S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/20/2016 - 04:41

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిస్థితి 3కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది2అన్న చందాన మారింది. ఇప్పటికే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అంపశయ్యమీద వున్నాయి. ఇందుకు కారణాలను విశే్లషించడం వృధా ప్రయాస తప్ప ఎటువం టి ప్రయోజనం ఉండదు.

07/18/2016 - 23:45

వెంకటావధానిగారు తూర్పుగోదావరి జిల్లా యండగండిలో 1913 జూలై 29న గురుపూర్ణిమ నాడు దివాకర్ల వంశంలో జన్మించి అవధాన పండిత కుటుంబమైన దానికి ఎనలేని కీర్తి తెచ్చి పెట్టారు. ఆయనది తాతగారి పేరు. తిరుపతి వేంకటకవులలో ఒకరైన తిరుపతి శాస్ర్తీగారు వీరి పినతండ్రి.

07/18/2016 - 02:48

ప్రత్యేకంగా ఏ వాదాన్నీ కాకుండా, ఇంకా చెప్పాలంటే మానవతావాదాన్ని పెంచే రచనల్ని బలివాడ కాంతారావు చేశారు. నేవీలో పనిచేస్తూ ఆయన మనదేశంలో విభిన్న అపదేశాల్ని చూశారు. సంస్కారాల్ని ఆకళింపు చేసుకున్నారు. ఈ అనుభవంతో రాశారు కాబట్టి ఆయన రచనల్లో మనదేశమంతా కనిపిస్తుంది.

07/16/2016 - 08:27

భాష ప్రవాహం వంటిది. నది వెల్లువెత్తి వంకర టింకరగా పారుతూ వాగులూ-వంకలూ తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతున్నట్లే భాష కూడ వ్యావహారికాలను, మాండలికాలను, అన్యదేశ పదాలను తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రవాహపు నీళ్ళను కాలువల ద్వారా సక్రమ మార్గంలోకి మళ్ళించినట్లు భాషను కూడ వ్యాకరణం ద్వారా సక్రమంగా ఉండేటట్లు నన్నయ్యాదులు చేశారు. నన్నయ్య స్వయంగా ఆంధ్ర శబ్ద చింతామణిని రాశారు.

07/15/2016 - 03:04

కొన్ని పరిస్థితుల్లో మనకు సంతోషం ఉండదు, కోపం ఉంటుంది. అందువలన ఎవరైనా నిరపరాదుల ప్రాణాలను బలిగొంటే అది సరైనదే అనడానికి అది పెద్ద కారణం కాజాలదు. న్యాయప్రియులున్న సమాజం నుంచి అటువంటి చర్య సరైనది కాదనే జవాబు వస్తుంది. కాని కాంగ్రెసు వరిష్ట నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ అలా అనుకోడు.

07/15/2016 - 03:03

దేశంలో సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన ముఖ్యమంత్రులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకరు. అటు ప్రతిపక్ష నేతగా, ఇటు ముఖ్యమంత్రిగా దశాబ్దకాలం పనిచేసిన ఘనత ఆయనది. గతంలో మంచి పరిపాలనాదక్షుడిగా ఆయనకు పేరు వుంది. రాష్ట్ర విభజన తరువాత పరిపాలనాదక్షుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, తమ కష్టాలు కడతేరుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు.

07/14/2016 - 06:10

విదేశీ బ్యాంకుల్లో నల్లధనం లావాదేవీలకు సంబంధించి అత్యంత కీలక సమాచారాన్ని బట్టబయలుచేసిన పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్థిక, రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. పనామాలో పేర్కొన్న దాదాపు 500 మంది దాకా భారతీయుల పేర్లు పత్రాలలో ఉండడంతో నరేంద్రమోదీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఈ పత్రాలలో దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లు ఉండడం వలన ప్రభుత్వం ఒకింత ఇరుకున పడింది.

07/14/2016 - 06:09

తరగతి గది విద్యా కార్యక్రమాలలో ముగ్గురు ముఖ్యమైన పాత్రధారులు. తల్లిదండ్రులు, ప్రభుత్వం, యాజమాన్యం ఈ ముగ్గురూ ఒకే విషయంపై ఎందుకు కేంద్రీకరిస్తున్నారు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో చదువు చెబుతున్నప్పుడు పిల్లలకు అర్థమయ్యే విధంగా భావాల వ్యక్తీకరణ జరగాలి. అది తల్లిదండ్రుల కోరిక. అదే యాజమాన్యమైతే ‘‘ఉపాధ్యాయుడు సరైన సమయంలో తరగతి గదికి వెళ్లాలి. తరగతి గదిని క్రమంగా క్రమశిక్షణతో నడిపించాలి.

07/13/2016 - 06:56

కొఠారి కమిషన్ మొదలు నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక విద్యావ్యవస్థ పురిటినొప్పులు పడుతూనే ఉంది. కేంద్రం దేశమంతా అమలుచేస్తున్న నిర్బంధ ప్రాథమిక విద్యలో భాగంగా 1 నుంచి 5 తరగతుల వరకు ఆపై ఏడవ తరగతి వరకు విద్యాహక్కు చట్టం చట్టం కింద ఆయా వయసుల పిల్లలు తప్పనిసరిగా పాఠశాలల్లో చదువుకోవాల్సిందే.

07/11/2016 - 23:44

అపచారం, మహాపచారం, దేశంలోనే కనీ వినీ ఎరుగని అపచారం, తల్లిదండ్రుల పాదాలకు నమస్కారంచేసి ఆ తరువాతనే సినిమాలలో నటించే ఎన్.టి.రామారావు, శ్రీ రామకృష్ణాది వేషాలను ధరించి జనాన్ని భక్తి తన్మయులను చేసి, ఓ కృష్ణునిగా దేవాలయాలలో ఆరాధించబడిన ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పాలిస్తున్న తరుణంలో, మనసుతో కూడా ఊహించడానికి వీలుకాని అపచారం ఆంధ్రప్రదేశం నడిబొడ్డున విజయవాడలో జరిగింది.

Pages