S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

10/30/2019 - 02:07

సిరియాలో అమెరికా నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధిపతి అబూ బకర్ అల్ బాగ్దాదీ పీడ విరుగడైంది. అల్ ఖైదా అధిపతి ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టడంతో ప్రపంచానికి ఉగ్రవాద పీడ విరుగుడైందనుకున్న సమయంలో అది బోకోహారం రూపంలోనో, ఇస్లామిక్ స్టేట్ రూపంలోనో వేళ్లూనుకుంది. ప్రపంచవ్యాప్తంగా 210 గుర్తింపు పొందిన ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

10/27/2019 - 01:56

‘‘ఇందు కలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే’’

10/25/2019 - 21:26

భారతీయ ఓటర్లు ప్రపంచంలోనే పరిణతి చెం దిన వారు మాత్రమే కాకుండా, వివేకవంతంగా తీర్పు చెప్పడంలో ఎంతో నేర్పరులు. తాజాగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్ని కలు, ఉపఎన్నికల ఫలితాలు ఈ అంశాన్ని మరో మారు వెల్లడి చేశాయి. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అనంతరం భాజపా ఏకపక్ష ధోరణులకు తిరుగులేదని, దేశంలో మరే రాజకీయ పక్షం ఆ పార్టీ ధాటికి తట్టుకోలేదనే అభిప్రాయం కలిగింది.

10/24/2019 - 01:38

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆర్థిక సంఘం కీలక పాత్ర వహిస్తోంది. 15వ ఆర్థిక సంఘం గడువు ఈ ఏడాది నవంబర్ 30తో ముగుస్తుంది. ఆలోగా ఆర్థిక సంఘం తన నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. ఈ సంఘం ఇచ్చే నివేదిక ప్రాతిపదికగా కేంద్రం వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తుంది. 14వ ఆర్థిక సంఘాన్ని గతంలో యూపీఏ సర్కారు ఏర్పాటు చేసింది.

10/23/2019 - 01:02

‘ఐఎన్‌ఎక్స్ మీడియా’ కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిం ది. ఈ కేసుకు సంబంధించి ఆయన ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్నారు. ఈ కస్టడీ ఈనెల 24 వరకూ కొనసాగనుంది. ఐఎన్‌ఎక్స్ మీడియాకు విదేశీ నిధులను సమకూర్చడంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను చిదంబరం ఎదుర్కొంటున్నారు.

10/20/2019 - 00:12

ఈ దేశంలో ఇంతవరకూ లౌకికవాదం పేరున సాగుతున్న కుల, కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందా? అంటే- నడుస్తున్న చరిత్ర అవుననే అంటోంది. నిజానికి 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే ప్రాంతీయ,కుల,కుటుంబ రాజకీయాల నిజరూపాన్ని, హిందూ వ్యతిరేక లౌకికవాదం వికృత స్వరూపాన్ని ప్రజలు గుర్తిస్తూ వచ్చారు. అందుకే ఆ ఎన్నికల్లో హిందూ జాతీయవాదం జెండా రెపరెపలాడింది.

10/18/2019 - 21:30

స్వాతంత్య్ర సమరంలో సాటిలేని వీరోచిత పో రాటం, త్యాగాలకు ప్రతీకగా నిలిచి, అసమానమైన రీతిలో చిత్రవధలను, కఠి నమైన నిర్బంధాలను ఎదుర్కొన్న వీర సావర్కర్ తాను మృతి చెందిన 53 ఏళ్ళ తర్వాత- ఇప్పుడు మరోమారు రాజకీయ సంచలనం సృష్టిస్తున్నారు.

10/17/2019 - 00:06

కష్టాలు ఒక్కొక్కటిగా వస్తే ఎదుర్కొనవచ్చు. అవి ‘ప్యాకేజీ’ రూపంలో ఒక్క ఉదుటున దాడిచేస్తే ఎవరైనా ఇబ్బంది పడక తప్పదు. తెలంగాణలో అధికార తెరాస పార్టీని ఇపుడు ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి. ఉపఎన్నికలను సహజంగా జనం పెద్దగా పట్టించుకోరు. రాజకీయ పార్టీలు కూడా మొక్కుబడిగా పోటీ చేస్తాయి. అధికార పార్టీ సైతం అంతగా దృష్టి పెట్టదు. అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టేందుకు ఆసక్తి చూపరు.

10/16/2019 - 01:22

కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? పాత కాపులు, యువ నాయకుల మధ్య యుద్ధం జరుగుతోందా? వృద్ధనేతలు, యువ నాయ కులు రెండుగా చీలిపోయరా? పార్టీ ప్రథమ కుటుంబం నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని వాళళూ .. వీళళు పంచుకున్నారా..? సోనియా చుట్టూ చేరిన వృద్ధ నేతల కోటరీ ఆమెకు ‘తాత్కాలిక అధ్యక్షురాలి’ ట్యాగ్ తీసేసి మరో మారు పూర్తి స్థాయిలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని కోరుకుంటున్నారా?

10/13/2019 - 02:16

ప్రాచీన భారతీయ వాంఙ్మయాన్ని పరిశీలించిన వారినెవరినైనా సరే- ఎన్నో సిద్ధాంతాలు, అద్భుత విశేషాల ప్రతిపాదనలతో కూడిన మహోజ్వల భారతీయ వైజ్ఞానిక వారసత్వం తప్పక ఆశ్చర్యపరుస్తుంది. మన ఋషులు, తత్త్వవేత్తలు, ఖగోళ శాస్తజ్ఞ్రులు, గణిత శాస్తజ్ఞ్రులు ఇంకా ఎంతోమంది మహనీయులు వివిధ రంగాలలో తమ యోగదానంతో అద్భుత ఆవిష్కరణలు చేశారు. అనేక వినూత్న సిద్ధాంతాలను ప్రతిపాదించారు.

Pages