S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/11/2016 - 07:31

ముంబయి, ఆగస్టు 10: బహుళ వ్యాపార దిగ్గజం, టాటా గ్రూప్‌నకు చెందిన సంస్థ టాటా కెమికల్స్.. తమ యూరియా వ్యాపారాన్ని నార్వేకు చెందిన యరా ఫర్టిలైజర్స్‌కు అమ్ముతున్నట్లు బుధవారం ప్రకటించింది. 2,670 కోట్ల రూపాయలకు ఉత్తరప్రదేశ్‌లోని బర్బాలా వద్దగల తమ ఏకైక యూరియా ఉత్పత్తి కేంద్రాన్ని యరా ఫర్టిలైజర్స్‌కు విక్రయిస్తున్నామంది. దీని వార్షిక ఉత్పాదక సామర్థ్యం దాదాపు 1.2 మిలియన్ టన్నులు.

08/11/2016 - 07:29

హైదరాబాద్, ఆగస్టు 10: ఇంటెక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ సిఎండి నరేంద్ర భన్సాల్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగ్ రతన్ అవార్డును ప్రకటించారు. దేశంలో ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును నరేంద్ర భన్సాల్‌కు అందించింది. తమిళనాడు పూర్వ గవర్నర్ డాక్టర్ భీష్మనారాయణ్ దీన్ని ప్రదానం చేశారు.

08/11/2016 - 07:28

ముంబయి, ఆగస్టు 10: దేశీయ ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016- 17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 12.36 శాతం పెరిగి 955.21 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్- జూన్‌లో ఇది 850.09 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం సంస్థ ప్రకటించింది.

08/11/2016 - 07:27

ముంబయి, ఆగస్టు 10: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. చమురు, గ్యాస్, ఆటో, హెల్త్‌కేర్ షేర్లు లాభాల స్వీకరణకు గురవడంతో గడచిన ఏడు వారాల్లో ఎన్నడూ లేనంతగా ఈ ఒక్కరోజే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ క్షీణించింది.

08/11/2016 - 07:26

హైదరాబాద్, ఆగస్టు 10: నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత పారిశ్రామిక ప్రగతి సూచికలు ఆశించిన స్థాయిలో రాని వైనాన్ని గమనించిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త పరిశ్రమల రాకపై దృష్టి సారించారు. అందులో భాగంగా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు వౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఫలితంగా, రెండు పారిశ్రామిక కారిడార్లు రానున్నాయి.

08/10/2016 - 16:04

దిల్లీ: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు బుధవారం జోరుగా పెరిగాయి. బులియన్‌ మార్కెట్లో బంగారం ధర నేడు రూ. 310 పెరిగింది. దీంతో పది గ్రాముల పసిడి రూ. 31,280గా ఉంది. అంతర్జాతీయంగా 1.1శాతం పెరిగి, సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1,355.41 డాలర్లుగా ఉంది. పసిడి ధర రూ. 31వేల పైకి చేరగా.. వెండి కూడా ఒక్క రోజే రూ. వెయ్యికి పైగా పెరిగి 47వేలు దాటింది. ఒక్క రోజే రూ.

08/10/2016 - 07:46

ముంబయి, ఆగస్టు 9: కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్. వర్షాలు సమృద్ధిగానే కురుస్తున్నప్పటికీ, ద్రవ్యోల్బణం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తుండటంతో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి వెళ్లలేదు. మంగళవారం ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరగగా, ఇది రాజన్‌కు ఆఖరి ద్రవ్యసమీక్ష.

08/10/2016 - 07:41

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఆటోరంగ సంస్థ ఫోర్డ్ ఇండియా తమ ఆస్పైర్, ఫిగో కార్ల ధరలను భారీగా తగ్గించింది. విక్రయాలను పెంచుకోవడంలో భాగంగా వీటి ధరలను ఏకంగా 91,000 రూపాయల వరకు దించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం పెట్రోల్ వెర్షన్‌లో ఆస్పైర్ మోడల్ వాహనాలు ఇకపై 5.28 లక్షల రూపాయల నుంచి 6.8 లక్షల రూపాయల మధ్య అందుబాటులో ఉంటాయని సంస్థ మంగళవారం తెలిపింది.

08/10/2016 - 07:40

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఔషధరంగ దిగ్గజం లుపిన్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 55.12 శాతం పెరిగి 881.95 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 568.55 కోట్ల రూపాయలుగా ఉంది.

08/10/2016 - 07:39

ముంబయి, ఆగస్టు 9: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తాజా ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

Pages