S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

02/02/2020 - 21:47

నేడు దేశంలోని ప్రముఖ హిందూ ప్రార్ధన స్థలం లో ఒకటిగా విశేష ప్రాచుర్యం పొందుతున్న షిర్డీలోని శ్రీ సాయిబాబా ఆలయానికి సంబంధించి ఈ మధ్య ఒక పెను వివాదం తలెత్తింది. సాయిబాబా జన్మస్థలం అంటూ అక్కడకు 272 కి.మీ. దూరంలో గల పత్రీ గ్రామంలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయంచడంతో ఈ వివాదం చెలరేగింది.

01/31/2020 - 06:22

భారతదేశంలోనే రెండు దేశాలను సృష్టించిన వాళ్లు కాశ్మీర్‌లో స్వయం ప్రతిపత్తి రద్దుచేస్తే తట్టుకోలేకపోయారు. ‘కాశ్మీరియత్’ అనేది బయటకు కన్పించే అందమైన పేరు. కానీ దాని వెనుక ‘దారుల్ ఇస్లాం’ భావన దాగి వుంది. అందుకే యాసిన్ మాలిక్ లాంటి నరరూప రాక్షసులు లక్షలాది మంది పండిట్లను దారుణ అత్యాచారాలకు గురిచేసి అక్కడి నుండి వెళ్లగొట్టారు.

01/30/2020 - 01:58

ఆర్థిక మాంద్యం, ఆశాజనకంగా లేని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, అనేక సవాళ్ల మధ్య మరో 48 గంటల్లో ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక కాలంలో 5 శాతం ఉన్న జీడీపీ, రెండవ త్రైమాసిక కాలానికి వచ్చేసరికి 4.5 శాతానికి పడిపోయింది. ఈ పరిస్థితి కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం కూడా 7.5 శాతానికి పెరిగింది.

01/29/2020 - 02:37

భారత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతి పెద్ద జాఢ్యం ఫిరాయింపులు. ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుతో, మ్యానిఫెస్టోతో గెలిచిన తర్వాత ఐదు నిమిషాలు గడవకుండానే మరో పార్టీలోకి ఫిరాయించే రాజకీయ నేతల చరిత్ర భారతీయులకు కొత్త కాదు. భారత రాజ్యాంగం చాలా పటిష్ట నియమ నిబంధనలను, నైతిక విలువలను సూచించినా, వాటన్నింటినీ పక్కన పెట్టి పదవుల కోసమో, డబ్బు కోసమో, ఇతర స్వార్థ ప్రయోజనాల కోసమో..

01/26/2020 - 23:16

పౌరసత్వ సవరణ చట్టం, సీఏఏను అడ్డుకునేందుకు విప క్షాలు చేయని ప్రయత్నం అంటూ లేదు. విద్యార్థులను రెచ్చగొట్టాయి, ముస్లిం మైనారిటీలలో అనవసర భయాందోళనలు ఎగదోశాయి. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ఆందోళనలను ప్రోత్సహిం చాయి. చివరకు, పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయమని, విపక్ష ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి.

01/26/2020 - 02:41

భారత స్వాతంత్య్ర పోరాటంలో నిర్ణయాత్మక పాత్ర వహించడమే కాకుండా, ప్రపంచ చరిత్రలోనే మరెవ్వరూ చేయలేని విధంగా విదేశాలలో జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని, వలస పాలకులపై యుద్ధం ప్రకటించడం ద్వారా భారత్‌ను వదిలి వెళ్లడం మినహా గత్యంతరం లేని పరిస్థితిని బ్రిటిష్ వారికి కలిగించారు.

01/24/2020 - 01:37

ఇటీవల ‘‘ది ఎకనమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్’’ అనే భారత వ్యతిరేక సంస్థ ఓ సర్వేను వెల్లడించింది. ఆ సర్వేలో భారత్‌లో మానవ హక్కుల పరిరక్షణలో భారత్ దిగజారిందని ఆందోళన వ్యక్తం చేసిందట. 2019లో 690 స్కోరు పొంది 51వ స్థానంలోకి చేరిందని, భారత్‌లో పౌర హక్కుల అణచివేత ఎక్కువైందని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసిందట!

01/23/2020 - 04:51

ఆంధ్ర అసెంబ్లీ తాజా సమావేశాల్లో శ్రీబాగ్ అనే పేరు చాలా సార్లు ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తమ ప్రసంగాల్లో శ్రీబాగ్ ఒప్పందం పేరును అనేకసార్లు ప్రస్తావించారు.

,
01/22/2020 - 05:45

దేశంలోని అన్ని వర్గాల వారినీ గౌరవిస్తూ, దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడేందుకు సాహసోపేతంగా ఆర్టికల్ 370ని రద్దుచేసి జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పునర్విభజన చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై న్యాయసమీక్ష మొదలైంది. సర్వోన్నత న్యాయస్థానంలో జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ సూర్యాకాంత్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది.

01/20/2020 - 04:45

సికిందరాబాద్, పరేడ్‌గ్రౌండ్‌లో ఇటీవల జరిగిన ‘కైట్ ఫెస్టివల్’ (పతంగుల పండగ)లో రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఓ విదేశీ నిపుణుడు పతంగిని ఎగురవేశాడు. అంటే ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత ఎంతగా పెరిగిందో దీనివల్ల అర్థమవుతోంది. అలాగే ఇటీవల అమెరికాలోని లాస్‌వేగాస్‌లో వినియోగదారుల (కన్స్యూమర్) ఎలక్ట్రానిక్స్ ప్రదర్శన జరిగింది. ఇందులో భారతదేశానికి చెందిన ప్రణవ్‌మిస్ర్తి కృత్రిమ మేధ ఆధారంగా డిజిటల్ మనిషి (నియాన్...

Pages