S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

09/23/2018 - 01:26

తిరుమలలో శ్రీవారి హుండీ ద్వారా ఎంత ఆదాయం లభిస్తున్నదీ కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు రోజువారీగా ప్రకటిస్తూ ఉండటం ఎంత మాత్రమూ సమంజసం కాదు. అధికంగా కానుకలు వస్తే భక్తి ఎక్కువగా ఉన్నట్లు, ఆదాయం తగ్గితే భక్తి సన్నగిల్లినట్టుగా మీడియా కథనాలు వస్తున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రం వ్యాపార కేంద్రం కాదు. ఏదో షేర్ మార్కెట్ వివరాలు ప్రకటిస్తున్నట్లుగా ఉంది మీడియా వ్యవహారం.

09/22/2018 - 00:25

పౌష్టికాహార లేమితో బాధపడుతున్న ప్రపంచ జనాభాలో మూడో వంతు మంది భారతదేశంలోనే ఉన్నారు. మన దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో 46 శాతం మంది పౌష్టికాహారం అందక- బరువు తక్కువతో, పెరుగుదల లోపంతో బతుకులీడుస్తున్నారు. ఆ వయసువారిలోనే 70 శాతం మందికి రక్తహీనత. ఈ అంకెలు ఎవరినైనా భయపెట్టే వాస్తవాలను తెలుపుతున్నాయి.

09/21/2018 - 00:49

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం ఈ దశాబ్దపు జోక్‌గా అభివర్ణించవచ్చు. ప్రఖ్యాత సినీ నటుడు ఎన్.టి.రామారావు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.

09/19/2018 - 01:02

అసలే అభివృద్ధిలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా డెంగ్యూ, మలేరియా, డయెరియా, స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి ఈ ప్రాంతాన్ని రోగపీడిత జిల్లాగా మార్చేశాయి. పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం, గాడి తప్పిన వైద్య ఆరోగ్యశాఖ పనితీరు, ముందస్తు చర్యలను చేపట్టడంలో అధికారుల అలసత్వం ప్రజల పాలిట శాపాలుగా మారాయి.

09/09/2018 - 00:10

ఇద్దరు వయోజనులు పరస్పర అంగీకారంతో జరుపుకొనే స్వలింగ సంప ర్కం నేరం కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు బాధాకరం. ఈ తీర్పు మన సనాతన భారతీయ జీవన విధానానికి, పవిత్రమైన వివాహ వ్యవస్థకు, కుటుంబ జీవనానికి విఘాతం కలిగించేదిగా వుంది.

09/07/2018 - 00:12

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు ప్రజలంతా ముక్తకంఠంతో పోరాడుతుంటే, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలలో 85 శాతం అమలు చేశామని ఘనంగా ప్రకటించుకున్నారు. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా తప్పులతడకగా వున్న అఫిడవిట్‌ను దాఖలు చేసి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది.

09/06/2018 - 00:13

మన దేశంలో వృద్ధులు, నిరుద్యోగులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు ఆసరా అందించాలని రాజ్యాంలోని 41వ అధికరణలో పొందుపరచబడింది. అయితే, ఈ అధికరణ అమలులోనికి వచ్చేందుకు దాదాపుగా 48 సంవత్సరాలు పట్టింది. 1995 నుండి వృద్ధులకు పింఛను అరకొరగా ఇస్తున్నందున వారి కనీస అవసరాలు తీరడం లేదు.

09/01/2018 - 00:48

ఆంధ్రప్రదేశ్‌లో మోడల్ స్కూల్స్ నిర్వహణపై ప్రభుత్వం అధికారికంగా కమిటీ వేసి 8 నెలలు పూర్తవుతోంది. అయినప్పటికీ మోడల్ స్కూల్స్‌పై ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం వైపునుండి రాలేదు. ఈ పాఠశాలల సమస్య ఇప్పటిది కాదు. 2015లోనే కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు మోడల్ స్కూల్స్ ప్రాజెక్టును రాష్ట్రాలకు బదలాయింపు చేస్తున్నామనే ప్రకటన జారీచేసింది.

09/01/2018 - 00:22

‘చట్టానికి కళ్లు ఉండరాదంటే’ అందరి పట్లా సమదృష్టి ఉండాలని అర్థం. అయితే, చట్టాన్ని అమలుచేసే వారిలో ఆ సమదృష్టి లేకపోతే సమాజానికి తీరని నష్టం. పైగా అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రమాదకరమైన ధోరణి. దేశవ్యాప్తంగా ఐదుగురు పౌర హక్కుల నేతలను తాజాగా అరెస్టు చేయడం సంచలనం కలిగించింది. వారిని అరెస్టు చేయడంలో నిబంధనల్ని పాటించలేదంటూ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది.

08/30/2018 - 00:18

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జర్మనీ, లండన్‌ల్లో ముఖాముఖి కార్యక్రమాన్ని ‘రచ్చబండ’ను తలదనే్నలా నిర్వహించారు. ఇక్కడ ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’ అంటూ రేడియో ప్రసంగాలు చేస్తుంటే, అక్కడ పరాయి దేశాల్లో ప్రతిపక్షనేత వేడి వేడి ప్రసంగాలతో ఆహూతుల్ని అలరించారు. ప్రధాని మోదీకి పార్లమెంటయినా, ఎర్రకోట అయినా, అమెరికా అయినా ఒకటే.

Pages