S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/26/2016 - 05:45

సమాజ ప్రక్రియలో ఎన్ని పరిణామాలొచ్చాయో దానికన్న ఎక్కువగా పరిణామాలు తరగతి గదిలో వచ్చాయి. తరగతి గది అవసరాన్ని కొన్నివేల సంవత్సరాల క్రితం తపస్సుచేసే రుషులు గుర్తించారు. పసిపాపల్లో ఉన్నటువంటి ఆసక్తి తరగతి గదికి పునాది. విద్యార్థికి తనకు వచ్చి న అనుమానాలను తీర్చుకోవటానికి ఏడు సంవత్సరాలకే రుషుల దగ్గరకు పోవటం, గురుకులాల్లో జీవనం గడపటం, తన అనుమానాలను చర్చించటం జరిగేది. అదే తరగతి గదికి పునాది.

05/25/2016 - 04:52

కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకు సంతో షం ఉండదు, కోపం కూడా ఉంటుం ది. అందువలన ఎవరైనా నిరపరాధుల ప్రాణాలను బలిగొంటే అది సరియైనదే అనడానికి అది పెద్ద కారణం కాజాలదు. న్యాయప్రక్రియలున్న సమాజం నుంచి అట్టి చర్య సరియైనది కాదు అనే జవాబు వస్తుంది. కాని కాంగ్రెసు వరిష్ట నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ అలా అనుకోడు.

05/25/2016 - 04:51

ఈ ప్రపంచంలో పరిమితి లేనివి, అనంత పరివ్యాప్తిని కలిగి ఉన్నవి రెండున్నాయి. ఒకటి ఈ విశ్వం. రెండవది మానవుడి మూర్ఖత్వం. మొదటిది నిజమో? కాదో? చెప్పలేను. కానీ రెండవది మాత్రం ముమ్మాటికీ నిజం’’అన్న ప్రముఖ శాస్తవ్రేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్) తీవ్రవాదులను చెప్పుకోవచ్చు.

05/24/2016 - 00:21

భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రులు కొందరు అడ్డుఅదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు.

05/23/2016 - 04:44

నేడు భారతదేశంలోనే కాక మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో నీటి సమస్య అధికమైంది. ఎన్నో సంవత్సరాలుగా శాస్తవ్రేత్తలు మేధావులు నీటి సమస్య వస్తుందని చెప్పినప్పటికీ, రాజకీయ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వస్తే గిస్తే మూడో ప్రపంచ యుద్ధం నీటిపైనే వస్తుందనటంలో సందేహం లేదు.

05/22/2016 - 02:12

ఈ మధ్యన సుప్రీంకోర్టు ప్రతి విషయాన్ని పట్టించుకుంటున్నది. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థది మూడోస్థానం. పార్లమెంట్ చేసే చట్టాలకు రాజ్యాంగానికి, భంగం వాటిల్లకుండా చూడడం, పాలనా వ్యవస్థ అదుపుతప్పితే వ్యాఖ్యానించడం, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచనలివ్వడం న్యాయవ్యవస్థ విధి.

05/21/2016 - 04:38

కరీంనగర్ జిల్లా గతకీర్తికీ, ప్రాచీన చరిత్రకూ నిలువుటద్దంగా నిలిచి వెలుగుతోంది. రాష్ట్ర పురావస్తుశాఖ రిటైర్డ్ డైరక్టర్ డాక్టర్ వి.వి.కృష్ణశాస్ర్తీ అపురూప పరిశోధనల ఫలితంగా, జిల్లా ప్రాక్చచరిత్ర 50 వేల సంవత్సరాలకు పూర్వమున్నదని రుజువైతే, అది సామాన్యమైన విషయమేమీకాదు.

05/20/2016 - 00:44

విద్యార్థి అనేపదానికి విద్యను అర్థించేవాడు అని అర్ధం. కాని ఈ పదం నేటి పాఠశాలలలో చదువుకునే వారికి ఎంతమాత్రం వర్తించదు. ఇంగ్లీషులో స్టూడెంట్ అనే పదానికి సరైన తెలుగు పదం కనిపించడం లేదు. కనుక ఈ పదాన్ని తప్పని పరిస్థతుల్లో వాడుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు అందరికీ ఉచితంగా విద్యను అందిస్తోంది. దీనితోపాటు భోజనం పుస్తకాలు కూడా ఉచితమే. అనేక వసతి గృహాలున్నాయి.

05/20/2016 - 00:43

ప్రపంచంలో ఏ దేశంలో కులాలు లేవు. మన దేశంలో మాత్రమే కులాలు ఉన్నాయ. కుల రహిత సమాజం ఐనప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అణగారిన వర్గాల వారికి దేవుడిలాంటి డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌ను మా వాడని చెప్పుకోవడానికి అగ్రవర్ణాలైన ముఖ్యమంత్రులు పోటీపడి ఎతె్తైన విగ్రహాలను స్థాపించడానికి పూనుకొనడం రాజకీయ ఎత్తుగడలో భాగం. కుల నిర్మూలన జరగాలంటే కులాలకతీతంగా వివాహాలు జరగాలి.

05/20/2016 - 00:48

డాక్టర్ నీలం సంజీవరెడ్డి గొప్ప జాతీయ నాయకుడు మాత్రమేకాదు మహోన్నత జాతీయవాది. భారతీయులు గర్వించదగ్గ నిష్కళంక తేజోమూర్తి. స్వయం ప్రతిభతో, స్వయం కృషితో, అంచలంచలుగా ఎదిగి, రాజకీయాలలో అత్యున్నత స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తన జీవిత కాలంలో అధికభాగం దేశ సేవకే అంకితంచేశారు.

Pages