S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

07/18/2018 - 22:39

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. వారిని చిన్నచూపు చూస్తోంది. ఫలితంగా నిరుద్యోగంతో యువత నిరాశకు గురవుతోంది. ఇప్పటివరకు ఉద్యోగాల కోసం వేయి కళ్ళతో ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో యువత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసహనంతో నిరుద్యోగులు ఉద్యమబాట పట్టాల్సిన దుస్థితి దాపురించింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో కృషి చేయడం లేదు.

07/17/2018 - 22:38

సంప్రదాయాలు, ప్రజల మనోభావాల పేరిట కోడి పందేలు, పొట్టేలు పోటీలు, జల్లికట్లు వంటి అనాగరిక క్రీడలను అనుమతించడం ప్రభుత్వాలకు పరిపాటైంది. ఇప్పుడు గాంబ్లింగ్, బెట్టింగ్‌లను చట్టబద్ధం చేయాలంటూ లా కమిషన్ సిఫార్సులు చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

07/14/2018 - 22:58

పోలవరం బహుళార్థ సాధక నీటి పారుదల ప్రాజెక్టు అనుకున్న రీతిలో నిర్మాణం సాగకపోవడం శోచనీయం. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ముందుకి సాగాల్సిన పనులు జాప్యం కావడంతో నేతలందరిదీ బాధ్యతే. వేలాది మంది ప్రజలు, అందులో ఎనభై శాతం మంది పేద గిరిజనులు నిర్వాసితులుగా మిగులుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి వారికివ్వాల్సిన నష్టపరిహారం పరిమాణమే సందిగ్ధతలో పడడం అవాంఛనీయం.

07/08/2018 - 01:28

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతన్నపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నాయి. కేంద్రం పత్తి విత్తనాలపై గత పదేళ్లుగా వసూలుచేస్తున్న రాయల్టీని తగ్గించింది. వ్యవసాయ పెట్టుబడులకు ఎకరాకు నాలుగువేలు చొప్పున తెలంగాణా ప్రభుత్వం పందేరం, జొన్న, మొక్క జొన్నలకు గిట్టుబాటు ధర లేనందున బస్తాకు రెండువందల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం అందిస్తుంది.

07/07/2018 - 00:43

యూరోపియన్ యూనియన్ (ఈయూ)నుంచి బ్రిటన్ వైదొలగాలని నిర్ణయించుకోగా తాజాగా ఈయూ నుండి వైదొలగి తమతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. ఈ విధంగా ఈయూలో చీలిక తెచ్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు భావించాలి. యూరోపియన్ యూనియన్ కలిసికట్టుగా ఉండాలని ఫ్రాన్స్ దృఢంగా కోరుతున్నది.

07/05/2018 - 00:58

స్విస్ జాతీయ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాది తమ దేశపు బ్యాంకుల్లో భారతీయ ఖాతాల్లో పోగుబడిన ధనం మునుపటికన్నా ఏభై శాతం ఎక్కువ. మొత్తం ఖాతాల నిల్వల్లో మూడు శాతం వృద్ధి కనబడగా, భారత్ వాటాయే ఏడువేల కోట్ల రూపాయలు. కొద్దికాలం స్తబ్దత తరువాత ‘స్విస్’ ఖాతాల్లో ధనప్రవాహం వెల్లువెత్తడం గమనార్హం. ఈ నివేదిక భారత్‌లో నల్లధనంపై యుద్ధం ఎంత ప్రభావ రహితంగా ఉందో చెబుతోంది.

07/03/2018 - 23:35

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం పాఠశాలలు, కళాశాలల్లో సమావేశాలు నిర్వహిస్తామని ఉద్యమకారులు ప్రకటించటం సమంజసం కాదు. చదువుకునే విద్యార్థులను ఉద్యమాల పేరుతో చెడగొట్టడం దారుణం. రాజకీయ ప్రయోజనాలు సాధించేందుకు పిల్లలే కావలసి వచ్చారా? ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకొని, విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించే పద్ధతులను ఏ తల్లిదండ్రులూ అంగీకరించరు.

07/02/2018 - 23:42

దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద పన్నుల సంస్కరణగా అభివర్ణించదగ్గ ఏక పన్ను వ్యవస్థ (జీఎస్టీ) అమలులోకి వచ్చి ఏడాదైంది. లాభనష్టాల్ని సరైన రీతిలో అంచనావేయాల్సిన అధికార, ప్రతిపక్షాలు రాజకీయ కోణంలోనే విశే్లషిస్తున్నాయి. ఆర్థిక విజయం సంపూర్ణమంటున్న అధికార పక్షపు వాదన, పూర్తి వైఫల్యమంటున్న ప్రతిపక్షపు ఖండన రెండూ అర్ధసత్యాలే. ఖజానా నిండడమే విజయం కాదు. అందులో సామాన్యుడికి ఊరట ఎంతన్నది చూడాల్సి ఉంది.

06/30/2018 - 23:29

దేశవ్యాప్తంగా నకిలీ మందుల పంపిణీ, వాటి వినియోగానికి చెక్‌పెడుతూ- ఔషధాల్లో నాణ్యతాప్రమాణాలను పెంచేందుకు ‘ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల చట్టాని’కి సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం హర్షణీయం. ప్రస్తుత చట్టం ప్రకారం ఏదైనా ఔషధం నాసిరకమని తేలితే ఉత్పత్తిదారుడిని మాత్రమే బాధ్యుడిని చేస్తున్నారు.

06/29/2018 - 23:31

పట్టణాలు, నగరాల్లో విస్తరిస్తున్న బ్యాంకింగ్ రంగం గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించకపోవడం దారుణం. ఇప్పటికీ మండలానికి ఒక్క బ్యాంకు కూడా లేని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేక గ్రామీణులు, గిరిజనులు వడ్డీ వ్యాపారులు, బోగస్ చిట్‌ఫండ్ కంపెనీలపై ఆధారపడి భారీగా నష్టపోతున్నారు.

Pages