S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

,
03/19/2020 - 05:12

మన దేశంలో పనె్నండు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు- కరోనా వైరస్ గుప్పిట యిరుక్కున్నాయి. పని పాటలు బంద్ అయిపోయి, విలవిల్లాడుతున్నాయి. ఇది మొన్న మంగళవారంనాటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా మొత్తంమీద కరోనా రక్కసి కొరడా ఝుళిపిస్తున్న దేశాలు నూట నలభై అయిదు. ‘‘ఇండియాలోనే, ఇది మిగతా అభివృద్ధి చెందిన దేశాలలోకన్నా పరిమితంగా నియంత్రణతో ఇంతవరకూ వున్నది.

03/12/2020 - 06:08

‘‘కరోనా.. కరోనా..’’ దీనిమీద, ‘‘కుఛ్ కరోనా!’’ అంటే, ‘‘ఏమైనా తరుణోపాయం చూడుమీ!’’ అంటే, ఏం చెయ్యాలి? కేరళ రాష్ట్రంలో గవర్నమెంట్ మార్చ్ నెలాఖరు దాకా సినిమా హాల్స్ మూయించేసింది. ఢిల్లీ లో పిల్లకాయల స్కూల్స్ మూయించేశారు. మరో దేశం పోదాం అంటే కూడా రుూ కరోనా వైరస్- దాని పేరే కోవిడ్-19. సర్వాంతర్యామి. అంతటా వుంది, అంటున్నారు- ఒక్క అంటార్కటికాలో తప్ప. అక్కడికి పోగల వాళ్లెవ్వరు?

03/05/2020 - 02:48

గర్జిస్తూ, గాండ్రిస్తూ అరివీర భయంకరంగా న్యూజిలాండ్ మీద- జైత్రయాత్రకోసం సాగుతున్న సైన్యంలాగా పోయిన మన కొహ్లీసేన- దేశానికి తిరిగి వచ్చాక విమానాశ్రయం నుంచి దొడ్డిదారి వెదుక్కోవలసిన దుస్థితి వచ్చింది. క్రైస్ట్ చర్చ్ మైదానం కొహ్లీసేనకి ‘వాటర్‌లూ’ అయిపోయింది.

02/27/2020 - 00:06

‘‘హవ్‌డీ మోడీ!’’ సంబరానికి అమెరికా అధ్యక్షుడు నేరుగా వచ్చి- ప్రోటోకాల్‌ని కూడా ప్రక్కనబెట్టి- ముందువరసలో- మంచి బాలుడు లాగా కూర్చున్న దృశ్యం యింకా చాలామందికి గుర్తున్నది అనుకుంటాను. దానికి వడ్డీతో సహా బాకీ తీర్చేశాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్‌దాస్ మోడీగారు.

02/20/2020 - 00:31

‘‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు’’అంటారు బామ్మలు శివుడున్నాడో, లేదో చెప్పడం కష్టం. కానీ ఓ ‘మనిషి చావు’ సంభవించడానికి మాత్రం అటువంటిది ఏదో వుండి తీరాలి. లేకపోతే, ఎప్పటి సంగతి? 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు? ఇన్నాళ్లకి, యిప్పుడు ఉరిశిక్ష అమలుచేయమని- తేదీ, సమయం కూడా నిర్ధారించింది న్యాయస్థానం.

02/13/2020 - 02:15

ఇది మరోసారి సామాన్యుడి విజయం! పద్మవ్యూహంలో నుంచి బయటపడ్డ కేజ్రీవాల్ ఘన విజయం అన్నారు కొందరు. ‘‘యిది షహీన్‌బాగ్ విజయం-’’ అంటున్నారు. ఏదిఏమైనా యిది డెమోక్రసీకి దక్కిన గెలుపు.

02/06/2020 - 01:29

ఎన్ని చట్టాలు చేసినా- ‘చట్రాలు’ యింకా గట్టిగా బిగించినా, రుూ ఆధునిక కాలంలో కూడా కిరాతక, భయానక సామూహిక మానభంగాలు- తదనంతరం హత్యలు- యివి ఎక్కువైపోతున్నాయే గానీ అదుపు సాధ్యం కావడం లేదు. తెల్లారేపాటికి పత్రికలు పూర్తిగా తెరచి చూడకుండానే ప్రత్యక్షమయే ఘోరవార్తలు ఇవే!

01/30/2020 - 02:03

‘‘అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో యిప్పుడు జరుగుతున్నదంతా జగన్ మోహన్‌రెడ్డి- చంద్రబాబు నాయుడుల మధ్య జరుగుతున్న పోరాటం. జగన్‌కి చంద్రబాబు మీద వున్న అక్కసు, ఆగ్రహం వెండెట్టా ‘‘తప్ప మరోటి కాదు,’’ అన్నాడు- ఆంధ్రా, గుంటూరు నుంచి వచ్చిన పెద్దమనిషి ఒకడు.

01/23/2020 - 04:58

జగత్ ప్రసాద్ నడ్డా.. సింపుల్‌గా ‘నడ్డా’ అంటున్నారు. ఆర్నెల్ల అనుభవం తర్వాత.. పూర్తి అధ్యక్షుడిగా, ఏకగ్రీవంగా ఎన్నికై పార్టీ పగ్గాలు పట్టుకున్నాడు. అందరికన్నా ముందు షష్టిపూర్తి సంవత్సరంలో ప్రవేశించిన నూతన అధ్యక్షుణ్ణి నరేంద్ర దాస్ మోదీ గారు ఏ విధంగా అభినందించాడు అన్నది చూస్తే - జె.పి. నడ్డాకి రాబోయే అయిదేళ్లు ఎట్లా గడుస్తాయి? అన్నది అర్థం అవుతుంది.

01/09/2020 - 02:01

జీవితం ఎందుకు? జిందగీ కిస్‌కేలియే? అంటే.. ‘ఖానే కేలియే’ అన్నాడు కవి. తిండి తినడం కోసం కాకపోయినా బతకడం కోసం తినాలి. మహానగరాలలో ‘ఎంత చెట్టుకు అంతగాలి’ అన్నట్లు రుూ తిండి- ‘‘అవుట్ సైడ్ ది హవుస్’’ అనగా ఇంటి బయట కూడా దొరుకుతుంది. వంటింటి ఖానా కన్నా బయట హోటల్ ఫుడ్‌లో దాని రుచి దానికే వుంటుంది.

Pages