S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/26/2017 - 05:29

స్వతంత్ర భారతావని కోసం అసువులుబాసినవారిలో ఎందరో మహానుభావులు ఉన్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా పోరాట పటిమను ప్రదర్శించారు. గతించిన కాలం వలే వారందరినీ మరచిపోతున్నాం. కాని ఆ త్యాగధనుల త్యాగంతో నేడు మనదేశం సూర్యుని వలే వెలుగొందుతుంది. వారి పోరాటం నేటి తరానికి ఆదర్శం. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకోవటం మన కనీస ధర్మం.

01/26/2017 - 05:21

‘యోగా’ ఇండియాలో కన్నా ఇతర దేశాలలోనే బాగా ప్రాచుర్యంలో వున్నది. కానీ ఇప్పుడో కొత్తరకం యోగా వచ్చింది. ఆస్ట్రేలియాలో అక్కడినుంచి జర్మనీ మొదలు అమెరికాలాంటి దేశాలలో, ఒక అంటు వ్యాధి లాగా అల్లుకుపోతోంది రుూ విడ్డూరమైన ‘యోగా’్భ్యసం!

01/24/2017 - 22:51

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

01/24/2017 - 22:50

అగ్రరాజ్యం అధ్యక్షుడి ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇష్టమున్నా లేకున్నా ప్రథమ పౌరురాలు సంప్రదాయ వస్త్ధ్రారణకు కట్టుబడాల్సిందే. గత ఐదు దశాబ్దాల నుంచి ప్రథమ పౌరురాలు ఎవరైనా శే్వతసౌధంలోకి అడుగుపెట్టబోయే ముందు జరిగే వేడుకలో బంతిలాంటి గౌన్‌ను సంప్రదాయంగా ధరిస్తూ.. అధ్యక్షుడితో కలిసి వేదికపైకి వచ్చి మెరుపుతీగలా మెరవటం అమెరికా ఆచారం. ఈ వేడుకను ‘ఇనాగరల్ బాల్’ అంటారు.

01/21/2017 - 22:36

తెగిన గాలిఫటాన్ని చూస్తూ ఆ పిల్లవాడు దానిని పట్టుకొనే ప్రయత్నంలో తన డాబాపైనుండి పక్క డాబాపైకి దూకాడు. ఏం కానంతవరకూ అంతా బానే వుంటుంది. ఇప్పటిదాకా బాగుంది, ఇకపై కూడా బాగుంటుందని అనుకొని దూకేడు. విధి చిన్న ట్విస్ట్ ఇచ్చింది. కాలు జారింది. ముఖంమీద పడి ముక్కు మూడు ముక్కలుగా విరిగింది. అవ్వడానికి అవ్వకపోవడానికి కేవలం నిమిషం చాలు.
ముఖానికి తగిలే దెబ్బలు

01/19/2017 - 22:14

స్ర్తిలు సౌందర్యంగా కనిపించాలంటే అందుకు తగ్గట్టు ప్రతిరోజూ తగిన వ్యాయామం అవసరం. అనారోగ్యాన్ని దరిజేరనీయకుండా కాపాడే శక్తి వ్యాయామానికుంది. కనుక స్ర్తిలు తమ చక్కదనం పెంపొందించుకోవడం కోసం, శరీరం నాజూకుగా ఉంచుకునేందుకు కనీసం కొంతసేపు నడిస్తే చాలు. అతి వ్యాయామం పనికిరాదు. ఉదయానే్న లేచి వాకింగ్‌కు వెళ్లడం చాలామంచిది. నడకవలన శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. మధుమేహం వంటి రోగాలు దరిచేరవు.

01/18/2017 - 21:59

చాలా అడ్వాన్స్‌డ్ దేశం. నిజంగా ‘ఆడపిల్లే’ అనిపించే ‘రోబో’ని తయారుచేసిన చైనా దేశంలో కూడా విద్యార్థులు పరీక్షలలో కాపీలు తెగకొడతారు. వీళ్లపై నిఘా వెయ్యడానికి ఎన్ని రకాల మార్గాలనో చీనా దేశం ఆవిష్కరించినా కాపీల దెబ్బకి తట్టుకోలేకపోయారు. టీచర్లు కాపలా కాయలేక ఛస్తున్నారు.

01/19/2017 - 00:54

ఎయిర్ ఇండియా జనవరి 18 నుంచీ ఆ కంపెనీ విమాన సర్వీసులో స్ర్తిలకోసం ఆరు సీట్లు కేటాయిస్తున్నామని ప్రకటించింది. విమానంలో, మూడో వరుసలో వున్న ఆరు సీట్లు- స్ర్తిలకు మాత్రమే అమ్ముతారు. ఒంటరిగా ప్రయాణం చేసే కొందరు స్ర్తిలపట్ల పక్కనున్న మగ ప్రయాణీకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అనేక ఫిర్యాదులు వస్తుండటంతో..

01/18/2017 - 21:57

ఢిల్లీ అనగా భారత రాజధానీ నగరం. ఇక్కడ వున్న 1400 ప్రయివేటు సంపన్న స్కూళ్ళల్లో (కార్పొరేట్) తమ తమ చిన్నారులను చేర్పించి, తరించాలనుకుంటున్న తల్లిదండ్రులకు నర్సరీ నుంచి ఐదో తరగతి దాకా పిల్లల్ని చేర్పించడంలో చుక్కలు కనబడుతున్నాయ్.

01/17/2017 - 22:15

బీదవాడి యాపిల్ అంటే అరటిపండు. ఈ పండులో ఎన్నో ఉపయోగాలు వున్నాయి అని వైద్య విధానం చెబుతోంది. శరీరానికి మిక్కిలి పోషక పదార్థం దానిలో ఉంది. అదీగాక అది చర్మ సౌందర్యానికి పెట్టని కోట. ఈ పండులో ఒకరకమైన ఎంజైమ్ చర్మం పొరలపై వున్న మృత కణాల్ని తొలగించి, చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండేట్లు చేస్తుంది. ఆరోగ్యానికి, సౌందర్య రక్షణకు రోజూ ఒక అరటిపండు తినాలి.

Pages