S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయన్ ఫీచర్
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిపాలన వికేంద్రీకరణ చేసి మూడు నగరాలకు విస్తరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన సర్వజనుల ఆమోదం పొందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశాలపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం కనపడుతోంది.
ఒక అమాయకుడికి శిక్ష విధించడం కంటే వెయ్యి మంది దోషులను వదిలేయడం మంచిది, మరింత తృప్తికరమైనది అని 12వ శతాబ్దపు సెఫార్టిక్ న్యాయకోవిదుడు మోసెస్ మైమోనిడెస్ పేర్కొన్నారు. దోషిని వదిలేసినా పర్వాలేదు, నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదనే సహజన్యాయ సూత్రం ప్రాతిపదికగా భారత్‌లో న్యాయవ్యవస్థ ఎదిగింది. ఈ సూత్రమే న్యాయప్రక్రియకు అతి పెద్ద ప్రతిబంధకంగా తయారైంది.
స్వతంత్ర భారతంలో ఎన్నో గందరగోళాలకు కారణమైన ఒకే ఒక్క మాట ‘‘సెక్యులరిజం’’. ఈ మాటకు అవసరాన్నిబట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం మార్చేస్తున్నారు. ఎవరికి తోచిన వివరణ వారిది. అయితే ఎట్టకేలకు సెక్యులరిజానికి నిఖార్సయిన నిర్వచనం దొరికింది. అదేమిటో తెలుసా?
‘‘హిందుత్వంపై ద్వేషం వెళ్ళగక్కడానికి భారతీయ కుహనా మేధావులు వంటబట్టించుకున్న పాశ్చాత్యుల భావనయే సెక్యులరిజం అంటే!’’
కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం సాగినంత కాలం గవర్నర్ల వ్యవస్థ గురించి చెప్పుకోదగిన వివాదాలు చెలరేగలేదు.
‘దిశ’, ‘ఉన్నావ్’ తదితర సంచలనాత్మక సంఘటనల్లో సత్వర న్యాయం ఇచ్చే న్యాయవ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. సత్వర న్యాయమంటే నిందితులను ఎన్‌కౌంటర్ పేరిట చంపేయాలని ప్రజలు కోరడం లేదు. ‘దిశ’ ఘటనలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల వైఫల్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు అమలులోకి రావడం ద్వారా నిర్దిష్ట నిబంధనలను పాటించిన కాందిశీకులకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది. పౌరసత్వం అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతో వ్యక్తులకు ఉండే సన్నిహిత సంబంధానికి ప్రతీక అవుతుంది. పౌరసత్వం సగటు పౌరుడికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది.
నవంబర్ 26, 2008 తేదీని భార తీయులెవ్వరూ మరచిపోలేరు. భారత దేశ చరిత్రలో ఇదొక దుర్దినం అని చెప్పవచ్చు. పాకిస్తాన్ నుండి లష్కర్-ఇ-తోయిబా ఉగ్ర వాదులు 10 మంది ముంబయిలోకి ప్రవేశించి, వివిధ ప్రదేశాల నుండి నిర్దాక్షిణ్యంగా సుమారు 160 మంది పౌరులు, భద్రతా సిబ్బంది, పోలీస్ సిబ్బందిని హతమార్చారు.
‘జస్టిస్ ఫర్ దిశ’ నినాదంతో ఇపుడు దేశం యావ త్తూ ఉద్యమిస్తోంది. అత్యాచారం కేసుల్లో దోషులకు ఉరిశిక్ష ప్రకటిస్తూ కోర్టులు తీర్పులు ఇచ్చినా అమలుకాని పరిస్థితులు నెలకొన్నాయి. గత 19 ఏళ్లలో కేవలం నలుగురికి మాత్రమే మన దేశంలో మరణశిక్షను అమలు చేశారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన ధనుంజయ్ ఛటర్జీని అలీపూర్ (పశ్చిమ బెంగాల్) జైలులో 2004 ఆగస్టు 14న ఉరి తీశారు.
వందల ఏళ్లుగా వలస ప్రాంతంగా ఉన్న హాంక్‌కాంగ్‌లో ఇపుడు స్వతంత్య్ర రాజ్యం కోసం ఉద్యమాలు రాజుకున్నాయి. గత పదేళ్లుగా క్రమం తప్పకుండా కొనసాగుతున్న ఈ ఉద్యమాలు కొత్త రూ పాన్ని సంతరించుకొన్నాయి. వేల ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాంతం హాంక్‌కాంగ్. 156 ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో ఉన్న హాంక్‌కాంగ్ 1997 జూలై 1న చైనా అధీనంలోకి వెళ్లింది.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజల అభీష్టం మేరకు ఏర్పడాలి, సుపరిపాలన సాగించాలి. ప్రస్తుతం మహారాష్టల్రో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. భాజపా, శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీలు అధికారమే పరమావధిగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఘోరంగా అవమానించారు.