S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్
త్రిపురలో పాతికేళ్లుగా అజేయంగా నిలిచిన ‘ఎర్ర’ కోట కుప్పకూలింది. కొంతకాలం క్రితమే అ స్సాంలో అడుగుపెట్టిన భాజపా ఇప్పుడు త్రిపురలో తన పతాకాన్ని ఎగురవేసింది. నాగాలాండ్‌లో మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మేఘాలయలో మెజారిటీ సీట్లు సాధించకపోయినా అధికారాన్ని హస్తగతం చేసుకునేలా భాజపా ఎదగడం ఆషామాషీ కాదు.
బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వస్తున్న ముస్లింల కారణంగా అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా పరిస్థితులు మారిపోతున్నాయంటూ మన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన హెచ్చరికను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తూ సైనికదళం అధిపతి ఈ ప్రకటన చేయటం చూస్తుంటే ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా అసోంలో స్థానికుల జనాభాతో పోలిస్తే బంగ్లాదేశీయుల జనాభా బాగా పెరిగిపోయి ఉండాలి.
పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై ప్రజల డబ్బును దోచుకుంటుంటే- ‘అంతా మీ హయాంలోనే జరిగిందంటే.. మీ హయాంలోనే జరిగిందం’టూ అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకోవటం సిగ్గుచేటు.
పార్లమెంటు ఉభయ సభలు రౌడీ రాజకీయానికి గురికావడం సిగ్గుచేటు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించటంతో జనవరి 29న ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి విడత భేటీ శుక్రవారం వరకు జరిగింది. బడ్జెట్ మలివిడత సమావేశాలు మార్చి ఐదు నుండి ఏప్రిల్ ఆరో తేదీ వరకు జరుగుతాయి. ఉభయ సభల్లో తొలి విడత సమావేశాలు ఐదు రోజులూ గందరగోళంలో జరిగాయి.
లోక్‌సభ సహా ఐదారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందు పెట్టుకుని ‘జనాకర్షక’ స్కీమ్‌లకు బదులు ప్రజలకు మేలు చేసే బడ్జెట్‌ను ప్రతిపాదించటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివేకంతో వ్యవహరించారని చెప్పకతప్పదు. ఈనెల ఒకటో తేదీన లోక్‌సభలో జైట్లీ సమర్పించిన 2018-19 వార్షిక బడ్టెట్‌లో వాస్తవ పరిస్థితులకు, ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వటం ముదావహం.
ఆసియాన్ దేశాలకు చెందిన పదిమంది అధినేతల సమక్షంలో రాజ్‌పథ్‌లో 69వ గణతంత్ర దినోత్సవం వేడుకలను మనం అత్యంత వైభవంగా జరుపుకున్నాము. మన సైనికశక్తితోపాటు సాంస్కృతిక భిన్నత్వాన్ని ఆసియాన్ దేశాల అధినేతల కళ్లకట్టేలా ప్రదర్శించాము.
ఒక దేశం, ఒక ఎన్నికల సిద్ధాంతాన్ని ఇకనైనా అమలు చేయటం మంచిది. ఒక దేశం ఒక పన్నుల విధానానికి శ్రీకారం చుట్టిన చోట ఒక దేశం ఒక ఎన్నికల విధానానికి కూడా ఓటు వేయటం మంచిది. గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ప్రక్రియ ముగిసిందో లేదో నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ ఎన్నికలు వచ్చాయి. మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ఒక కొలిక్కి రాగానే కర్నాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికలు తన్నుకు వస్తాయి.
ముందు ఊహించినట్లే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన గొడవలు, గందరగోళం మూలంగా కొట్టుకుపోయాయి. అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటు శీతాకాల సమావేశాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నించటం శోచనీయం.
రాజకీయాలకు సంబంధించి గత ఏడాది కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. పదునైన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, యుద్ధాలతో రాజకీయ రంగం రగిలిపోయింది. ఆ రాజకీయ పరిణామాలు కొత్త సంవత్సరంలోనూ ప్రభావం చూపనున్నాయి. దేశ ప్రథమ పౌరుడు.. రాష్టప్రతి ఎన్నిక, ఆ తరువాత రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్టప్రతి ఎన్నికలతో ఏడు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరిగాయి. గుజరాత్లో బి.జె.పి ఆరోసారి అధికారంలోకి వచ్చింది.
అధికార, ప్రతిపక్ష పక్షాల నాయకులు తమ పార్టీల రాజకీయ లబ్ది కోసం పార్లమెంటు పరువుప్రతిష్ఠలను మంటగలుపుతున్నారు. శీతాకాల సమావేశాలు కూడా రాజకీయాలకు బలై సమయం వృధా అయిపోతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు కావస్తున్నా ఏ ఒక్క రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభ సక్రమంగా పనిచేయలేదు. లోక్‌సభ మధ్యాహ్నం సమయంలో కొంత మేరకు జరుగుతున్నప్పటికీ రాజ్యసభలో మాత్రం ఎలాంటి పని జరగటం లేదు.