S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

09/30/2017 - 00:06

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఎన్నికలకు సిద్ధం కావడానికి వీలుగా తన మంత్రివర్గంలో పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నారని రెండు మూడు నెలలుగా కథనాలు వెలువడుతూ ఉంటే ఏదో బ్రహ్మాండం జరుగబోతున్నట్లు అందరూ భావించారు. అయితే మంత్రివర్గంలో మార్పులు జరిగిన తీరు అందరికీ విస్మయం కలిగించింది.

09/29/2017 - 00:17

ఇద్దరు తాగుబోతులు మధ్యరాత్రి పనె్నండు గంటలకు నిండుగా తాగి ఓ వివాదం ముందు పెట్టుకుని కొట్లాడుతున్నారు.! ఆకాశంలోకి చూపించి ఒకడు అక్కడ కనిపిస్తున్నది చంద్రుడని, మరొకడు సూర్యుడని వాదించుకుంటున్నారు. వాళ్లిద్దరు ఎంతసేపు వాదించుకున్నా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. హటాత్తుగా ఓ పెద్దమనిషి ఆ తోవకుండా వెడుతున్నాడు. అతణ్ణి ఆపి ఆకాశంలో కనిపిస్తున్నది సూర్యుడా! చంద్రుడా! తేల్చిపొమ్మన్నారు తాగుబోతులు.

09/27/2017 - 18:58

కరం కరం కలసి కలసి
కాంతి వ్యూహమవుతున్నది,
కణం కణం కలసి విశ్వ
గణం విస్తరిస్తున్నది..
చినుకు చినుకు చేరి చేరి
సరిత పరుగు తీస్తున్నది,
చేయి చేయి చెలిమి చేసి
శక్తి అవతరిస్తున్నది...

09/27/2017 - 00:52

మనిషి సంఘజీవి, తనచుట్టూ ఏం జరుగుతున్నదో తెలుసుకునే తహతహ ఎపుడూ ఉంటుంది, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, వౌలిక సదుపాయాలు, అత్యాధునిక రవాణా సౌకర్యాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది.

09/26/2017 - 00:33

ప్రథమ భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కళా సాంస్కృతిక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినవారిని సత్కరించే నిమిత్తం సంగీత, సాహిత్య, నాటక అకాడమీలను కేంద్రంలో నెలకొల్పారు. ఇవి కాక పద్మ పురస్కారాలు, దాదా సాహబ్ ఫాల్కే సత్కారాలు, ఉత్తమ చలనచిత్రాలకు ఇచ్చే స్వర్ణ రజత కమలాలు కూడా వున్నాయి. వీటికి న్యాయమూర్తుల కమిటీ వుంటుంది. జ్యూరీ తీర్పు శిరోధార్యం. ఐతే జ్యూరీని నిర్ణయించే అధికారం మంత్రుల మీదే వుంటుంది.

09/25/2017 - 00:46

ఆరవ నిజాం మహబూబ్ అలీబాషా తన పాలన ఎలా సాగుతున్నదో చూడాలనే ఆలోచనతో ఓరోజు రాత్రి చార్మినార్ ప్రాంతంలోని ఓ చిన్న దుకాణానికి పాత గొంగడి కప్పుకుని వెళ్లి, ఓ బీడీకట్ట కొని వెండి సిక్కా ఇచ్చాడట! వెండి సిక్కా ఎక్కడిదని ప్రశ్నించిన దుకాణదారుడికి తన దగ్గర మరికొన్ని వున్నవని చూపాడట! ఆశ్చర్యపడిన దుకాణదారుడు బీడికట్ట ఇచ్చి తాను బయటకు పోయి వస్తానని, బీడి తాగుతూ కూర్చోమన్నాడట!

09/24/2017 - 00:28

‘నాకుతెలిసి రచయితలు సమాజాన్ని చైతన్యం చేయడానికే ఉంటారు. వారి లక్ష్యం, రచనలు ఆ దిశగానే సాగుతుంటాయి. కానీ కొందరిని విద్వేషిస్తూ, సమాజంలో చిచ్చు రేపేవారు రచయితలు అనిపించుకోరు. రచయితలకు చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తించడం సరికాదు. చేతిలో పెన్ను ఉంది కదా అని ఏదంటే అది ఎవరిమీదంటే వారిపైన రాయడం రచయితల లక్షణం కాదు. రచయితలకు ప్రత్యేక చట్టాలేమీ ఉండవు. వైశ్యులు స్వభావసిద్ధంగా ఎవరి జోలికీ వచ్చేవారు కాదు.

09/22/2017 - 23:33

ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎవ్వరు చేయనన్ని విదేశీ పర్యటనలను చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఆయనను గొప్ప నాయకుడిగా ప్రజలముందు ఉంచడం కోసం ఒక వంక కేంద్ర ప్రభుత్వం, మరోవంక బిజెపి విశేష ప్రయత్నాలు చేస్తున్నాయి.

09/22/2017 - 00:08

ఒకపట్టణంలో గొప్ప మేధావిగా పేరొందిన ఒక వ్యక్తి వుండేవాడు. అదే పట్టణంలో మూర్ఖుడుగా చెలామణి అవుతున్న ఓ అవివేకి కూడా ఉన్నాడు. ఓరోజు ఈ అవివేకి తెలివిగల మేధావి దగ్గరకువచ్చి , తాను తెలివిగల వాడిగా కావడానికి ఏదైనా దారి చూపించమన్నాడు. అందుకు ఆ అపరమేధావి ‘నీవు తెలివిగలవాడిగా మారాలనుకుంటున్నావా! లేక అలా కన్పించాలనుకుంటున్నావా? అన్నాడు. ఎందుకంటే తెలివిగల వారిలా కావడం ఒక సుదీర్ఘ ప్రక్రియ.

09/20/2017 - 21:57

బర్మాలోని ‘రోహింగియా’ ప్రజలు మన దేశానికి ఇతర దేశాలకు వలసలెత్తడానికి ప్రాతిపదిక ‘రోహింగియా’లలోని జిహాదీ బీభత్సకారులు! బర్మాను మత ప్రాతిపదికపై విభజించాలని ‘కలలు’ కంటున్న జిహాదీలు క్రీస్తుశకం 1948 నుంచి బర్మాలోని అధిక సంఖ్య బౌద్ధులపై హత్యాకాండ కొనసాగించారు, ఇప్పటికీ కొనసాగిస్తూన్నారు! బర్మాను విభజించాలన్న ‘పగటికల’ అఖండ భారత విభజనతో ముడివడివుంది!

Pages