానీ మాత్రం 15 కోట్ల రూపాయలనే తీసుకుంటున్నారు.

08/05/2016 - 02:15

న్యూఢిల్లీ, ఆగస్టు 4: సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంపట్ల పారిశ్రామిక, వ్యాపార రంగం ఆనందం వ్యక్తం చేసింది. ఈ పరోక్ష పన్ను సంస్కరణ ద్వారా భారత్‌కు విదేశీ మదుపరులు పోటెత్తుతారని, ఉత్పాదక రంగం కార్యకలాపాలు పెరుగుతాయని, దీంతో దేశ జిడిపి కనీసం 2 శాతమైన వృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది. ‘జిడిపితో ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయవచ్చు.

08/05/2016 - 02:13

ముంబయి, ఆగస్టు 4: విలువలు, నీతి, నియమాలు లేని సంస్థల ద్వారా వచ్చే అక్రమ ధనానికి కళ్లెం వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గురువారం sachet. rbi.org.in అనే ఓ వెభ్‌సైట్‌ను ప్రారంభించింది. సదరు సంస్థల సమాచారం తెలిసినవారికి ఈ వెబ్‌సైట్ ఉపకారిగా ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.

08/05/2016 - 02:11

ముంబయి, ఆగస్టు 4: మళ్లీ అదే జరిగింది. మాల్యా ఆస్తుల వేలానికి దిగిన బ్యాంకర్లకు మరోసారి భంగపాటు తప్పలేదు. ధర తగ్గించినప్పటికీ కింగ్‌ఫిషర్ హౌస్‌ను కొనేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు మరి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరిట బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని, వాటిని చెల్లించలేక మాల్యా విదేశాలకు పారిపోయినది తెలిసిందే.

08/05/2016 - 02:09

ముంబయి, ఆగస్టు 4: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకోగలిగాయి. అయితే స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి.

08/05/2016 - 02:08

విశాఖపట్నం, ఆగస్టు 4: డునాట్ డిస్టర్బ్ (డిఎన్‌డి) కింద నమోదు చేసుకున్నప్పటికీ వివిధ టెలీ మార్కెటీర్ల నుంచి వస్తున్న కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు చెక్ పెట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఒక యాప్‌ను రూపొందించింది. డిఎన్‌డి సర్వీస్ యాప్‌గా వ్యవహరించే ఈ యాప్‌ను సెల్‌ఫోన్ వినియోగదారులకు ట్రాయ్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

08/04/2016 - 08:42

న్యూఢిల్లీ, ఆగస్టు 3: చారిత్రాత్మక జిఎస్‌టి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంపట్ల పారిశ్రామిక, వ్యాపార రంగాలు హర్షం వ్యక్తం చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఈ వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు రాజ్యసభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం అభినందించదగ్గ పరిణామంగా పలువురు అభిప్రాయపడ్డారు.
‘దేశంలో పన్నులకు సంబంధించి అతిపెద్ద సంస్కరణ ఇది. దీనివల్ల ఎన్నో ఆర్థిక ప్రయోజనాలుంటాయి.’

Pages