S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/10/2016 - 05:36

అభివృద్ధిపేరుతో పాలక పక్షాలు బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. తమ ఉత్పత్తులను ఏ విధంగా మార్కెట్ చేయాలన్న అంశం బహుళజాతి సంస్థలకు తెలిసినంతగా ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదనడంలో సందేహం లేదు. అది ఆ సంస్థలకు వెన్నతో పెట్టిన విద్య. బహుళజాతి సంస్థల దాటికి తట్టుకోలేక పలు స్వదేశీ వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.

06/10/2016 - 05:35

కకన్యాశుల్కం నాటకంలో కరటక శాస్ర్తీ శిష్యునికి పాఠం చెబుతూ చదువన్నది ఎందుకు? అని ప్రశ్నించగా పొట్టపోసుకునేందుకు అని జవాబు చెప్పి తన సంస్కృత చదువు నిష్ప్రయోచనమైనదని ఇంగ్లీషు చదువు ఘనమైనదని అంటాడు. సుమారు వంద ఏళ్ల క్రితమే చదువుయొక్క ధ్యేయం ఇలా వివరింపబడింది. అదే అభిప్రాయం నేడు ఇంకా బలపడిపోయింది. చదువుకి కొలబద్దలు డిగ్రీలు. నేటి విద్యాలయాలలో చదువులు పరీక్షల నిర్వహణ ఒక ప్రహసనంగా మారాయి.

06/09/2016 - 05:38

భారతదేశ జనాభా అపరిమితంగా పెరిగిపోతోంది. 1950లో 40 కోట్ల నుంచి ప్రస్తుతం 130 కోట్లకు పెరిగి, అనతికాంలోనే చైనాను అధిగమించి, ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా పరిగణింపబడనున్నది. మనదేశ వైశాల్యం చైనాలో మూడోవంతు. చైనా ప్రజల తలసరి ఆదాయం మనకన్నా ఆరురెట్లు అధికం. చైనా జనాభా పెరుగుదలను ప్రతి కుటుంబం ఒక్క బిడ్డతో సరిపెట్టుకోవాలనే నిబంధనను 1978 నుంచి అమలు చేసింది.

06/09/2016 - 05:37

హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటుచేసుకున్న తరువాత చాలాసార్లు సైకాలజిస్టు బి.వి.పట్ట్భారామ్‌తో మీటింగులలో కలిశాం. మీటింగ్‌లలో ఆయనతో కలిసి ఉండటంవల్ల కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. తరగతి గదిలో అడుగు పెట్టకముందే మానసిక శాస్త్రానికి సంబంధించిన అవగాహన ఉంటే ఉపాధ్యాయులు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పాఠాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.

06/08/2016 - 04:01

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పరిపాలనా వ్యవస్థలు పూర్తిగా బలహీన పడిపోతున్నాయనడంలో సందే హంలేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ. పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు పునాదిరాళ్ళుగా ఉంటుంటాయి. అయితే అవినీతి జాడ్యంవల్ల మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్ధే బీటలువారుతోంది. వాస్తవ సిద్ధాంతంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అయితే రాజ్యాధికారం ప్రజలపైనే చెలాయించటం ఇక్కడి వైపరీత్యం.

06/08/2016 - 03:59

ఈ మధ్య ఏ పత్రిక తిరగేసినా వృద్ధుల దైన్యస్థితి పిల్లల నిరాదరణ వంటి అంశాల మీద కథలు, వ్యాసాలు వస్తూ ఉన్నాయి. ఉదయం పూచిన పూవు సాయంకాలానికి వాడిపోవటం ఎంత సహజమో వృద్ధాప్యం కూడా అంతే. మరీ మంచాన పడి తమ పనులుకూడా తాము చేసుకోలేని వారిని మినహాయించి కొన్ని వర్గాలుగా వృద్ధులను విభజించవచ్చు. 1. ప్రభుత్వ ఉద్యోగులు. వీరు సర్వీసులో తీసుకొన్న జీతానికి రెండింతల పెన్షను పొందుతూ ఉంటారు.

06/07/2016 - 00:43

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పేరిట పలు రాష్ట్రాలలో జరిగే శక్తి పూజల్ని, అమ్మవారి మహోత్సవాల్ని భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో జాతర రీతిలో ఉత్సవాల్ని నిర్వహించడం ఆనవాయితీ. భక్తుల మొక్కులను ఆశీస్సులతో ఆదిపరాశక్తి వరాల కల్పవల్లి కోరికల్ని తీర్చడం అనాదిగా వస్తున్న ఆచారం.

06/06/2016 - 05:41

ఎనిమిదవ తేదీ వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుగారు నాటికి రెండేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకుంటున్నాడు. ఈలోగానే, రెండవ తేదీనాడు తెలంగాణా ఆవిర్భావ దినోత్సవంనాడు- అవతల ధూంధాంలు ప్రేలిపోతూంటే- తాత్కాలిక రాజధాని అంటూ మనం చెప్పుకుంటున్న బెజవాడలో, బెంజి సర్కిల్‌లో నిలబడి, నాయుడుగారు- ప్రజలందరికీ సుదీర్ఘమైన దీక్షోపదేశం అందించారు.

06/06/2016 - 05:40

ఈనాడు విశ్వవిద్యాలయాలల్లో జరుగుతున్న దారుణ పరిస్థితులను చూస్తే చాలా ఆవేదన కలుగుతున్నది. విద్యార్థులను రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, సంఘ విద్రోహకర శక్తులు పావులుగా ఉపయోగించుకుంటూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. విశ్వవిద్యాలయాల నిర్వహణ కోసం ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నది. ఆ ఖర్చుపెడుతున్న డబ్బు అంతా కూడా ప్రజల సొమ్ము అని తెలుసుకోవాలి.

06/03/2016 - 04:01

వాతావరణ మార్పులు దేశంలోని వివిధ ప్రాంతాలను వైపరీత్యాలతో వణికిస్తున్నాయి. తరచు అనావృష్టి, తుఫాన్లు, వరదలకు గురౌతున్నాయి. వాటి ఉధృతి మునుపటికన్నా ఎక్కువైంది. ఇటీవలి కాలంలోనే ఈ మూడురకాల వైపరీత్యాలు పెరగటం ఆందోళన కలిగించే అంశం. గతంలో దేశం చాలానే అనావృష్టులను చవిచూచింది. కాని 1998 తరువాత వాటి రాక ఎక్కువైంది. 1999, 2002, 2009, 2014, 2015 సంవత్సరాల్లో అనావృష్టుల చేదు రుచి చూడక తప్పలేదు.

Pages