S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

06/05/2019 - 19:56

వారితోపాటు తాపసులు, సిద్ధులు, సాధ్యులు, వైకుంఠంలో నారాయణ దర్శనం కోరి వచ్చిన నారదాదులు, తాపసగణాలు దేవ గణాలు ఇదేమిటి ఇట్లా లక్ష్మీనారాయణులు వెళ్లిపోతున్నారు. ఏ భక్తుని ఆర్తి విన్నారో ఏమో అనుకొంటూ లక్ష్మీనారాయణుల వెంట నడిచారు.
***

06/04/2019 - 19:39

నీవె తప్ప ఇతఃపరం బెరుగు అని వేడుకున్నవారిని రక్షించేనాథుడు భగవంతుడొక్కడే అని గజరాజు యోచించాడు.
మరికొద్దిసేపటికి అసలు కలండు కలండు అనే వాడు కలడో లేడో కదా. ఒకవేళ ఉన్నా నేను పిలిస్తే వస్తాడా రాడా.. అయినా ఏ దేవుని నేను పిలవాలి అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు అనుకొన్నాడు.

06/03/2019 - 19:48

ఇలా వనచరి యైన ఏనుగు, జలచరి యైన మొసలి ఇద్దరూ పట్టు వదలకుండా పరాక్రమం చూపించే తీరు చూసి ఇంద్రుని ఐరావతం ఆశ్చర్యపడింది. స్థాన బలం అంటే ఇదే కదా. నీటిలోని మొసలి బలానికి స్థాన బలం చేకూరింది. దానివల్లనే ఏనుగును ఇంతగా బాధపెడుతోంది.

06/03/2019 - 19:39

ఇలా వనచరియైన ఏనుగు, జలచరి యైన మొసలి ఇద్దరూ పట్టు వదలకుండా పరాక్రమం చూపించే తీరు చూసి ఇంద్రుని ఐరావతం ఆశ్చర్యపడింది. స్థాన బలం అంటే ఇదే కదా. నీటిలోని మొసలి బలానికి స్థాన బలం చేకూరింది. దానివల్లనే ఏనుగును ఇంతగా బాధపెడుతోంది.

06/03/2019 - 19:18

ఆ మొసలి రారాజుకు ఏనుగుల మదం కనిపించింది. బాహు బలం ఉన్నంత బలహీనులను ఇంతగా అణచివేయాలా అనుకొన్నాడు. సుఖసంతోషాలు పొందడానికి ఇతరులను ఇంతగా బాధ పెట్టాలా అనుకొన్నాడు. ఆమొసలికి ఏనుగుల గుంపుపై ఎంతో కోపం కలిగింది. ఆ ఏనుగుల గుంపు మడుగు వదలివెళ్లిపోతున్నా అందులోని మహారాజు గా ఉన్న కరిరాజు మాత్రం మడుగు వదలకుండా తన జవరాండ్రపైకి నీటిని చల్లడం, కలువలను చల్లడం చూశాడు.

06/03/2019 - 18:59

ఆ మడుగులోనుంచి రెక్కల్లార్చుకుంటూ వెళ్లే పక్షుల రెక్కల నుంచి జారిన జల బిందువులు ఆ ఏనుగుల పైన పడి దగ్గరలోనే జలాశయం ఉందన్న భరోసాను కూడా కలిగించాయి.
అంతే గజరాజుకు చాలా సంతోషం వేసింది. తన దాహమే కాక తన ప్రియురాండ్రకు కూడా దాహార్తిని తీర్చవచ్చు అనుకొన్నాడు. ఆ ఏనుగులు గుంపు ఒకదానితో మరొకటి ఆ జలాశయం గురించి చెప్పుకుంటూ వడివడిగా ముందుకు అడుగులు వేశాయి.

06/03/2019 - 18:48

భగవంతుడు తల్చుకుంటే వానపాముకూడా త్రాచువలె బలమైన సర్పంగామారుతుంది. ఆ భగవంతుడిచ్చిన బలాన్ని తన శక్తియుక్తులతో తెచ్చుకున్నదని విర్రవీగితే ఏవౌతుంది? కొన్నాళ్లకు ఆ భగవంతుడే నీ శక్తి ఏపాటిదో చూద్దాం అని మిన్నకుంటాడు. అంతే అపుడు నాగజాతిలో ఆదిశేషుయైనా పడగ కాదుకదా తోకను కూడా ఎత్తలేడు. అందుకే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదను సామెత పుట్టింది.

05/27/2019 - 19:14

ఇతడు కాస్త అహంకారి ఇపుడు వీని అహంకారం అంతా దిగిపోయింది. నా అన్నను బతకనిమ్ము అని వేడుకుంది. కన్నీళ్లతో బతిమాలుతున్న కొత్త పెళ్లికూతురు ముఖాన్ని చూసి కృష్ణుడు రుక్మిని వదిలేవేశాడు. తను భంగపోయినవిధాన్ని తలుచుకుని రుక్మి ఎంతో ఖిన్నుడై వెనుతిరిగాడు. బలరాముడు రుక్మిణీ కన్నీటిని చూశాడు. తన మరదలు ఈనాడే తన తమ్ముని చేపట్టింది.

05/26/2019 - 19:49

ఒక్క ఉదుటక జరాసంధుడు శిశుపాలుని దగ్గరకు వెళ్లాడు.

05/22/2019 - 20:06

అప్పటికే బలరాముడు శ్రీకృష్ణుని వెనుకగా తన అపారసేనావాహినితో నిలబడి ఉన్నారు. రథం ఉన్నట్టుండి ద్వారకాపురం వైపు పరుగులెత్తింది. కృష్ణుని వెన్నంటి యాదవ సైన్యం ఎక్కడ విదర్భ సైన్యం తమవైపు అడుగు వేస్తుందా ఎప్పుడెప్పుడు వారిని చీల్చి చెండాడుదామా అన్నట్టు విల్లంబులు సంధించి మరీ చూస్తూ ద్వారక వైపు రథాలను తిప్పారు. ***

Pages