S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/14/2017 - 02:27

వాషింగ్టన్, అక్టోబర్ 13: మన సౌరవ్యవస్థలో అదృశ్య గ్రహంగా, అదే విధంగా సూపర్ ఎర్త్‌గా కూడా భావిస్తున్న ప్లానెట్-9కు సంబంధించి శాస్తవ్రేత్తలు మరిన్ని ఆసక్తికర వివరాలను వెలుగులోకి తెచ్చారు. ఈ ప్లానెట్-9 ద్రవ్యరాశి భూమికంటే పదిరెట్లు ఎక్కువని, అదేవిధంగా సూర్యుడి చుట్టూ పరిభ్రమించే నెప్ట్యూన్ కంటే కూడా 20 రెట్లు దూరంలోనే ఇది ఉందని వెల్లడించారు.

10/14/2017 - 02:15

వాషింగ్టన్, అక్టోబర్ 13: భారత్‌లో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి, చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలపై అమెరికాలో ప్రోత్సాహకరమైన అభిప్రాయం బలంగా నెలకొందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంతో పాటు ఇందుకు సంబంధించి సరళతరమైన విధానాలను అమలుచేయడం కూడా ఇందుకు ప్రధాన కారణమైందని తెలిపారు.

10/14/2017 - 01:43

టోక్యో, అక్టోబర్ 13: భారత సరుకు రవాణా నౌక ఒకటి శుక్రవారం తెల్లవారు జామున ఫిలిప్పీన్స్ సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. దీంతో ఆ నౌకలో ఉన్న 11 మంది సిబ్బంది గల్లంతయ్యారని జపాన్ తీరరక్షక దళం తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా నౌక మునిగిపోయిందని వివరించింది.

10/13/2017 - 02:37

ఇస్లామాబాద్, అక్టోబర్ 12: ఎన్నికల కమిషన్‌పై అనుచిత ఆరోపణలు చేసిన పాకిస్తాన్ ప్రతిపక్షనేత, తెహ్రీక్ ఎ ఇన్ఫాస్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ చిక్కుల్లో పడ్డారు. జనవరి 24న మాజీ క్రికెటర్ ఖాన్‌కు పాకిస్తాన్ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం తమపై పక్షపాతం చూపుతోందని చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి.

10/13/2017 - 03:46

వాషింగ్టన్, అక్టోబర్ 12: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని ప్రధాన మీడియా సంస్థలపై కనె్నర్ర చేశారు. తన ప్రభుత్వం చేపట్టిన అణు విధానాన్ని విమర్శిస్తూ కథనాలు ప్రసారం చేసిన మీడియా నెట్‌వర్క్‌లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ట్రంప్ లైసెన్సులు రద్దుచేస్తామని హెచ్చరించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఉపేక్షించేది లేదు, ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తా కథనాలు ఇస్తే చర్యలు తప్పవని ఆయన తెలిపారు.

10/13/2017 - 02:24

టోక్యో (జపాన్), అక్టోబర్ 12: జపాన్‌లో ప్రధానమంత్రి షింజో అబేకు చెందిన అధికార కూటమి రానున్న ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీకి చేరువ అవుతుందని ఎన్నికల సర్వేలు పేర్కొన్నాయి. ప్రాచుర్యం పొందిన టోక్యో గవర్నర్ యురికో కొయికె స్థాపించిన కొత్త పార్టీ అధికార కూటమికి గట్టి పోటీని ఇవ్వలేదని తెలిపాయి.

10/11/2017 - 02:35

ఐరాస, అక్టోబర్ 10: అజెండాలో లేకపోయినా ఐరాస జనరల్ అసెంబ్లీలో కాశ్మీర్ అంశాన్ని పదేపదే లేవనెత్తడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పొరుగుదేశంపై లేనిపోని ఆరోపణలు చేయడం ద్వారా చరిత్రను వక్రీకరించాలని చూస్తున్నారని పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మలేహా లోధీపై భారత్ నిప్పులు చెరిగింది.

10/10/2017 - 19:54

ఒకదాని తర్వాత ఒకటిగా అమెరికాను పెను హరికేన్లు కుదిపేస్తున్నాయి. పేరేదైనా ప్రళయ భీకర రీతిలో అమెరికా పట్టణాలను, నగరాలను ఈ ప్రకృతి విలయాలు ముంచెత్తుతున్నాయి. హార్వీ హరికేన్ బీభత్సాన్నుంచి కోలుకోకముందే మరో పెనుతుపాను కలకలం రేపుతోంది. మిసిసిపిలో ‘నేట్’తుపాను సృష్టిస్తున్న బీభత్సానికి నిలువెత్తు నిదర్శనమిది.

10/10/2017 - 19:53

తుపాకీ సంస్కృతి అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిన్నటి లాస్‌వెగాస్‌లో జరిగిన మారణకాండే ఇందుకు నిదర్శనం. ఎప్పటికప్పుడు ఈ విష సంస్కృతిపై నిరసనలు వ్యక్తమైనా ఆ వేడి తగ్గిన తర్వాత పరిస్థితి మామూలే. జరిగిందేదో జరిగిపోయింది అంటూ సర్దుకుపోయే ధోరణే. లాస్‌వెగాస్ ఉన్మత్త కృత్యానికి బలైన వారికి సంతాప సూచకంగా... సర్వత్రా శాంతి విరియాలని ఆకాంక్షిస్తూ ఇలా సంఘటన స్థలంలో శాంతి కపోతాలను ఎగురవేశారు.

10/10/2017 - 02:04

వాషింగ్టన్, అక్టోబర్ 9: భారత ఐటి నిపుణుల ఎదురు చూపులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నీళ్లుచల్లారు. అయితే, ప్రతిభ కలిగిన నిపుణులకు ఎప్పుడూ అమెరికా ద్వారాలు తెరిచే ఉంటాయన్న సంకేతాలు అందించారు. ప్రతిభ ఆధారిత వలస విధాన ప్రణాళికగా చెబుతున్న కొత్త ఇమిగ్రేషన్ ప్రణాళికను డొనాల్డ్ ట్రంఫ్ కాంగ్రెస్‌కు ఆదివారం ప్రతిపాదించారు.

Pages