S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

12/01/2017 - 01:08

ఆలయంలో ప్రధాన పూజారి కృష్ణుడికి పూజ చేస్తూ ఉన్నాడు. అక్కడికి మీరాబాయి వచ్చింది. ఆమెను చూసి పూజారి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. పట్టలేనంత ఆవేశం అతనిలో కలిగింది. ఆగ్రహంతో ‘‘మీరా! నీవు వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపో, ఇక్కడి ఆలయంలోకి ఏ స్ర్తికి అనుమతి లేదని నీకు తెలియదా!’’ అన్నాడు.

11/29/2017 - 23:24

పద్మావతి- అన్న హిందీ చలనచిత్రాన్ని నిర్మించిన ‘సంజయ్‌లీలా బన్సాలీ’ అన్న దర్శకుడు బౌద్ధిక బీభత్సకాండకు ఒడిగట్టినట్టు ఇప్పుడు ధ్రువపడింది. వాస్తవాలను వక్రీకరించి జాతీయ చరిత్రను వికృతపరచడానికి జరిగిన యత్నం బౌద్ధిక బీభత్సకాండ! భౌతికంగా హత్య చేస్తున్నవారికి భౌతిక హత్య చేయడానికి ప్రయత్నించినవారికి ‘భారతీయ శిక్షాస్మృతి’- ఇండియన్ పీనల్ కోడ్- ఐసిసి ప్రకారం శిక్షలను నిర్దేశించి ఉన్నారు.

11/28/2017 - 23:14

దేశంలోని మూడు ప్రజాస్వామ్య మూలస్తంభాలైన కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలలో ఎవరు గొప్ప ? ఎవరిది పైచేయి? రాజ్యాంగం ఏం చెబుతోంది. అత్యంత సంక్షుభిత సమయంలో మూడు వ్యవస్థలు కలిసి ఉమ్మడిగా ఎలా పనిచేయగలుగుతున్నాయి? ఇంత ఆదర్శప్రాయమైన వ్యవస్థలు ప్రపంచంలో మరేదేశంలోనూ లేవనడం అతిశయోక్తి కానేకాదు.

11/28/2017 - 00:02

న్యూఢిల్లీలో ఒక సాయంత్రం!
భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ అల్పాహారం సేవిస్తున్నారు. ఇంతలో పానకంలో పుడకలా ఒక ప్రముఖుడు వచ్చి రాజుగారి దర్శనం చేసుకున్నాడు.
ఆ వచ్చిన వ్యక్తి పేరు సిన్హా- ఈయనను ‘కాగ్’ అధిపతి అంటారు.
‘‘మహాప్రభూ! నా పేరు సిన్హా- నేను కాగ్- ఇడి పక్షాన తమకు కొన్ని రహస్య పత్రాలు సమర్పించుకోవాలని వచ్చాను’’అన్నాడు.
‘‘దానిదేముంది? టేబిల్‌మీద పెట్టి వెళ్లిపోండి’’.

11/26/2017 - 23:53

ఆ దేశంలో అడుగు పెట్టాలంటే, విమానాశ్రయంలో అక్కడి అధికారులు చెప్పినట్టు చేయాల్సిందే! మాజీలు, హాజీలు అనే తేడా లేకుండా వలువలు కూడా ఒలిచి చూపాల్సిందే! మాజీ రాష్టప్రతి హోదాలో అబ్దుల్‌కలామ్‌కు న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో జరిగిన అవమానం తెలిసిందే! ఆ దేశంలో దౌత్యం నెరవేర్చే అధికారిణి అయినా, మీరాశంకర్‌కు మిసిసిప్పిలో అదే పరాభవం!

11/25/2017 - 22:38

సహనం అన్నింటికీ మంచిది. అసహనం మనిషి వ్యక్తిత్వాన్ని, తనలో ఉన్న రెండో మనిషిని ప్రపంచానికి తనకు తెలియకుండానే పరిచయం చేసుకుంటుంది. నోరు జారితే మళ్లీ వెనక్కి తీసుకోవడం కష్టం. మామూలు చెట్టుకింద కబుర్లు చెప్పేవారిని ప్రపంచం పట్టించుకోదు.

11/25/2017 - 00:12

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సమాచారం చేరవేయడంలో, ప్రజల మధ్య సమాచారం అందించుకోవడంలో సోషల్ మీడియా వహిస్తున్న పాత్ర విశేషంగా పెరుగుతున్నది. రాజకీయ నాయకులు, ప్రజాజీవనంలో వివిధ రంగానికి చెందిన ప్రముఖుల ప్రతిష్టను, వారికిగల పలుకుబడిని సోషల్ మీడియాలో వారికిగల అనుచరవర్గం, వారికి లభించే స్పందననుబట్టి అంచనా వేయడం జరుగుతున్నది.

11/24/2017 - 02:05

‘‘దేవాలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్ఠ చేసే సమయం ఆసన్నమైంది. నేను రాష్టప్రతి డా రాజేంద్రప్రసాద్‌గారిని కలిసి ఆ కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించాను. అప్పుడే నేను ఒక మాట స్పష్టంగా చెప్పాను. మాకు ఆశాభంగం కల్గించకుండా, తప్పకుండా వచ్చేటట్లయితేనే మా ఆహ్వానాన్ని అంగీకరించాలని కోరాను. ప్రధానమంత్రి వైఖరి ఎలా ఉన్నప్పటికీ తాను వచ్చి తప్పక మూర్తి ప్రతిష్ఠ చేస్తానని డా.రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు.

11/22/2017 - 21:54

త్రేతాయుగం నాటి రఘురాముని భార్య సీతను కించపరిచే యత్నాలు జరిగాయి, ద్వాపర యుగం నాటి పాండవ పత్ని ద్రౌపదిని ‘జారిణి’గా ప్రచారం చేయడానికి కుట్రలు కొనసాగాయి. భారతదేశాన్ని బద్దలుకొట్టడానికి హైందవ జాతీయ చరిత్రను వికృతపరచడానికి విబుధ దైత్యులు శతాబ్దులుగా కొనసాగిస్తున్న బౌద్ధిక బీభత్సకాండ- ఇంటలెక్చువల్ ఫార్మ్ ఆఫ్ టెర్రరిజమ్‌లో ఇలాంటి అబద్ధ ప్రచారాలు భాగం.

11/21/2017 - 23:24

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా చాలా రాష్ట్రాలు కోటాకు మించి కొన్ని కులాలకు, మతాలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనలు వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు మొత్తం కోటాలో 50 శాతం మించరాదు. తమిళనాడులో 69 శాతం, కర్నాటకలో 73 శాతం, రాజస్థాన్ సహా మరి కొన్ని రాష్ట్రాలు 68 శాతం మేర రిజర్వేషన్లను ప్రతిపాదించాయి.

Pages