S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

04/30/2018 - 23:59

చైనా పాలకులు ఏం చేసినా వారి లాభం కోసమేననేది జగమెరిగిన సత్యం. ఈ వాస్తవాన్ని మన పాలకులు కలలో కూడా మరిచిపోరానిది. ఝీ జింగ్‌పింగ్ చైనా శాశ్వత అధ్యక్షుడైన నేపథ్యంలో ఆయనతో చర్చలు జరిపే వేళ భారత్ ఆచితూచి అడుగేయడం ఉత్తమం. డోక్లామ్ ఉదంతం అనంతరం మన ప్రధాని మోదీ, పింగ్ మధ్య చైనాలోని వుహాన్ నగరంలో తాజాగా జరిగిన అసాధారణ, అనధికార శిఖరాగ్ర చర్చల వల్ల రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు సమసిపోతాయని ఆశించకూడదు.

04/23/2018 - 23:49

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొన్ని విపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించటం అత్యంత కీలక అంశం. బలమైన ఆరోపణలు, వాటికి తగ్గ సాక్ష్యాలు ఉంటేనే చీఫ్ జస్టిస్‌ను అభిశంసించేందుకు ప్రయత్నించాలి. దేశంలో న్యాయవ్యవస్థకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి తలవంటి వాడు.

04/16/2018 - 23:58

ఓటమి ఎరుగని ప్రధాని నరేంద్ర మోదీ అకస్మాత్తుగా అపజయం వైపు పయనిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో తిరుగులేని నేతగా అవతారమెత్తిన మోదీ రాబోయే సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ఆయన నాయకత్వంలో భాజపా మళ్లీ విజయం సాధిస్తుందా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

04/10/2018 - 00:09

పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు పూర్తిగా కొట్టుకుపోవటానికి విపక్షంతో పాటు అధికార పక్షం కూడా బాధ్యత వహించాలి. జా తీయ, ప్రాంతీయ పార్టీల పోటాపోటీ రాజకీయాల వల్లే- నెలరోజుల మలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఏ ఒక్క రోజు కూడా చర్చ జరగలేదు. ఒకటి, రెండు బిల్లులను గందరగోళం మధ్య ప్రభుత్వం పాస్ చేయించుకున్నది.

04/03/2018 - 02:05

శతాధిక కాంగ్రెస్ పార్టీలో నేడు సమర్థ నాయకత్వం లేనందునే ఇపుడు తృతీయ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలు తెరమీదికి వస్తున్నాయి. ప్రధాని మో దీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఏర్పడే ఈ ‘ఫ్రంట్’లు బతికి బట్టకట్టగలవా? ఒకప్పుడు రాజీవ్ గాంధీ హ యాంలో కాంగ్రెస్ బలహీనమైనప్పుడు ప్రాంతీయ పార్టీల కూటములు ఏర్పడినా కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయాయి.

03/27/2018 - 01:06

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా కొనసాగాలంటే ప్రభుత్వం వెంటనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరించాల్సిందే. ఇంతకీ అవిశ్వాస
తీర్మానంపై చర్చకు మోదీ ఎందుకు అంగీకరించటం లేదు? లోక్‌సభలో
భాజపాకు పూర్తి మెజారిటీ ఉంది. తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస
తీర్మానంపై చర్చ జరిగినా ఎన్‌డీఏ ప్రభుత్వానికి వచ్చే నష్టమేదీ లేదు. అవిశ్వాస

03/20/2018 - 01:28

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు అనేదేదీ ఉండదు. నాయకులు తమ రాజకీయ అవసరాల కోసం కలుస్తుంటారు, విడిపోతుంటారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న కొత్త రాజకీయ సమీకరణరలు ఇందుకు తాజా ఉదాహరణ.

03/13/2018 - 00:08

‘ధర్మో రక్షితి రక్షితః’ అన్నట్లు పార్లమెంటును మనం కాపాడితే మనల్ని పార్లమెంటు కాపాడుతుంది. కానీ, ఈ వాస్తవాన్ని విస్మరించి కొందరు పార్లమెంటు సభ్యులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాజకీయాల కోసం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను పెకిలించి వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ రెండో విడత మొదటి వారం సమావేశాలను రాజకీయ కారణాలతో విపక్షం స్తంభింపజేయటం క్షమించరాని నేరం.

03/06/2018 - 00:44

త్రిపురలో పాతికేళ్లుగా అజేయంగా నిలిచిన ‘ఎర్ర’ కోట కుప్పకూలింది. కొంతకాలం క్రితమే అ స్సాంలో అడుగుపెట్టిన భాజపా ఇప్పుడు త్రిపురలో తన పతాకాన్ని ఎగురవేసింది. నాగాలాండ్‌లో మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మేఘాలయలో మెజారిటీ సీట్లు సాధించకపోయినా అధికారాన్ని హస్తగతం చేసుకునేలా భాజపా ఎదగడం ఆషామాషీ కాదు.

02/27/2018 - 00:51

బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వస్తున్న ముస్లింల కారణంగా అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా పరిస్థితులు మారిపోతున్నాయంటూ మన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన హెచ్చరికను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తూ సైనికదళం అధిపతి ఈ ప్రకటన చేయటం చూస్తుంటే ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా అసోంలో స్థానికుల జనాభాతో పోలిస్తే బంగ్లాదేశీయుల జనాభా బాగా పెరిగిపోయి ఉండాలి.

Pages