S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

01/08/2018 - 02:34

తోలు పోయి డోలు వస్తే సంబడమే! మరి డోలు పోయి తోలే మిగులుతే.. అటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో విద్యాపరంగా జరుగుతున్న పరిణామాలు ఇవే! జాతీయ విద్యావిధానం పేరున మోదీ ప్రభుత్వం ముందు సుబ్రహ్మణ్యం కమిటీని వేసింది. ఆ కమిటీ ఓ నివేదికను ఇచ్చింది. ఆ నివేదిక అటకెక్కింది. సంబంధిత మంత్రిణి శాఖ మారింది. తిరిగి కొత్త మంత్రి, కస్తూరి రంగరాజన్ నేతృత్వంలో మరో కమిటీ.

01/07/2018 - 00:36

చలికాలమైనా తుపాను వచ్చినా వేకువజామునే లేచి పిల్లలకు ఇష్టమైన అల్పాహారం, లంచ్ బాక్సులోకి ప్రేమగా వంట చేసి, పిల్లల్ని ముస్తాబు చేసి, నుదుట ముద్దుపెట్టి బడికి పంపిన అమ్మ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చికాకుగా, మూడీగా అగుపిస్తుంది. అలా ఎందుకుందో ఆ పసిప్రాణానికి అంతుపట్టని విషయం. తండ్రో, నానమ్మో వచ్చి అమ్మకి జ్వరమొచ్చింది.

01/06/2018 - 01:29

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుండి భారతీయులలో పలువురి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా మనవాళ్లలో ఆ దేశంలో ఐటి రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు, ఉద్యోగాలు ఆశిస్తున్న వారు, వారి కుటుంబ సభ్యులు, భారతదేశంలో ఐటి రంగంపై ఆధారపడుతున్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

01/05/2018 - 00:55

హైదరాబాద్ నడిబొడ్డున గతనెలలో సంధ్యారాణి అనే యువతిని ప్రేమోన్మాది కార్తీక్ కిరాతకంగా పెట్రోల్ పోసి హత్య చేశాడు. దీనికి కారణం అతని ప్రేమను సంధ్యారాణి తిరస్కరించడమే! ‘ఏకపక్ష ప్రేమ’తో చాలాచోట్ల ఇలాంటి దారుణాలు వెలుగుచూస్తున్నా, కొన్ని మాత్రమే తెరపైన కన్పిస్తున్నాయి.

01/03/2018 - 21:45

క్రీస్తుశకాన్ని ‘సాధారణ’ శకమని, ‘సామాన్యశక’మని, ‘వ్యవహార’ శకమని భావించాలన్న ప్రచారం జరుగుతోంది! ఈ ప్రచారం చారిత్రక ‘అనభిజ్ఞత’కు నిదర్శనం. ఈ ‘తెలియనితనం’ - అనభిజ్ఞత- మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్లుతోంది! మొత్తం ప్రపంచానికి మాత్రమేకాక విశ్వ వ్యవస్థకు వర్తించే ‘కాలగణన’ మాత్రమే ‘సాధారణ’- జనరల్ - లేదా ‘సామాన్య’- కామన్- కాలగణ కాగలదు!

01/03/2018 - 00:31

సగటు భారతీయుడు కోరుకునే రీతిలో ఎపుడూ స్పందించే సర్వోన్నత న్యాయస్థానం 2017లో సంచలన తీర్పుల ద్వారా తనదైన ముద్రవేసుకుంది. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో స్పందించిన తీరు, చారిత్రాత్మక తీర్పులతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచింది. కొన్ని కేసులను కొట్టివేయడం ద్వారా పరిపాలనాపరమైన లొసుగులను కూడా ఎత్తిచూపింది.

01/02/2018 - 00:30

మొన్న బెంగళూరు నుండి బంధువులు వచ్చారు. వారితో ముచ్చటిస్తూ స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని అడిగాను. దానికి వారు జవాబిస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉంది, ఐతే దీనిని (యాంటీ ఇన్‌కంబెన్సీ) బిజెపి ఎంతవరకు ఓట్లకింద మలుచుకోగలదో వేచి చూడాలి అని చెప్పారు.

12/31/2017 - 22:48

నేరాల రొంపి, కుంభకోణాల కంపు. అయినా నేరస్థులే లేని దేశం మనది. కారంచేడు, వాకపల్లిలలో హత్యలు, అత్యాచారాలు! అయితేనేమి హంతకులెవరూ కారు. కీచకులెవరూ లేరు. దశాబ్దాలుగా నాన్చబడే కేసులు, పరిమళాలు వెదజల్లే తీర్పులు. నిన్నటి కథ, నేటి వ్యథ, రేపటి పథాలే! ఆడపిల్లల్ని ఎలా వలవేసి పట్టాలో, వ్యతిరేకించే తల్లిదండ్రుల్ని విలన్లలా ఎలా ముద్రవేసి హింసించాలో బోధించే సినిమాలు.

12/31/2017 - 00:28

పాలకుల కేంద్ర స్థానాలు అందులో భాగస్వాములుగా ఉన్న సచివులను నామమాత్రులను చేస్తున్నాయి. ఇప్పుడు మంత్రుల పరిస్థితి పేరుగొప్ప ఊరు దిబ్బ. ప్రధానమంత్రి కార్యాలయం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయాల ముందు మంత్రుల అధికారాలు దిగదుడుపే. నోరూ, పేరూ ఉన్న వాళ్లే ఏదో బతికేస్తున్నారు. అందరి అధికారాలనూ పీఎంఓ, సీఎంఓలే తనవిగా చేసుకుని శ్వాసించి శాసిస్తున్న పరిస్థితి. ఉత్తరభారతాన ఇలాంటి దృశ్యాలు కనిపించవు.

12/30/2017 - 01:01

మారుతున్న నాగరికత, సినిమా, టీవీల రాకతో ప్రాచీన కాలం నుండి వస్తున్న మనవైన పలు జానపద కళలు, కళా నైపుణ్యాలు సమాధి అవుతున్నాయి. పైగా ఆయా కళలను నమ్ముకున్న వారిని నిరాదరణకు గురి చేయడమే కాకుండా, వారిని నేరస్థులుగా, సమాజ హితానికి ప్రమాదకారులుగా ముద్రవేసి, ఆధునిక నాగరికత వారి ఛాయలకు చేరకుండా ఒక విధంగా కట్టడి చేస్తున్నాము. ఆ విధంగా సమాజ వివక్షతకు గురవుతున్న వారిలో ‘దొమ్మరులు’ కూడా ఉన్నారు.

Pages