S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/15/2019 - 22:20

గురువపుడు వారిరువురిని (అనగా శ్యామను శిష్యుని) బిలిచి శ్యామ చేతులను జూపుచు, ‘‘ఇవియేమో చెప్పగలవా?’’అని యడిగెను. శిష్యుడు, ‘‘ఏల? ఇవి శ్యామ చేతులుగదా’’యని బదులుచెప్పెను. గురువంతట శ్యామకండ్లు, ముక్కు మొదలైన యవయవములను జూపుచు, పదే పదే యదియే ప్రశ్నవైచెను. శిష్యుడుచితమైన సమాధానములను జెప్పసాగెను.

09/13/2019 - 20:10

అంతట దహనకర్మము ముగియగనే యామె తన గాజులను దీసివేసి వానికిబదులు బంగారు మురుగులను ధరించెను. జనులామె విపరీత చర్యను జూచి వంత పడసాగిరి. కాని యామె వారలకిట్లు సమాధానము చెప్పెను: ‘‘ఇంతకుముందు నా భర్త శరీరము గాజుపెంకులవలెనే దుర్బలమై అస్థిరమైయుండెను. ఇప్పుడాక్షణ భంగురమైన శరీరము నశించినది. అందుచేనాతడిపుడు సర్వవిధముల వికార రహితుడై పరిపూర్ణుడైయున్నాడు. తన శరీరమునకిక శిథిలతలేదు.

09/12/2019 - 19:41

కాని యిది భయపడి గొఱ్ఱెవలె అతి దీనముగా నఱవసాగినది. కాని క్రొత్త పులి దీనినెట్లో యొక చెఱువు కడకు లాగికొనిపోయి నీటిలో తమ యిరువురి ప్రతిబింబమును చూపి యిట్లు ఘోషించెను: ‘‘చూడు, చూడు, నీ రూపు నారూపువలెనే యున్నది. నీవు నావలెనే పులివే. ఇదిగో, ఈ మాంసము తినుము.’’ ఇట్లనుచు బలవంతముగా దాని నోటిలో మాంసము గ్రుక్కినది. కాని రుూ ‘గొఱ్ఱెపులి’ మాంసము తినదయ్యె. దీనముగా నరచుచు దాను గొఱ్ఱెనని తెలుప మొదలిడెను.

09/11/2019 - 18:56

‘‘మహాప్రభూ! నా గుట్టు తెలిసిపోయినది. నేనింక నిక్కడ నుండుటకు గుండె దడ ఎత్తుచున్నది. నేను పాఱిపోయెదను.’’ఇట్లనుచు, ఆ మాదిగ యదేపోకగా బాఱిపోయెను.
ఈ విధముగనే మాయయొక్క గుట్టు కనుగొనినంతనే యది తొలగిపోవును.
నారదుని సంసారమోహము

09/10/2019 - 19:53

కాలుసేతులు కట్టివేసి వీని నిక్కడ విడిచి పోవుదము’’ అనెను. అంత వారతని కాలుసేతులు బంధించి యక్కడ విడిచిపోయిరి. వారు కొంతదూరము వెడలిన పిమ్మట మూడవ దొంగ తిరిగివచ్చి, ‘అయ్యో! పాపము! నీవెంత సంకట పడితివోకద! క్షణములో నిన్ను విడిచిపెట్టెదను’ అని కట్లు విప్పివేసి, ‘‘నాతో రమ్ము. నీకు దారిచూపెదను’’ అనెను. వారిరువురు నటుల జాలదూరము నడచిన పిమ్మట రాజవీధి కాన్పించినది. అంతట, ఆ దొంగ ‘‘అదిగో, నీ యిల్లు.

09/09/2019 - 19:21

అంతట సన్న్యాసి రోగిని జూచి యిట్లు పలికెను. ‘‘చూచితివా? నీ నిమిత్తమై యెవ్వరును బ్రాణమర్పింప సిద్ధపడువారు లేరైరి. ‘లోకములో నెవరిమీదను ఆశపెట్టుకొనుట తగ’దని నేననిన మాట లిప్పటికైనను నీకు బోధపడినవా?’’ లోకము యొక్క రుూ ధోరణినంతయు బ్రత్యక్షముగా జూచిన యా బ్రాహ్మణుడపారమైన సంసారమును విడనాడి యా సన్న్యాసి ననుసరించెను.
భార్య యొక్క ప్రేమను పరీక్షించిన హఠయోగి

09/08/2019 - 22:54

బ్రాహ్మణునకు నమ్మకము కుదురలేదు. తాను రేయింబవళ్లెవరినిమిత్తమై పడరాని పాట్లు పడుచుండెనో యటువంటి తన కుటుంబములోనివారు తన కవసరముపట్ల సాయము చేయదగిన యాప్తులు కారని యాతడెట్లు భావింపగల్గును? కావున నిట్లనెను: ‘‘స్వామీ నాకిసుమంత తలనొప్పి వచ్చెనా, నా తల్లి తహతహలాడిపోవునే! నా బాధ తొలగు నిమిత్తము తన ప్రాణమునైనను సంతోష పూర్వకముగా ధారపోయుటకు సంసిద్ధమగునే!

09/06/2019 - 18:59

అంత వానికొక రాగి గని కాన్పించినది. తాను మోయగలిగినంత రాగిని దీసికొని పోయి యంగడిలో విక్రయించి చాల ధనము సంపాదించెను. సాధువు యొక్క ఉపదేశముననుసరించి యాతడంతటితో నాగక, మఱునాడు మఱింత దూరము వనములోనికి బోగా వానికొక వెండి గని గాన్పించినది. తాను మోయగలిగినంత వెండిని దీసికొనిపోయి విక్రయించి యాతడు మఱింత ధనము సంపాదించినాడు.

09/05/2019 - 19:43

మఱునాటి యుదయమున ఫలాని పెద్దమనుష్యుని తోటలోని కొక సాధుపుంగవుడు వచ్చియున్నాడని ఊరెల్ల జెప్పుకొనసాగెను. అందుచే వందల కొలది జనులు ఫలపుష్పాదులతో సాధువును బూజించుటకై యచటికి రాసాగిరి. జనులాతనికి సాష్టాంగ పడుచుండిరి. వెండి బంగారు నాణెము లాసాధువుమ్రోల ధారాపాతముగా బడుచుండెను. అప్పుడాపల్లెవాడిట్లనుకొనసాగెను: ‘‘ఆహా. ఏమి విచిత్రము! నిజముగా నేను సాధువును కాను. ఐనను వీరందఱును నన్నింతగా బూజించు చున్నారు!

09/04/2019 - 19:46

ఒక దేశములో నొకప్పుడు గొప్ప అనావృష్టి బాధ సంభవించినది. వ్యవసాయులందఱును దమ పొలములకు గాలువలు త్రవ్వి నీరు పెట్టుకొనుటకై తీవ్ర ప్రయత్నములు చేయుచుండిరి. వారిలో నొకడు, గట్టి పట్టుదలగలవాడు, తన కాలువ నేటితో గలుపువఱకు నాగకుండ ద్రవ్వనిశ్చయించుకొనెను. స్నానమునకును భోజనమునకును వేళయైనను నాతడు లక్ష్యపెట్టక యదేపనిగా ద్రవ్వుచుండెను. అంత వాని భార్య కొమార్తె చేతికిచ్చి స్నానమునకై నూనె పంపినది.

Pages