S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/16/2019 - 18:36

మాట్లాడే వ్యక్తులకంటే వినే వ్యక్తులు వివేకవంతులంటారు. మాట్లాడే వ్యక్తులు తమకు తెలిసిన ఒక సబ్జెక్టు మీదే మాట్లాడొచ్చు. వినే వ్యక్తులు అటువంటివారినెందరిరో కలిసి వారి మాటలు వింటారు. ఈ విషయాన్ని గ్రహించి వారందరికంటే తెలివైనవారే అయి ఉండొచ్చు.

07/11/2019 - 23:00

నేడు అన్నీ కంప్యూటర్ ఉద్యోగాలే.. అందుకే ఆఫీసులో గంటలకొద్దీ సమయం కంప్యూటర్ల ముందు కూర్చుని గడిపేస్తూ ఉంటాం.. అలాంటప్పుడు మనం కూర్చునే భంగిమ సక్రమంగా ఉందో, లేదో అని సరిచూసుకోవాలి. లేదంటే ఆఫీస్ సిండ్రోమ్ తాలూకు సమస్యలు తప్పవు. ఆఫీస్ సిండ్రోమ్ అంటే.. సక్రమమైన కుర్చీలు, టేబుళ్లు వాడకుండా, సక్రమమైన భంగిమల్లో కూర్చోకుండా పనిచేసినప్పుడు ఎదురయ్యే శారీరక సమస్య.
స్టాటిక్ పోశ్చర్

07/11/2019 - 22:58

చీరలపైకి మ్యాచింగ్ జాకెట్లను కుట్టించుకోవడం పాత ట్రెండ్.. చీరలకు తగిన డిజైనర్ జాకెట్లను వేసుకోవడం నేటి ట్రెండ్. డిజైనర్ చీరల హవా పెరిగిన తరువాత జాకెట్లుకూడా వాటి దారిని మార్చుకున్నాయి. కొత్త కొత్త రంగుల్లో, కొత్త కొత్త డిజైన్లతో డిజైనర్ చీరల తలదనే్నలా తయారవుతున్నాయి. రోజుకో కొత్త డిజైన్‌తో ముస్తాబై మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడైతే ఏకంగా పమిటలపైకే ఎక్కేసాయి.

07/10/2019 - 18:28

పెద్దలు లేని ఇల్లు మంత్రులు లేని రాజ్యంలాంటిదంటారు. పెద్దవారిని గౌరవించే సంస్కృతి మనది. వెనుకటితరం వారి అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోవాలనుకునేవారు గతంలో. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. పెద్దవారిని గౌరవించడం తగ్గిపోయింది. పిల్లలు తమ ఇంట్లోని తాతయ్య, బామ్మలాంటి పెద్దవాళ్లను అసలు లెక్కచేయడంలేదు. ఈ పరిణామం హర్షించదగ్గది కాదు.

07/09/2019 - 18:26

వెనకబడిన వర్గం నుంచి వచ్చిన గుజరాతీ జానపద గాయని గీతా రబారీ కృషిని మోదీ ప్రశంసించారు. స్వయంకృషితో ఎదిగిన ఆమె నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, గుజరాతీ జానపదాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆమె ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆమె పాడిన ఓ పాటను కూడా మోదీ ట్విట్టర్‌లో పంచుకున్నారు. సోమవారం ఆమె మోదీని పార్లమెంటు ఆవరణలో కలిసిన విషయం అందరికీ తెలిసిందే..

07/09/2019 - 18:24

పొద్దుపొద్దునే్న చాలా హడావుడి. పిల్లలకు క్యారేజీలు కట్టాలి.. వారిని స్కూలుకు పంపాలి. భర్తకు కూడా క్యారేజీలు సర్ది, మనమూ క్యారేజీలు కట్టుకుని ఆఫీసులకు బయల్దేరాలి. ఇంత హడావుడిలో వ్యాయామం సాధ్యమేనా? కుదరనుకాక కుదరదు.. అందుకని వ్యాయామం సాయంత్రం చేయడమే మేలని కొందరనుకుంటారు. మరికొందరేమో సాయంత్రమయ్యే సరికి రోజువారీ పనుల్లో బాగా అలసిపోయి ఉంటాం. అప్పుడిక ఓపిక ఎక్కడుంటుంది?

07/08/2019 - 18:09

వరుడి పేరు: జాన్ కుక్
వయస్సు: వంద సంవత్సరాలు
వధువు పేరు: ఫిలిస్
వయస్సు: 102 సంవత్సరాలు

07/07/2019 - 23:23

బరువు తగ్గాలన్నా, పోషకపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నా డాక్టర్లు కానీ, న్యూట్రిషనిస్టులు కానీ మొదటగా చెప్పే విషయం అన్నం మానెయ్యమని.. అందుకే ఇప్పుడు చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్లకున్నా, డైటీషియన్లతో మాట్లాడకున్నా తమకు తాముగానే అన్నాన్ని మానేసి ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. కానీ డాక్టర్లు అన్నం మానెయ్యమని ఎందుకు చెప్పారు? అని ఎవ్వరూ ఆలోచించరు. కారణం పిండిపదార్థాలు.

07/07/2019 - 23:21

కాలచక్రానికి చీకటి పొర కమ్ముకుని
రచనా వెలుగు దీపం ఆరిపోయింది

తార వెలుగు దివ్వెలై ప్రకాశిస్తుంది గగన దీవిలో
సంద్రపు కెరటాలు వౌనంగా బతుకీడుస్తున్నాయి
మీ పాదం మోపి పునీతం చేయమని..

చీకటిని చీల్చుకుని మరోమారు కదిలి రామ్మా
అక్షరాల తల్లి ఎదురుచూపులో పడింది
కవనం కదిలించి నీరాజనం పలుకుతావని..

07/05/2019 - 18:48

పశువుల మరియు పక్షుల నుండి మానవాళికి వ్యాప్తి చెందే వ్యాధులను జూనొటిక్ వ్యాధులంటారు. ఈవ్యాధి కారకాలు సూక్ష్మజీవి (బాక్టీరియా), సూక్ష్మాతి సూక్ష్మజీవులు (వైరస్), పరాన్నజీవులు (ప్యారసైట్స్)లు ఏవైనా కావచ్చు. ఈవ్యాధుల గురించి మానవాళి తెలుసుకునేందుకు, తీసుకునే జాగ్రత్తల గురించి, అప్రమత్తంగా ఉండేందుకు జూలై 6వ తేదీన ‘‘జంతు సాంక్రమిత వ్యాధి నివారణ దినోత్సవం’’ జరుపుకుంటున్నారు.

Pages