S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/12/2016 - 23:30

మన దేశంలోని అన్ని నగరాలలో, పట్టణాలలో జన సమ్మర్ధమైన ప్రాంతాలలో, రహదారి రోడ్లపైన వివిధ రకాలైన మతపరమైన కట్టడాలు, అడ్డంగా తిష్ఠవేసి ఉంటాయి. వీటిలో మందిరాలు, గురుద్వారాలు, సమాధులు, చర్చిలు, మసీదులు ఉన్నాయి. నేటి ఆధునిక సమాజంలోని ప్రజలు ప్రతిరోజు ఉరుకుల పరుగుల జీవితాలకు అలవాటై దూర ప్రాంతాలకు ప్రయాణించి ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకొంటున్నారు.

05/12/2016 - 08:18

ఇతర జంతువులనుండి మనిషిని వేరుగాను, ప్రత్యేకంగానూ చూపేది మేధస్సు, సంస్కారం. ఈ సంస్కారం రెండు విధాలుగా వుంటుంది. ఒకటి- మానవతా ధర్మం! రెండవది- సామాజిక సంస్కారం! జంతువులకు మేధస్సు చాలా తక్కువ. వాటికి బుద్ధి, విచక్షణా జ్ఞానం వుండవు. శారీరక ప్రేరణతోనే (‘ఇనిస్టింక్ట్’) స్పందిస్తాయి. అలాగే వాటికి సంఘ జీవనముండదు కనుక, సామాజిక సంస్కారమూ వుండదు.

05/12/2016 - 08:19

విద్యార్థిని ఉపాధ్యాయుడు ఎంత చెక్కుతాడో దానికన్నా రెట్టింపు విద్యార్థితో చెక్కబడతాడు. విద్యార్థి ప్రతి ఉపాధ్యాయుడు చెప్పే మాటలను వినయంగా వింటాడు. కానీ ఉపాధ్యాయుడు ప్రతి ఘడియలో శల్యపరీక్షకు కూడా గురౌతాడు. తరగతి గదిలో ఉండే 40 మంది టీచర్‌ను చూస్తూ ఉంటారు. టీచర్ చెప్పిన మాటలను సంబంధిత టీచర్ ఆచరిస్తున్నారా అని తరగతి, విద్యార్థుల కళ్లు చూస్తుంటాయి.

05/11/2016 - 02:47

శ్రీఆదిశంకరులు జన్మించే నాటికి భారతదేశంలో అవైదిక మతాలైన బౌద్ధ, జైనాలు బాగా వ్యాపించి ఉన్నాయి. వైదిక మతాలలో కూడా అనేక మతాలు తమ మతమే గొప్పది అన్న అహంకారంతో ఇతర మతాల పట్ల చిన్నచూపుతో వ్యవహరించ సాగాయి. ఆదిశంకరులు భారతదేశంలోని వివిధ మతాల మధ్య సమన్వయాన్ని సాధించారు. వేద సహితమైన, సనాతన ధర్మాన్ని బలోపేతం చేసారు.

05/11/2016 - 02:38

‘‘రేఖామాత్రం సానసహతి కిల్బిషం మానవానాన్’’-మానవుల్లోని మాలిన్యాన్ని ఆయన రేఖామాత్రం కూడా సహించజాలడు-అన్నది బ్రహ్మశ్రీ తెలకపల్లె విశ్వనాథ శర్మ దుర్వాసమహాముని గురిం చి చెప్పిన మాట. మాలిన్యమంటని జీవితాన్ని స్వయంగా నిర్వహించిన శాస్తవ్రిదుడు విశ్వనాథశర్మ..ఆయన సంస్కృత నిధి, తమ సంస్కృత భాషా మాధుర్య మహానది!

05/09/2016 - 23:34

ఆయన నిజాం పాలనను చూశారు. ఆ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చూశారు. స్వయంగా ఉద్యమంలో ఆయుధం చేపట్టి పోరాడారు. దేశానికి స్వాతంత్య్రం రావడం చూశారు. స్వయంగా చట్టసభలకు ఎన్నికై ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేశారు. హైదరాబాద్ రాష్ట్ర అవతరణ చూశారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చూశారు. ఆనాటి శాసన సభకు ఎన్నికయ్యారు. జై తెలంగాణ ఉద్యమాన్ని చూశారు.

05/09/2016 - 07:25

చాలామంది ప్రజాప్రతినిధులు అంటూ వివిధ రకాలైన రాజకీయ నాయకులు చాలామంది బయల్దేరారు. వీరందరికీ లక్షల్లో జీతాలు ఇవ్వాలని వారికి వారే రాసేసుకుని చట్టాలు చేసేసుకుని జీతాలు దండుకుంటున్నారు. ఇంతకంటే నైతిక దివాలాకోరుతనం ఎక్కడా ఉండదు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ప్రజాధన పరిరక్షణ బాధ్యతని విస్మరించి లక్షల్లో జీతాలు పెన్షన్లు పుచ్చుకోవటం స్వాతంత్య్రోద్యమ త్యాగస్ఫూర్తికి విరుద్ధం.

05/07/2016 - 06:29

ఈ మధ్య మన దేశంలో ఒక కొత్త సామాజిక సమస్య మొదలైంది. రోజురోజుకు పెళ్ళికాని ప్రసాదుల జాబితా చాంతాడులా పెరిగిపోతున్నది. ఈ సమస్య ఉత్పన్నం కావటానికి కొంత స్వయంకృతాపరాధం ఉన్నది. దాదాపు 30 సంవత్సరాల క్రితం భార్యాభర్తలు వైద్యపరీక్షల సహాయంతోనో లేక మరో విధంగానో ఆడపిల్లల జననాలను నిరోధించి మగపిల్లలను కనిపెంచేవారు. దీనివలన మగ పిల్లలు 100% ఉంటే ఆడపిల్లలు 85% మించి లేరు.

05/06/2016 - 00:45

జన ఆరోగ్య వ్యవస్థకు కట్టుదిట్టమైన ధీమా ఇవ్వాల్సిన ఔషధరంగమే డొల్లపోయి, వివిధ ఔషధాల కంపెనీలు ఉత్పత్తిచేస్తున్న మందులు మానవాళికి అనారోగ్యకర ప్రభావం చూపుతున్నాయంటే అవి వ్యాధి నిరోధక మందులా? లేక అనారోగ్యాన్ని ప్రేరేపించే మృత్యుపాశాలా అనిపించక మానదు. ప్రజారోగ్యంపై అత్యంత దుష్ప్రభావం చూపుతున్న 344 ఔషధాల ఉత్పత్తి, సరఫరాలపై కేంద్ర ఔషధ నియంత్రణ నిషేధం విధించింది.

05/06/2016 - 00:44

ప్రపంచ చిత్రపటంలో మూడోవంతు నీరు ఉన్న ఒక్కవంతు భూభాగంలో నివసిస్తున్న ప్రజలకు నీటి సంక్షోభం తప్పడం లేదు. మానవుడు అభివృద్ధి పేరిట ప్రకృతిని కాపాడటంలో విఫలమవుతున్నాడు.

Pages