S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

06/04/2018 - 23:46

నాలుగు లోక్‌సభ, పదకొండు అసెంబ్లీ స్థానాలకు తాజాగా జరిగిన ఎన్నికల్లో భాజపాకు చేదు ఫలితాలు రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా యూపీలోని కైరానా లోక్‌సభ, నూర్‌పుర్ అసెంబ్లీ స్థానాల ఫలితాలపై పెద్దఎత్తున విశే్లషణ జరిగింది. ఈ రెండు చోట్ల భాజపాను ఓడించడం ద్వారా ‘మతతత్వం వల్ల ప్రజాస్వామ్యానికి కలుగుతున్న ముప్పు నుండి దేశాన్ని రక్షించటంలో విపక్షాలు విజయం సాధించాయ’ని చాలా పత్రికలు కోడై కూశాయి.

05/29/2018 - 00:13

ప్రధాని నరేంద్ర మోదీ గత నాలుగేళ్లుగా దేశం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండనక్కర లేదు. ఆయన రోజూ పద్దెనిమిది గంటల చొప్పున పని చేస్తున్నారు. దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నట్టు ఆయన చెబుతుంటారు. అయితే, ఆ పథకాల వల్ల సగటు మనిషికి మంచి రోజులు వచ్చాయా? అన్నదే ప్రశ్న.

05/22/2018 - 00:31

కర్నాటకలో చోటు చేసుకున్న రాజకీయాలు మన రాజకీయ వ్యవస్థలో పేరుకుపోయిన అవకాశవాదం, అవినీతికి అద్దం పడుతున్నాయి. బి.జె.పి, కాంగ్రెస్, జె.డి.ఎస్ అధికారం కోసం నీతి, నిజాయితీ, విలువలకు శిలువ వేశాయి. మెజారిటీ లేకున్నా బి.జె.పి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. శాసన సభ్యులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించటం ద్వారా బి.జె.పి. తన అవినీతి, అరాచక రాజకీయాలను ప్రదర్శించుకున్నది.

05/14/2018 - 23:56

కర్నాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు భాజపా, కాంగ్రెస్ సహా మరికొన్ని రాజకీయ పక్షాల భవిష్యత్‌ను నిర్దేశించనున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలూ సర్వశక్తులూ ఒడ్డాయి. సామ, దాన,్భద, దండోపాయాలను ప్రయోగిస్తూ విజయమో.. వీరస్వర్గమో అన్నట్టు భాజపా, కాంగ్రెస్ శ్రేణులు సమరాన్ని సాగించాయి.

05/07/2018 - 23:54

ఎన్నికలంటే- ప్రజలను తప్పుడు హామీలతో తప్పుదోవ పట్టించడం, డబ్బులు పంచూతూ ప్రజాస్వామ్య వ్యవస్థను భష్టు పట్టించడంగా మా రింది. నీతి, నిజాయితీ, పారదర్శకత గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలను మాయమాటలతో మోసగించేందుకు యత్నిస్తున్నాయి. ఇందుకు కర్నాటక శాసనసభ ఎన్నికల ప్రచారమే ప్రబల నిదర్శనం.

04/30/2018 - 23:59

చైనా పాలకులు ఏం చేసినా వారి లాభం కోసమేననేది జగమెరిగిన సత్యం. ఈ వాస్తవాన్ని మన పాలకులు కలలో కూడా మరిచిపోరానిది. ఝీ జింగ్‌పింగ్ చైనా శాశ్వత అధ్యక్షుడైన నేపథ్యంలో ఆయనతో చర్చలు జరిపే వేళ భారత్ ఆచితూచి అడుగేయడం ఉత్తమం. డోక్లామ్ ఉదంతం అనంతరం మన ప్రధాని మోదీ, పింగ్ మధ్య చైనాలోని వుహాన్ నగరంలో తాజాగా జరిగిన అసాధారణ, అనధికార శిఖరాగ్ర చర్చల వల్ల రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు సమసిపోతాయని ఆశించకూడదు.

04/23/2018 - 23:49

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొన్ని విపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించటం అత్యంత కీలక అంశం. బలమైన ఆరోపణలు, వాటికి తగ్గ సాక్ష్యాలు ఉంటేనే చీఫ్ జస్టిస్‌ను అభిశంసించేందుకు ప్రయత్నించాలి. దేశంలో న్యాయవ్యవస్థకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి తలవంటి వాడు.

04/16/2018 - 23:58

ఓటమి ఎరుగని ప్రధాని నరేంద్ర మోదీ అకస్మాత్తుగా అపజయం వైపు పయనిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో తిరుగులేని నేతగా అవతారమెత్తిన మోదీ రాబోయే సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ఆయన నాయకత్వంలో భాజపా మళ్లీ విజయం సాధిస్తుందా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

04/10/2018 - 00:09

పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు పూర్తిగా కొట్టుకుపోవటానికి విపక్షంతో పాటు అధికార పక్షం కూడా బాధ్యత వహించాలి. జా తీయ, ప్రాంతీయ పార్టీల పోటాపోటీ రాజకీయాల వల్లే- నెలరోజుల మలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఏ ఒక్క రోజు కూడా చర్చ జరగలేదు. ఒకటి, రెండు బిల్లులను గందరగోళం మధ్య ప్రభుత్వం పాస్ చేయించుకున్నది.

04/03/2018 - 02:05

శతాధిక కాంగ్రెస్ పార్టీలో నేడు సమర్థ నాయకత్వం లేనందునే ఇపుడు తృతీయ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలు తెరమీదికి వస్తున్నాయి. ప్రధాని మో దీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఏర్పడే ఈ ‘ఫ్రంట్’లు బతికి బట్టకట్టగలవా? ఒకప్పుడు రాజీవ్ గాంధీ హ యాంలో కాంగ్రెస్ బలహీనమైనప్పుడు ప్రాంతీయ పార్టీల కూటములు ఏర్పడినా కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయాయి.

Pages