S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

07/05/2018 - 21:58

వరుణ మండల భూకంపం
ఇది రాత్రిలోని ద్వితీయార్థంలో వస్తుంది. వరుణుడు దీనికి అధిదేవత. రేవతి, పూర్వాషాడ, ఆర్ద్ర, ఆశే్లష, మూల, ఉత్తరాభాద్ర, శతభిషం దీనికి సంబంధించిన నక్షత్రాలు.
పౌష్ణా ప్యార్ద్ర శే్లషా మూలా హిర్బున్ధ్య వరుణ దేవాని
మండల మేతత్ వారుణ మస్యాపి భవన్తి రూపాణి

07/04/2018 - 21:45

వాయుమండల భూకంపం
ఇది రోజులోని మొదటి భాగంలో వస్తుంది. దీనికి వాయుదేవుడు అధిదేవత. ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, పునర్వసు, మృగశిర, అశ్విని దీనికి సంబంధించిన నక్షత్రాలు
చత్వార్యార్యమ్ణాద్యని ఆదిత్యం మృగశిరో శ్వయుక్ చేతి
మండల మేత ద్వాయవ్యస్య రూపాణి సప్తాహాత్
అంటే దిన ప్రథమ భాగంలో, ఈ నక్షత్రాల్లో భూకంపం వస్తే, అపుడు ఆ కంపానికి వాయువు కారణమని చెప్పబడుతుంది.

06/21/2018 - 21:39

ఖగోళ శాస్తమ్రు

06/18/2018 - 21:26

దీనిలో వాయువుని నాలుగువేల రకాలుగా విభజించారు. ఈ విభాగానికి, ప్రస్తుత వైజ్ఞానిక శాస్త్రంలో వాయు విభాగానికి సంబంధం కనిపించుటలేదు. ఆనాటి శాస్త్రంలో వాయువు అనే పదాన్ని మామూలు వాయుపదార్థాలు అనే అర్థంలో మాత్రమేగాక, కొన్ని రకాల శక్తులు అనే అర్థంలో కూడా వినియోగించినట్లు కనిపిస్తోంది. భరద్వాజకృత విమాన శాస్త్ర్తము అనే పేరుతో ఇవాళ మనకు లభిస్తున్న గ్రంథంలో మొదటి అధ్యాయం మాత్రమే లభిస్తోంది.

06/11/2018 - 21:48

శరణు కోరినవాడిని స్వీకరించకపోవడం, మంచి మిత్రుడికి ద్రోహం చెయ్యడం, కులవధువును చంపడం, బ్రాహ్మణుని ధనాన్ని అపహరించడమనే ద్రోహాలతో సమానమయ్యే అపరాధం చెయ్యని సేవకుడిని నిర్ధాక్షిణ్యంగా వదలివెయ్యడంకూడా మంచిదేనా? ఈ పాపాన్ని యెట్లా సహించడం? స్వర్గసుఖమట్లుండనీ! నాలో దయ స్థిరంగా వుండేటట్లు చేయుము. ఆ పుణ్యంచేత ఈ కుక్కను ఆదరించిన కార్యం దోషంగాక పోవడమనేది నాకొక పెద్ద వరం కాగలదు. ఇక నీవు మరలిపొమ్ము.

06/10/2018 - 21:19

‘‘రూపంలో నాయంతటివాడు లేడని ఇతని భావం. నేనొక్కడినే అందంలో అందరినీ మించినవాడనని కూడా ఇతనికి మనస్సులో వున్నది గాబట్టి పడిపోయాడు’’.
భీమసేనా! నీవు రా! వీరా ఎవరికి ఏది విధింపబడివుందో దాన్ని అతడు తప్పక అనుభవించాలి’’ అని సమాధానం చెప్పాడు ధర్మరాజు.

06/08/2018 - 21:39

వ్యాసుని, నారదుని, తపోధనులైన మార్కండేయ మహర్షిని, భరద్వాజుని, యాజ్ఞవల్క్యుని రుచిగల పదార్థాలతో భుజింపచేశాడు. ఇదంతా శ్రీకృష్ణుని వుద్దేశించి చేసినదే. శ్రీకృష్ణుని నామాన్ని కీర్తిస్తూ బ్రాహ్మణ శ్రేష్ఠులకు రత్నాలనూ, వస్త్రాలనూ, గ్రామాలనూ, గుఱ్ఱాలనూ, రథాలనూ, వందల వేలకొలది స్ర్తిలను, గోవులనూ దానంచేశాడు.

06/07/2018 - 21:33

ధృతరాష్ట్రుడు యోగనిష్ఠుడై ఆ అగ్నియందే సంయోగం చెందాడు. పుత్రులను కోల్పోయిన మహాపతివ్రత అయిన గాంధారి భర్త సేవావ్రతంలో నిలిచి పతిననుసరించి ఆ అగ్నిలోనే తానూ సంయోగం చెందింది. ఉత్తమ లోకాలకు వెళ్ళింది.

06/06/2018 - 21:34

యుయుత్సుడు, సంజయుడు, యశస్విని అయిన గాంధారీదేవి మొదలైనవారు ధృతరాష్ట్రునివైపు కూర్చున్నారు.
పట్ట్భాషేకానికి కావలసిన వస్తువులన్నీ సిద్ధపరిచారు. అప్పుడు పురోహితుడైన ‘్ధమ్యుడు’ శ్రీకృష్ణుని అనుమతితీసికొని ఈశాన్యంవైపు చూచే వేదిక నేర్పరిచాడు. అగ్నికాంతులుగల ‘సర్వతోభద్ర’మనే ఆసనం మీద ‘‘్ధర్మరాజును, ద్రౌపదిని’’ కూర్చుండబెట్టాడు. మంత్రపూర్వకంగా దౌమ్యుడు అగ్నిహోమం చేశాడు.

06/05/2018 - 21:59

అప్పుడు ద్రౌపది కలిగించుకొని ధర్మరాజుకు దండనీతి గురించి వివరిస్తుంది. ధర్మసూక్ష్మాలను దర్శించగల ద్రౌపది ధర్మరాజునుద్దేశించి ఎంతో మృదువుగా అనునయిస్తూ-
‘‘రాజా! నీ తమ్ముళ్ళు చాతక పక్షులవలె నీరసించిపోతున్నారు. ఇంకా యింకా కుమిలిపోతున్నారు. సముచితంగా సంభాషించి వారిని సంతోషపెట్టుము. పూర్వం ద్వైతవనంలో చలికి, గాలికి కృశించినపుడు నీ తమ్ముళ్ళతో ఎలా చెప్పావు?

Pages