S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/02/2016 - 22:57

బెల్లం రుచికి తియ్యగా వుంటుంది. ఇందులో పోషక పదార్థాలు లభిస్తాయి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్, సెలీనియం, మాంగనీస్ లాంటి పోషక పదార్థాలెన్నో లభిస్తాయి. బెల్లం బంగారపు రంగులో వుంటుంది. ఇది ఎంత ముదురు రంగులో వుంటే పోషక పదార్థాలు అంత పుష్కలంగా లభిస్తాయి. క్యాండీలు, ఐస్‌క్రీములు, చాక్‌లెట్స్, చ్యవనప్రాశలాంటి వాటిల్లో బెల్లాన్ని వాడుతారు.

06/01/2016 - 21:50

మే 27న దీదీ మమతా బెనర్జీ కలకత్తా ‘ఎర్రవీధి’లో జనాలమధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు- సభలో హేమాహేమీ నాయకులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీరందరితోపాటే శ్రీమాన్ లల్లూ ప్రసాద్ యాదవ్ ప్రక్కనే అంతెత్తు విగ్రహం కనుక- అందరి కంటా పడుతూ కాశ్మీర్ జనాల వృద్ధ నాయకుడు, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు జనాబ్ ఫారూక్ అబ్దుల్లాగారూ కూడా కెమెరాల దృష్టిని ఆకట్టుకుంటూనే వున్నాడు.

05/31/2016 - 23:34

సనా ఇక్భాల్ బైక్ రైడర్. ఇప్పటికే దేశంలోని 83 పట్టణాలను చుట్టేసింది. బైక్‌లో షికారు చేయటం ఈమె హాబీ కాదు. ఒంటరిగా, నిర్భయంగా బైక్ రైడింగ్ చేస్తూ విద్యార్థులతోనూ, యువతీ యువకులతో మమేకమైపోతుంది. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నట్లు నేటి యువత నిస్తేజంగా..నిర్వేదంగా బతుకు బండి లాగించేస్తోంది. అటువంటి యువతలో చైతన్యాన్ని నింపే పని చేపట్టి ఇలా దేశవ్యాప్తంగా బైక్ రైడింగ్‌కు ఉపక్రమించింది.

05/28/2016 - 23:26

సీజన్‌లో మాత్రమే లభించే చింతచిగురులో రుచికి పుల్లగా ఉంటుంది. పోషక పదార్థాలతోపాటు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చింతచిగురు ఎంతగానో ఉపయోగిస్తుంది. అజీర్తిని తొలగించి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. నెత్తురు పట్టేలా చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయి. కామెర్ల వ్యాధి నివారణకు సాయపడుతుంది. కడుపులోని నులిపురుగులను చంపేసి వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది.

05/28/2016 - 23:24

లాలాజలంవల్ల కూడా బాధలు కలుగుతాయా అని ఆశ్చర్యపోతున్నారా? లాలాజలం ఎక్కువైతే ఓ బాధ, తక్కువైతే మరో బాధ. ఎక్కువైతే చొంగ కార్చడం లాంటివి చూస్తాం, తక్కువైతే నోరు ఎండిపోవడం లాంటివి చూస్తాం. శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రతి పదార్థం సరైన మోతాదులో గనుక ఉత్పత్తి కాకపోతే దానివల్ల మనకి బాధే కలుగుతుంది. శారీరక, ఆర్థిక, మానసిక బాధే మిగులుతుంది.

05/26/2016 - 22:15

చెక్కిళ్లపై విరబూసే నవ్వే అందం. ముచ్చటైన నవ్వుకు చక్కనైన చెక్కిళ్లుండాలి. ముఖ సౌందర్యంలో చూడముచ్చటగా చెంపలు చోటుచేసుకోవాలి. వీటికి అందాలు కూర్చటానికి మార్కెట్‌లో ఎన్నో రకాల క్రీంలు, ప్యాకింగ్‌లు ఉన్నాయి. అయితే వాటి విషయంలో మెళకువగా లేకపోతే ఆరోగ్యకరమైన అందానికి బదులు చేటు జరిగే ప్రమాదమే ఎక్కువ. సహజ బ్యూటీమణులు కూడా అశ్రద్ధ చేస్తే చెక్కిళ్లు జిడ్డోడుతూ, మొటిమలతో బాధపడాల్సిందే.

05/25/2016 - 21:44

చావుకి చచ్చినన్ని కారణాలుంటాయ్. కానీ, ఆత్మహత్యకి అది చేసుకోవాలనుకున్నవాడికి- సింహాల నోట్లో తలపెట్టి వాటికి విందు భోజనంగా చావాలని కోరుకోవడం చిత్రాతి చిత్రం!

05/24/2016 - 22:14

పనె్నండేళ్ల తనిష్కా అబ్రహాం పిన్న వయసులో డాక్టర్ పట్టా పుచ్చుకునేందుక ఉవ్విళ్లూరుతున్నాడు. తనకు 18 ఏళ్లు వచ్చేసరికి డాక్టర్ పట్టా పుచ్చుకుని వైద్యం చేయాలని కలలుకంటున్నాడు. ఇందుకు రెండు విశ్వ విద్యాలయాలు సైతం ఈ చిన్నారి ప్రతిభకు అచ్చెరవొంది సీటు ఇచ్చేందుకు ముందుకు రావటం గమనార్హం. వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన తనిష్కా అబ్రహాం కుటుంబం అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడింది.

05/21/2016 - 23:53

ఎక్కువ శాతం మంధి ఆడ, మగ తేడా లేకుండా సైనస్ సమస్యతో బాధపడుతూ వుంటారు. చాలామంది బాధితులు ఎంతోమంది డాక్టర్ల దగ్గర చికిత్స చేసుకున్నాం, కొందరయితే ఆపరేషన్ కూడా చేయించుకున్నాం, అయినా ఈ సైనస్ సమస్య తగ్గలేదు అని బాధపడుతూ ఉంటారు. రోగులను బాధపెడుతూ వైద్యులను వొత్తిడికి గురిచేస్తున్న ఈ సైనస్ మన ఆనందానికో పెద్ద మైనస్. నేడు ఈ సైనస్ సమస్య గురించి చర్చిద్దాం.
సైనస్ అంటే?

05/19/2016 - 04:10

‘‘హోస్ పైపు’’ దొరికితే చాలు- బూస్టర్ పంపులు, ఓవర్‌హెడ్ టాంకులు గలవాళ్ల సెక్యూరిటీ సిబ్బంది ట్రిగ్గర్ హ్యాపీ అయిపోతారు. గేదెల దగ్గరనుంచి మోటారు కార్లదాకా తెగ కడిగేస్తారు. లాన్‌లకి, కారిడార్‌లకి, మొక్కలకి మాత్రమేనా? గేటులు దాటి యాభై గజాలదాకా పొద్దునే్న ‘హోస్‌పైపుల జల విన్యాసాలు’ మనం నగరంలో అపార్టుమెంటుల దొంతర్లమధ్య చూస్తుంటాం.

Pages