S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

07/25/2019 - 02:04

అన్ని విధాలుగా భారత్‌లో అంతర్భాగంగా ఉన్న కశ్మీర్‌పై ‘శే్వతసౌధం అధిపతి’, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ అనుచితం. కశ్మీర్ సమస్యను దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గతంలోనే నిర్ణయించాయి. ఇందులో మూడవ దేశానికి స్థానం లేదు.

07/24/2019 - 01:49

‘చంద్రయాన్-2’తో భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్య చకితుల్ని చేసింది. స్వీయ నియంత్రణ వ్యవస్థలతో, దేశీయ ఉత్పత్తులతో ఉపగ్రహాల రూపకల్పన మొదలు ప్రతి దశలో సొంత పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రపంచ పెద్దన్నల పాత్రను తగ్గిస్తూ భారత్ ఖ్యాతి గడించింది. అంతరిక్ష రంగంలో భారత్ అద్భుత విజయాలను మున్ముందు కూడా సాధించనుండడం తిరుగులేని సత్యం.

07/21/2019 - 02:16

వారం తిరగకముందే మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ల పేర మరో ఇద్దరిని దారుణంగా హతమార్చారు. గత వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీటీసీ సభ్యుడిని పోలీసు ఇన్‌ఫార్మర్ అంటూ కాల్చి చంపగా, ఈ వారం విశాఖ మన్యంలో పోలీసు ఇన్‌ఫార్మర్లంటూ ఇద్దరు గిరిజనులను చిత్రహింసల పాలు చేసి చంపారు. ఇలాంటి ఘటనలతో- తమ వర్గం వారినే హతమార్చేందుకు మావోయిస్టులు తీర్మానించుకున్నట్లు తోస్తోంది.

07/19/2019 - 22:12

లోక్‌సభ ఎన్నికలలో పార్టీ పరాభవానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మే 25న రాహుల్ గాంధీ రాజీనామా చేస్తున్నట్లు చెప్ప గానే ముందుగా అందరూ ఒక ‘నాటకం’ అనుకున్నారు. నాలుగు రోజులు బతిమలాడించుకొని రాహుల్ తిరిగి సర్దుకుంటారులే అని భావించారు.

07/18/2019 - 22:13

సంక్షేమ పథకాల వల్లే ఎన్నికల్లో గెలిచి తీరతామని ఏ రాజకీయ పార్టీ భావించినా అది కేవలం భ్రమే! నేతల అనుభవాన్ని, జనాకర్షక కార్యక్రమాలను చూసి ప్రజలు గెలిపించరు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకు పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది.

07/17/2019 - 05:11

సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఈ మ ధ్య ఒక కేసు విచారణలో భాగంగా ఒక యువకుణ్ణి నిర్దోషిగా ప్రకటించింది. పూర్వపరాలు చూస్తే పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఆ యువకుడు బాలుడు మాత్రమే. జువెనైల్ హోంలో చాలా కాలం ఉండి, కేసు పరిష్కృతం కాకపోవడంతో జైలుకు తరలించారు. చాలాకాలం తర్వాత సుప్రీం కోర్టు తీర్పు పుణ్యమాని నిర్దోషిగా విడుదలయ్యాడు. ఆ యువకుడి బాల్యాన్ని తిరిగి ఎవరు వెనక్కు ఇవ్వగలరు?

07/14/2019 - 02:42

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (రాగా) పార్టీ పదవికి రాజీనామా చేశారు. అదేమంత పెద్ద విషయం కాదు, విశేషం అసలే కాదు. అయినా, ఆ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జరగరానిది ఏదో జరిగిపోయిందన్న రీతిలో చిత్రించి, చింతిస్తున్నారు.

07/13/2019 - 01:52

పదహారు మంది కర్నాటక ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చివరకు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం లేదని ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజీనామాలు చేసి తాము ప్రజల వద్దకు వెళతామని వారు కోర్టుకు తెలిపారు. రాజీనామాలను ఆమోదించకుండా తమపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని కూడా వారు కోర్టుకు విన్నవించారు.

07/11/2019 - 01:31

ఆంధ్రా, తెలంగాణ,కేరళ రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ పాగా వేస్తుందా? ఈ రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను విశే్లషిస్తే భాజపా అధికారంలోకి రావడం కల్ల అని ఎవరైనా చెబుతారు. కాని రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఉత్తర, తూర్పు, పశ్చిమ భారతాన్ని జయించి జోరుమీదున్న భాజపా తాజాగా తెలంగాణ దృష్టి సారించింది. ఆంధ్రా, కేరళలో బలపడాలని ఆ పార్టీ పావులు కదుపుతోంది.

07/10/2019 - 02:48

ఎన్నికల ప్రక్రియ మరింత జవాబుదారీగా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న మన దేశంలో విలువలను పాటించాలంటే, ప్రజల నమ్మకాన్ని ఇనుమడింపచేయాలంటే, రాజకీయ పార్టీల్లో విశ్వసనీయతను పెంచాలంటే ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈవీఎంలకు అనుసంధానంగా ఉండే వీవీ ప్యాట్‌ల చీటీల లెక్కింపును పెంచాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు జవాబుదారీతనాన్ని పెంచుతాయా?

Pages