S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/05/2019 - 20:00

827. ప్రకృతి లేక స్వభావమే (కర్మమొనర్ప) మిమ్ము నియమించుచుండుటచే కర్మమును మీరు విడువజాలరు.
కాబట్టి విధ్యుక్త మార్గమున కర్మములను చేయవలయును. నిష్కామకర్మాచరణ భగవంతుని బొందించును. నిష్కామకర్మాచరణ మనగా ఇహపరములందెట్టి ఫలములను ఆశింపకుండ కర్మముల నాచరించుట. అట్టి కర్మాచరణము ప్రాప్యమును బొందుటకు మనకు సాధనము; భగవంతుడే మనకు ప్రాప్యుడు.

06/04/2019 - 19:41

ఔదార్యము, దయాళుత్వము, పరులయెడ సానుభూతి మొదలగు వానినన్నిటిని నిష్కామముగా అవలంబించిన పక్షమున మంచివే. వానితోబాటు భగవద్భక్తి యున్నచో అవి భగవంతుని బొందించును.’’

06/03/2019 - 19:52

ఇక బిడ్డ పుట్టినంతనే బిడ్డను సంరక్షించుకొనుట తప్ప ఆమెకు మఱేపనియునుండదు, ఉండనీయదు. సత్త్వగుణపూర్ణులు కానివారు సాంసారిక కృత్యములనన్నిటిని నిర్వర్తింపవలయును. భగవంతుని పూర్తిగా ఆత్మార్పణమొనర్చుకొని వారు భాగ్యవంతుని యింటిలోని దాసివలె వర్తింపవలయును. ఇదియే కర్మయోగము.

06/03/2019 - 19:42

ఈ దేహము ఘటమువంటిది; మనోబుద్ధ్యహంకారములే ఇందలి నీరు. బ్రహ్మము సూర్యుని వంటిది. అయ్యది అంతఃకరణ మను నీటిలో ప్రతిఫలించుచున్నది. కావున భక్తుడు వివిధ దివ్యరూపములను దర్శించుచుండును. కాని వేదాంతము ప్రకారము బ్రహ్మమొక్కటియే సత్యము, మిగిలినదంతయు మాయ-స్వప్నమువలె మిథ్య. బ్రహ్మసాగరమున ‘‘నేను’’ అనునీకఱ్ఱ పడియున్నది.

06/03/2019 - 19:31

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079

06/03/2019 - 19:22

నిత్యమేది, అనిత్యమేది యను విచారణ మూలమునకు నీవిట్లు బ్రహ్మ జ్ఞానము నొంద వచ్చును. మఱియు భక్తి మూలమునను బ్రహ్మ జ్ఞానమును బడయ వచ్చును. భక్తి కోసము వికాసము కోసము , ఆత్మ సమర్పణ కోసము , నిరంతరము ఆమెను ప్రార్థించుటయే భక్తి యోగ తత్త్వము . వీని మూలమున మొదట నా జగజ్జనని సాన్నిధ్యమును బొందుము. నీ ప్రార్థన హృదయపూర్వకమై నచో నా దివ్యమాత దాని నాలకించి తీరునని నా మాటగా నమ్ముము కాని నీవనందులకై వేచియుండవలయును.

06/03/2019 - 19:04

ఆ తల్లి తన కృపాకటాక్షమును వానిపై బఱపి నంతనే అతడు ధన్యుడై భగవత్సాక్షాత్కారమునొందును. సమస్త దుఃఖాతీతుడగును. లేనిచో మీరెంతటి వివేక వైరాగ్యదాసాధనల నవలంబించినను అన్నియు నిష్ప్రయోజనములే. ‘‘ఒక్క ఓమము పాయ నూరు మెదుకులను అఱిగించును. ’’లని చెప్పుదురు. కాని జీర్ణకోశము చెడిపోయిన పక్షమున నూఱు ఓమము పాయలైనను ఒక్క మెదుకును అఱిగింప జాలవు.

05/27/2019 - 19:16

795. ఒక భక్తుడు: ఒకానొకడు గృహస్థుడైయుండియు బ్రహ్మజ్ఞానము నొందెనని గ్రహించుటెట్లు?
శ్రీ గురుదేవుడు: హరినామమును విన్నంతనే అశ్రువులును గగుర్పాటును గలుగుటయే అందులకు గుఱుతు. భగవన్నామ శ్రవణ మాత్రమున ఎవ్వని కన్నులనుండి బాష్పములు వెల్లివిరియునో, ఎవ్వనికి రోమాంచమగునో (రోమములు నిక్కబొడుచుకొనునో) అతడే జ్ఞాన లాభమును బొందినవాడు.

05/26/2019 - 19:57

ఆహా! ఈ గోపికల అనన్యభక్తి యెట్టిదో!

05/24/2019 - 19:35

783. ప్రేమభక్తిలో ‘నేను, నాది’అనగా నేను భక్తుడను, భగవంతుడు పూర్తిగా నావాడు అను రెండు భావములునుగలవు. యశోద తానుదక్క మఱెవ్వరును తన గోపాలుని సంరక్షింపలేరనియు తన పోషణ లేనిచో వాని యారోగ్యము చెడుననియు భావించెడిది. కృష్ణుడు జగన్నాథుడని భావింపనామె యెన్నడును ఇష్టపడలేదు. ‘‘్భగవంతుడు నావాడు, నా సొంతము; నా గోపాలుడు!’’ భక్తుని మమత యిట్టిది. ఉద్ధవుడు యశోదతో నిట్లనియెను: ‘‘అమ్మా!

Pages