S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

10/17/2018 - 02:36

ఎక్కడ చూసినా మహిళలపై శారీరక, మానసిక హింస.. కుటుంబ సభ్యులు సహా ఇరుగుపొరుగు వారి వేధింపులు.. కార్యాలయాల్లో అరాచకాలు.. కనురెప్పలనే నమ్మలేని దురవస్థ.. బయటకు చెప్పుకుంటే వేధింపులు పెరుగుతాయనే భయం.. సంరక్షించేవారు లేరనే ఆవేదన.. చుట్టూ ఉన్నవారు నచ్చచెప్పే ప్రయత్నమే తప్ప- తప్పు చేసిన వారిని నిలదీసే యోచన లేకపోవడం.. అవతలి వారు శక్తిమంతులని తెలిశాక ఏర్పడే నిస్తేజం..

10/13/2018 - 22:27

అబ్దుల్ కలాం జననం భారతదేశ భవిష్యత్తును ప్రపంచ చరిత్రలోనే నూతనాధ్యాయాన్ని సృష్టిం చేలా చేసింది. 1931, అక్టోబరు 15న జన్మించిన ఆయన ఆదర్శాలను అమలు చేయగలిగినప్పుడు ప్రతి వ్య క్తీ ఒక్కో కలాం కాగలడు. కడవరకూ జీవితాన్ని అధ్య యనం చేసిన ఆయన ఎన్ని ఉన్నత పదవులు చేపట్టినా తన కోసం ఆస్తిపాస్తులేమీ సంపాదించుకోలేదు.

10/13/2018 - 00:27

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలతో మహా కూటమిని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నాలు ఫలించేలా కన్పించడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో విపక్షాలు ఉమ్మడిగా పోటీ చేసి ఇటీవలి ఉపఎన్నికలలో విజయం సాధిం చడంతో అంతా కలిస్తే ఇక మోదీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టేననే అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది.

10/11/2018 - 00:48

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ముహూర్తం ప్రకటించడంతో రాజకీయ పార్టీలు పొత్తులపై దృష్టి సారించాయి. మిగతా పార్టీల కంటే ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు అత్యంత కీలకం. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పలు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కాంగ్రెస్, భాజపాల మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుంది.

10/09/2018 - 23:45

అవినీతి, కపటత్వం అనేవి ప్రజాస్వామ్యానికి ‘అనివార్యమైన ఉత్పత్తులు’ కాకూడదని మహా త్మా గాంధీ ఏ విధంగా వాంఛించారో- అందుకు భిన్నమైన వాతావరణం నేడు దేశంలో అలముకుంది. నీతి నిజాయితీలకు మారుపేరైన వారు సమాజం దృష్టిలో చేతకానివారిగా మిగిలిపోతున్నారు. ‘డబ్బులు తీసుకున్నా ఫర్వాలేదు, పనిచేస్తాడు..’ అనే విపరీత ధోరణికి జనం చేరుకుంటున్నారు. ఒక నాయకుడి అవినీతిని ఎవరైనా ప్రస్తావిస్తే...

10/07/2018 - 02:10

కేరళలో జీసస్ ప్రభువును ఓ ‘ఆర్థడాక్స్ చర్చి’ శిలువపైకి ఎక్కించింది. ఆ రోమన్ కాథలిక్ ఆర్థడాక్స్ చర్చికి చెందిన ఆర్చిబిషప్ పేరు ఫ్రాంకో ములక్కాడ్. ఇటీవల ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో మార్మోగింది. భారతదేశంలో ‘తప్పిపోయిన గొర్రెల’కు మోక్షం ప్రసాదించ వలసిన నైతిక దైవిక ఆధ్యాత్మిక బాధ్యత ‘వాటికన్’ మీద ఉంది. అందుకని ఇక్కడికి విదేశాల నుండి మత ప్రచారకులకు భారీ మొత్తంలో ధన సంపత్తి రావడం జరుగుతున్నది.

10/06/2018 - 00:10

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న చివరి రోజులలో పలు సున్నితమైన అంశాలపై కీలకమైన తీర్పులు ఇస్తూ జస్టిస్ దీపక్ మిశ్రా దేశ ప్రజల దృష్టిని ఆక ట్టుకున్నారు. ఆయనతో పాటు ఇతర న్యాయమూర్తులు కూడా గత పక్షం రోజులలో పలు కీలక తీర్పులు ఇచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన తీర్పులలో- క్రిమినల్ కేసు లున్నవారిని చట్టసభలకు ఎన్నిక కాకుండా చేయడం ఎ లా? అనేది ముఖ్యమైనదిగా చెప్పవచ్చు.

10/04/2018 - 01:55

ఐక్యరాజ్యసమితి ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ పురస్కారంతో నన్ను మంగళవారం సత్కరించింది. ఈ గౌరవాన్ని అందుకుని నేను పులకాంకితుడనయ్యాను. ఇది ఒక వ్యక్తికి దక్కిన గౌరవంగా కాక.. ప్రకృతిమాతతో సామరస్య పూర్వక జీవన విధానాన్ని సర్వదా బోధించే భారతీయ సంస్కృతికి, విలువలకు లభించిన గుర్తింపుగా పరిగణిస్తున్నాను.

10/03/2018 - 02:16

మునె్నన్నడూ లేనంతగా ఇపుడు కుల, మత, సైద్ధాంతిక విభేదాలతో జనం చీలిపోయారంటూ సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యా యమూర్తిగా బాధ్యతలు స్వీకరించే జస్టిస్ రంజన్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచనల్లో పడవేశాయి. ఏం చదవాలి? ఏం తినాలి? ఎలా మాట్లాడాలి?

10/02/2018 - 01:30

నేడు గాంధీ మహాత్ముని 150వ జయంతి
*

Pages