S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

11/15/2018 - 18:32

పాండవులు పనె్నండు సంవత్సరాలు అరణ్యవాసం చేసి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో ప్రచ్ఛన్న రూపాలలో ఉన్నారు. అన్ని సేవలు దాసీలచేత చేయించుకొనే ద్రుపదకుమార్తె ఒక సేవికలాగా రాణి సుదేష్ణకు సేవలు చేస్తున్నది. అప్పటికి పది నెలలు అజ్ఞాతవాసం గడిచిపోయింది.

11/14/2018 - 18:40

పూర్వం ఉత్తంకుడు అనే మహాముని ఉండేవాడు. ఆయన విష్ణువు అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ ముని ఎన్నో విధాలుగా విష్ణువును స్తుతించాడు. అతని స్తోత్రాలతో సంతుష్టి చెంది వరాన్ని కోరుకొమ్మన్నాడు విష్ణువు. అప్పుడు ఉత్తంకుడిలా అన్నాడు. ‘‘శ్రీహరీ! నీవు ఈ సకల జగత్తుకు సృష్టికర్తవు. నీ దర్శనమే నాకు గొప్ప వరం. నాకిది చాలు’’.

11/13/2018 - 18:21

ఒకసారి దేవలోకంలో దేవతల మధ్య ఒక చర్చ జరిగింది. ‘‘్భలోకంలో ఉశీనరుడి పుత్రుడు గొప్ప దానగుణము కలవాడు. అతనిని పరీక్షించి సత్యం తెలుసుకోవాలి’’ అని. అలా పరీక్షించడానికి ఇంద్రుడు, అగ్ని బయలుదేరారు. అగ్ని పావురం రూపం ధరిస్తే ఇంద్రుడు డేగ రూపం ధరించి ఆ పావురాన్ని తరుముకుంటూ పోయాడు. అప్పుడు పావురం శిబి దగ్గరకు వచ్చి అతని ఒడిలో వ్రాలింది. దాని మాంసం కొరకు డేగ దాని వెంట వచ్చింది.

11/12/2018 - 18:24

భృగు మహర్షి పుత్రుడు చ్యవనుడు. అతను తపస్సు చేయాలని ఒక ప్రదేశంలో వీరాసనం వేసి కొయ్యలా ఉండిపోయాడు. అలా చాలాకాలం ఆ ఆసనంలోనే ఉన్నాడు. అతని మీద చీమలు పుట్టలు పెట్టాయ. అతని ఒళ్ళంతా లతలు అల్లుకున్నాయ. అయనా అతడు తన తపస్సు ఆపలేదు.

11/11/2018 - 22:49

అప్పుడు దేవతలు అందరు అగ్నిని ముందు పెట్టుకొని శచీదేవి వద్దకు వెళ్ళి ఆమెతో ఇలా అన్నారు. ‘‘దేవీ! నీవు మహాపతివ్రతవు. నీవు నహుషుని దగ్గరకు వెళ్ళు. నిన్ను కోరిన ఆ పాపాత్ముడు నశిస్తాడు. ఇంద్రుడు తిరిగి స్వర్గ్ధాపతి అగును.’’

11/09/2018 - 18:50

యుధిష్ఠురుడు: సత్యం, దానం వీటిలో ఏది గొప్పది?
సర్పము: దానం, సత్యం, తత్త్వం, అహింస, ప్రియభాషణం వీటి హెచ్చుతగ్గులు పనియొక్క ప్రాధాన్యతను అనుసరించి ఉంటాయి. ఒకసారి దానం కన్న సత్యమే గొప్పదౌతుంది. సత్యవాక్యం కన్నా దానం గొప్పదౌతుంది. ఈ విధంగా హెచ్చుతగ్గులు పనిబట్టి నిర్ణయింపబడుతాయి.

11/08/2018 - 18:58

పాండవులు మాయాజాదంలో దుర్యోధనుడి చేతిలో ఓడిపోయి అరణ్యవాసం చేయవలసి వచ్చింది. ఆ సమయంలో వారు అనేక నదీ ప్రాంతాలలో కొండగుహలలో కాలం గడిపారు. ఒకమారు వారు సరస్వతీ నదీ తీరాన్ని చేరి ద్వైతవనంలోని ఒక సరస్సు దగ్గరకు వెళ్ళారు. ఆ నదీతీరంలో వారు సుఖంగా జీవించసాగారు.

11/06/2018 - 19:31

అప్పుడు శివుడు శివగణాలతో ఒక హిమాలయ శిఖరంపై నిలుచున్నాడు. శివుడు చూసిన వారు ఆహా కైలాస వాసా కపర్ధి అని స్తుతించారు. గంగను ధరించడానికి నిలబడ్డ శివుని చూసి గంగామాత ఓహో నన్ను భరించగలిగే మొనగాడివా అని అనుకొంది. ఎలా భరించగలడో చూద్దాములే అనుకొంది. గంగ మనసు తెలసుకున్న శివుడు వూ వూ... ఇదా గంగా మనసు అనుకొన్నాడు. సర్వం ఈశ్వరమయం అయతే అందులోని ఉండేదే గంగ కదా.

11/05/2018 - 19:04

పూర్వం ఇక్ష్వాకు వంశంలో ప్రతాపవంతుడైన సగరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి చాలాకాలం సంతానం కలుగలేదు. అతను హైహయ వంశరాజులను, తాలజంఘులనే క్షత్రియులను జయంచి తన రాజ్యాన్ని విస్తరించాడు.

11/04/2018 - 22:21

పూర్వం మణిమతి అనే నగరంలో ఇల్వలుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతని తమ్ముడు వాతాపి. వారిద్దరూ ప్రహ్లాదుని గోత్రానికి చెందినవారు.

Pages