S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

10/23/2018 - 05:17

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో భాజపా, సంఘ్ పరివార్‌లు అయోధ్య రామజన్మభూమి వివాదాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నాయి. ఆరెస్సెస్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ దసరా పర్వదినం సందర్భంగా నాగ్‌పూర్‌లో వార్షిక ప్రసంగం చేస్తూ, అయోధ్యలో ‘్భవ్య రామాలయం’ నిర్మించేలా కేంద్రం ప్రత్యేక చట్టం చేయాలని సలహా ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నందున ఆయన సూచన ప్రాధాన్యతను సంతరించుకొంది.

10/16/2018 - 02:31

రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం ‘బోఫోర్స్ అవతారం’ ఎత్తుతోందా? 1989లో తన తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని బోఫోర్స్ పేరుతో ఓడించిన భాజపా, ఇతర పార్టీలపై ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘రాఫెల్’ పేరిట పగ తీర్చుకుంటున్నారా? దాదాపు 29 ఏళ్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ- ‘బోఫోర్స్’ కుంభకోణం పేరుతో ప్రతిపక్షాలు చేసిన ప్రచారం వల్ల ఓడిపోవటం తెలిసిందే.

10/09/2018 - 01:20

దేశంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ శాసనసభల ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించటంతో రానున్న ఆరునెలల పాటు ఎన్నికల వాతావరణం కొనసాగనుంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో రాజుకున్న ఈ రాజకీయ వేడి 2019 ఏప్రిల్, మేలో జరిగే లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో చల్లారుతుంది.

10/02/2018 - 01:25

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నోటి దురుసుతనం, దుందుడుకు వ్యవహారం, ఒంటెద్దు పోకడ మూలంగా ప్రతిపక్షం ఐక్యత దెబ్బ తింటోంది. ఈ సంవత్సరాంతంలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతోపాటు 2019లో జరిగే లోకసభ ఎన్నికల కోసం కూడా ప్రతిపక్షాల మధ్య సయోధ్య, సీట్ల సర్దుబాటు కుదిరే అవకాశాలు మృగ్యమవుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసేందుకు ప్రతిపక్షాల మధ్య జరిగిన చర్చలు ఇది వరకే విఫలమయ్యాయి.

09/25/2018 - 02:23

ఇస్లామిక్ ఉగ్రవాదానికి అప్రకటిత కేంద్రమైన పాకిస్తాన్ దారికి రాదనేది మరోసారి రుజువైంది. న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా జరగాల్సిన రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీని భారత్ రద్దు చేయడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించిన తీరు గర్హనీయం. విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ అహంకారంతో రద్దు చేసిందంటూ ఇమ్రాన్ చేసిన ఆరోపణ పాక్ పాలకుల నియంతృత్వ ఆలోచనలకు అద్దం పడుతోంది.

09/18/2018 - 00:10

వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించి, కేంద్రంలో అధికార పగ్గాలను చేపట్టాలని ఆరాటపడుతున్న విపక్షానికి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి కన్పిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టాక రాహుల్ నాయకత్వానికి కొన్ని విపక్షాలు సుముఖత చూపడం లేదన్న సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్‌తో పొత్తులేకుండా మోదీని ఢీకొనే స్థాయి మిగతా విపక్షాలకు లేదు.

09/11/2018 - 00:03

తొలుత శాసనసభలకు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న భారతీయ జనతాపార్టీ వైఖరి చూస్తుంటే నేల విడిచి సాము చేస్తున్నట్టు ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను గ్రహించి ముందుకు సాగితే ప్రయోజనం ఉంటుందనే వాస్తవాన్ని భాజపా అధినాయకత్వం అంగీకరించడం మంచిది.

09/04/2018 - 01:02

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం రోజురోజుకూ సెగలు పుట్టిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీన్ని అతి పెద్ద కుంభకోణంగా అభివర్ణిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వ అవినీతికి ఇది నిదర్శమంటూ ధ్వజమెత్తుతున్నారు. ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ఏ రాజకీయ నాయకుడైనా ఇదే విధంగా వ్యవహరిస్తాడు.

08/28/2018 - 01:03

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పటం, అసత్యాలను ప్రచారం చేయటంలో పట్టు సాధించటం ద్వారా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగి వచ్చాడని చెప్పక తప్పదు. రాహుల్ గత వారం పది రోజుల నుండి చేస్తున్న ప్రసంగాలు- ముఖ్యంగా గత వారం జర్మనీ, ఇంగ్లాండ్ పర్యటనల సందర్భంగా చేసిన ఆరోపణలు, చెప్పిన విషయాలు చూస్తుంటే రాహుల్ మోసపూరిత రాజకీయాల్లో పరిపక్వత సాధించారనే విషయం స్పష్టమవుతోంది.

08/20/2018 - 23:08

దేశంలో క్రమంగా ఎన్నికల వాతావరణం నెలకొంటోంది. అయితే- లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయా? విడివిడిగా జరుగుతాయా? అన్న విషయాన్ని స్పష్టం చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను అయోమయంలో పడేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎంత స్వతంత్ర సంస్థ అయినప్పటికీ ఎన్నికల విషయంలో అధికారంలో ఉన్న వారి మాట కొంతైనా నెగ్గుతుంది.

Pages