S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

11/21/2017 - 23:24

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా చాలా రాష్ట్రాలు కోటాకు మించి కొన్ని కులాలకు, మతాలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనలు వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు మొత్తం కోటాలో 50 శాతం మించరాదు. తమిళనాడులో 69 శాతం, కర్నాటకలో 73 శాతం, రాజస్థాన్ సహా మరి కొన్ని రాష్ట్రాలు 68 శాతం మేర రిజర్వేషన్లను ప్రతిపాదించాయి.

11/21/2017 - 00:52

జూలియస్ అసాంజే వెలువరించిన ‘వికీలీక్’ పేపర్లు సృష్టించిన ప్రకంపనలు సద్దుమణగకముందే పనామా పత్రాలు బయటకు వచ్చాయి. వీటిల్లో బ్రిటన్ చైనా రష్యా భారత్ వంటి ప్రపంచ అధినేతల పేర్లున్నాయి. వీరంతా నల్లకుబేరులు. అంటే తమతమ దేశాలకు చెందిన ఆస్తులను లెక్కపత్రం లేకుండా హవాలా మనీలాండరింగ్ మార్గాలలో ఏవేవో బ్యాంకులలో దాచుకున్నవారు వాటికి పన్ను కట్టలేదు. డబ్బు-ఎకౌంట్స్ కోడ్ నేమ్స్‌తో ఉంటాయి.

11/19/2017 - 23:38

విద్యార్థుల ఆత్మహత్యలకు తల్లిదండ్రులే కారణమంటూ గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో వాస్తవం లేదు. కాని, తల్లిదండ్రులే ఎందుకు కారణమవుతున్నారో, దాన్ని ఎలా నివారించాలో ఎక్కడా పొందుపర్చలేదు.

11/19/2017 - 01:35

సరిగ్గా వారం క్రితం కృష్ణమ్మ ఒడిలో కేరింతలు కొడుతున్న పర్యాటకులను నిర్లక్ష్యమనే రక్కసి మింగేసిన వైనం ఇంకా జనం స్మృతిపథం నుంచి చెరిగిపోలేదు. 23 మంది అమాయకుల ప్రాణాలు జలగర్భంలో కలిసిన తర్వాత కదిలిన సర్కారు, వారి ప్రాణాలకు షరామామూలుగా ఖరీదు కట్టినా, పోయిన ప్రాణాలయితే తిరిగి రావు.

11/18/2017 - 00:46

గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికలపై ఇప్పుడు దేశ ప్రజలందరి దృష్టి మరలింది. పుష్కర కాలంపాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశ ప్రజల దృష్టి ఆకట్టుకొని, ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీకి ముఖ్యంగా ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాకరంగా మారాయి. బహుశా 2002 తరువాత మోదీ ఎన్నడూ ఇంతటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు కనబడటం లేదు.

11/18/2017 - 00:40

గతంలో గుజరాత్ సముద్ర తీరంలో ఓ సంఘటన జరిగింది. సముద్రం కొస నుండి గుజరాత్ తీరానికి ‘షార్క్ జెల్’ అనే చేపలు వచ్చి కొన్ని నెలలుండి సంతతిని వృద్ధి చేసుకునేవి. అయితే ఆ చేపలకు ఎక్కువ గిరాకీ ఉండడంవల్ల జాలరులు వాటిని పట్టి అమ్ముకొని ఎక్కువ డబ్బు సంపాదించేవారు. అరుదైన ఈ చేపల సంతతిని రక్షించాలని గుజరాత్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

11/15/2017 - 22:20

తెలుగు భాష గల్లంతయిపోకుండా నిరోధించడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుం బిగించడం తెలుగు ప్రజల హృదయసీమలను ‘‘ప్రహర్ష పరిప్లుతం..’’ చేస్తున్న శుభపరిణామం! తెలుగు భాషలోని అక్షరాలు కొన్ని గల్లంతయిపోవడం తెలుగు భాష గల్లంతయిపోవడానికి దారితీసిన విచిత్ర పూర్వరంగం. నిజానికి ఈ అక్షరాలు గల్లంతు కాలేదు, కొంతమంది విబుధదైత్యులు పనికట్టుకొని గల్లంతు చేశారు!

11/15/2017 - 02:32

న్యాయస్థానాలు అవినీతికి అతీతం అని అంతా భావించే సమయంలో గాలి జనార్దన రెడ్డి బెయిల్ వ్యవహారంలో ‘కోట్లు’ కేసు అనుమానాలను చెరిపేసింది. రాజకీయ వ్యవస్థకు, పాలనా వ్యవస్థకు మాత్రమే పరిమితమైన అవినీతి కళంకం న్యాయవ్యవస్థ గడప తొక్కింది. గాలి బెయిల్ కేసులో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి టి పట్ట్భారామారావు, ఆయనను నచ్చచెప్పినందుకు జడ్జీలు టి లక్ష్మీనరసింహరావు, డాక్టర్ డి ప్రభాకరరావులు పదవులు కోల్పోయారు.

11/13/2017 - 00:17

‘నిర్బంధ అధికార భాష అంటే అర్థమేమిటి? ఆచరణలో, రష్యా ప్రజానీకంలో మైనారిటీగా వున్న మహారష్యన్ల (ఉజజఆళ) భాషను రష్యాలోని ఇతర ప్రజానీకమంతటిమీద విధించడం దాని అర్థం. ప్రతి బడిలోనూ అధికారిక భాషను బోధించడం తప్పనిసరి కావాలి.

11/12/2017 - 00:47

తండ్రి: పిల్లలూ.. ఈరోజు ఎవరైతే భోజనం చేయకుండా ఉంటారో వాళ్లకు ఐదు రూపాయలిస్తా
పిల్లలు ఐదురూపాయలు తీసుకుని పడుకుంటారు. మళ్లీ పొద్దునే్న..
తండ్రి: పిల్లలూ మీకు టిఫిన్ కావాలంటే ఐదు రూపాయలవుతుంది.
పిల్లలు: నువ్వు డాడీవా? మోదీవా?

Pages