S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

04/14/2020 - 01:32

సమష్టిగా కృషి చేస్తే సత్ఫలితాలు ఉంటాయనేది మరోసారి రుజువైంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఒక లక్షా పదిహేను వేలమందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ మహమ్మారిని నిలువరించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమిష్టిగా చేస్తున్న కృషి ఇందుకు తాజా ఉదాహరణ.

03/17/2020 - 23:38

రాజుల కాలంలో బలమున్న వాడిదే రాజ్యం, అందుకే రాజ్యం వీరభోజ్యం అనేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్య యుగంలో కూడా బలమున్నవాడిదే రాజ్యం అవుతోంది. ఎన్నికల్లో ప్రజలు తమకు మెజారిటీ ఇచ్చారా? లేదా? అనేది ముఖ్యం కాదిప్పుడు. మనం ఎంతమంది ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయగలమనేదే ముఖ్యం. శాసన సభ్యుల సంఖ్యను ఏదో ఒకరకంగా పెంచుకోవటం, ఆ తరువాత అధికారాన్ని హస్తగతం చేసుకోవటం ఒక రాజకీయ ప్రక్రియగా మారింది.

03/10/2020 - 22:39

ప్రపంచంలోని అది పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అయితే మన పార్లమెంటులో అప్రజాస్వామికం కొనసాగుతోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యే అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయకుండా గుత్త్ధాపత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలు మార్చ్ మూడో తేదీ నుండి ప్రారంభమైనా ఏ ఒక్క రోజు కూడా సజావుగా జరగలేదు.

03/03/2020 - 01:01

కాంగ్రెస్ కొట్టుకుపోతోంది, గాంధీ కుటుంబ సభ్యులతోపాటు సీనియర్ నాయకులు కనీసం ఇప్పుడైనా కళ్లు తెరవకపోతే పార్టీని కాపాడటం చాలా కష్టం. కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక అంశంపై పార్టీ రెండుగా చీలిపోవటంతోపాటు ఇరు పక్షాల మధ్య అంతర్యుద్ధం కొనసాతోంది.

02/25/2020 - 00:13

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పి.ఆర్, ఎన్.ఆర్.సి.ని వ్యతిరేకించే నెపంతో మతం ఆధారంగా దేశాన్ని మరోసారి విభజించే కుట్ర జరుగుతోందా? దేశంలోని పదిహేను కోట్ల మంది ముస్లింలు వంద మంది హిందువులను సునాయసంగా ఎదుర్కొనగలరని ఎం.ఐ.ఎం మహారాష్ట్ర అధికార ప్రతినిధి హెచ్చరించటం చూస్తుంటే సి.ఏ.ఏ. ఉద్యమకారుల ప్రయాణం ఎటువైపు అనేది స్పష్టం కావటం లేదా?

02/18/2020 - 02:16

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ విజయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నియంతృత్వంపై విజయం, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల చిట్టా, జాతీయ పౌరుల రిజిష్టరుపై విజయం, మతతత్వవాదంపై లౌకికవాదం విజయం అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా నియంతృత్వం, మతతత్త్వం ఓడిపోయిందంటూ కుహనా లౌకిక వాదులు ప్రచారం చేస్తున్నారు.

02/11/2020 - 01:22

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యతారహిత వ్యవహారం, వ్యాఖ్యల మూలంగా తన ప్రతిష్టను తాను దిగజార్చుకోవటంతోపాటు కాంగ్రెస్ మనుగడను ప్రమాదంలో పడవేస్తున్నారు. రాహుల్ గాంధీ వ్యవహారం ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ బతికి బట్టకట్టటం దాదాపుగా అసాధ్యమని పార్టీ సీనియర్ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు.

02/04/2020 - 01:54

భారత రాష్ట్రపతిని కూడా పార్టీ రాజకీయాలకు బలి చేయటం ప్రతిపక్షానికి ఎంత మాత్రం తగదు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ గత శుక్రవారం నాడు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ప్రతిపక్షం ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులు చేసిన గొడవ ఎంత మాత్రం సమర్థనీయం కాదు.

01/28/2020 - 01:37

రెండు రోజుల క్రితం 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. భారత రాజ్యాంగానికి మనం ఇచ్చే ప్రాధాన్యతకు గణతంత్ర దినం నిదర్శనంగా ఉంటోంది. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాల ఫలితంగా రాజ్యాంగం భ్రష్టుపడుతోందంటూ కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు, కుహనా లౌకికవాదులు పదే పదే ఆరోపిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు ఎన్.పి.

01/21/2020 - 01:20

మూడు ముస్లిం దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిసాతన్‌లలో మతపరమైన హింస మూలంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు భారతీయ పౌరసత్వం కల్పించేందు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఏ రాష్ట్రం కూడా ఆపలేదు. ఈ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదంటూ కేరళ, పంజాబ్ చేస్తున్న ప్రకటనలు, శాసన సభలో ఆమోదించిన తీర్మానాలు ఎంత మాత్రం చెల్లుబాటు కావు.

Pages