S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/05/2018 - 21:13

ప్రతిరోజు హుషారుగా ఉండే రవళి ఈరోజెందుకో డల్‌గా కనిపించింది రవళి తల్లికి.
‘తల్లీ రవళీ ఎందుకిలా డల్‌గా ఉన్నావు’ రవళితల్లి అంజని
‘ఏం లేదమ్మా! ’ ఏదో చెప్పబోయి ఆగిపోయింది రవళి
‘లేదు అంటూనే సంకోచంగా ఉన్నావు. నీ మనసులో విషయం నాకు చెప్తే నీకు కావాల్సిన సమాధానం దొరుకుతుందేమో కదా’అంజని
‘నాకే తెలియడం లేదు. నువ్వు ఏం చెప్తావు ’ రవళి

07/04/2018 - 23:45

ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, గుడ్లు, ప్రొటీన్స్, హెర్బల్ షాంపులవలన శిరోజాలు పుష్టిగా అందంగా పెరుగుతాయని భ్రమపడతారు. కానీ ఇది కేశాలకు పోషక విలువలను మాత్రమే కలుగజేస్తాయి.
నార్మల్ హెయిర్ గలవారు కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి, తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చక్కని ఫలితం పొందవచ్చు.

07/04/2018 - 23:28

మనసుతో పెనవేసుకుని..
హృదయ సాగరం నుండి
అలల్లా ఎగిసిపడుతూ
కనుల గడపను తాకి..
మెలమెల్లగా బయటకు
వచ్చే కన్నీళ్లు..
వేదనకే కాదు
ప్రమోదానికీ ఆనవాళ్లు!
ఎంత గొప్పవి కన్నీళ్లు..
ఒక్క చుక్క వృథా కాదు
అవి జారిపడే ముందు..
కనీసం.. కళ్లను క్షాలితం చేస్తాయి!
ఎంచక్క
అవి చెక్కిళ్లపై
మృదువుగా చేసే సంతకాలు..

07/03/2018 - 21:18

ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది బాలింతల ప్రాణాలను కాపాడే సామర్థ్యమున్న అత్యద్భుత ఔషధాన్ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) తెలిపింది. ‘హీట్ స్టేబుల్ కార్మెటోసిన్’గా వ్యవహిస్తున్న ఈ ఔషధం తీవ్రమైన ఉష్ణోగ్రతలనూ తట్టుకుంటుందనీ, వెయ్యి రోజుల వరకూ నిలువ ఉంటుందనీ డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించింది.

07/02/2018 - 22:03

‘ఇంటికి దీపం ఇల్లాలే’ అంటూ ఘనంగా కీర్తించే మన పుణ్యభూమిలో ఆడపిల్లల విషయంలో మాత్రం అమానుషమైన వివక్ష కొనసాగుతోంది. ఫలితంగా ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు ఆడపిల్ల కాళ్లకు పట్టీలు పెట్టుకొని చిరు సవ్వడి చేస్తూ తమ ఇంట తిరుగుతుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే ఉండేది కాదు. లక్ష్మీదేవే తమ ఇంట నడయాడుతోందని మురిసిపోయేవారు. కాని నేడు ఆ పరిస్థితి లేదు.

07/01/2018 - 22:23

శిశువును ప్రసవించిన తర్వాత తల్లులు కనీసం నాలుగు నెలల పాటు నిద్రలేమితో బాధపడుతున్నారని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిద్రను దూరం చేసుకోవాలనుకోవడం కన్నా, శారీరక శ్రమకు తల్లులు దూరంగా ఉండడం మేలని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రసవం తర్వాత ఉద్యోగినులు నాలుగైదు నెలలు సెలవు తీసుకోవడం మేలని, సాధారణ గృహిణులు ఇంటిపనులకు దూరంగా ఉండడం మంచిదని వారు సలహా ఇస్తున్నారు.

06/29/2018 - 22:06

నిత్యం చదువులో ఒత్తిడి, కంప్యూటర్లు, టీవీ వంటివి అతిగా చూడడం వల్ల పాఠశాల స్థాయి విద్యార్థులు దృష్టికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్-ఎ లోపం, అపసవ్య ఆహారపు అలవాట్లు, నేత్ర వ్యాధులను ముందుగా గుర్తించ కపోవడం వంటివి పిల్లల అంధత్వానికి కారణాల వుతున్నాయ.

06/28/2018 - 22:58

ఆధునిక యుగంలో ఉద్యోగాలన్నీ దాదాపు కంప్యూటర్‌తో చేసేవే.. గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చుని తదేకంగా కంప్యూటర్‌పై కూర్చోవడం వల్ల స్పాండిలైటిస్, నడుంనొప్పి, మెడనొప్పి వంటి రకరకాల జబ్బులు వస్తున్నాయి. దానితో పాటు పని ఒత్తిడి. ఫలానా లక్ష్యాన్ని సమయంలో లోపల పూర్తిచేయాలనే నిబంధనలు మానసిక ఒత్తిడిని కలుగజేస్తాయి. ఇలాంటివాటన్నింటికీ సరైన ఉపాయం భుజంగాసనం.

06/28/2018 - 00:16

శిరోజాలు ఒత్తుగా ఉండాలే గానీ, వాటితో అందాలొలికే ఎనె్నన్ని ఆకృతులనైనా ఆవిష్కరించే వీలుంది. ఎప్పుడూ ఒకే మాదిరి కాకుండా సమయం, సందర్భం, అభిరుచుల మేరకు మహిళలు పలురకాల హెయర్ స్టయిల్స్‌తో కనువిందు చేయవచ్చు. ముఖం, నుదురు, మెడ ఆకారాలను బట్టి అనువైన హెయిర్ స్టయిల్‌ను ఎంచుకుంటే అందం మరింతగా ఇనుమడిస్తుంది. కోల ముఖం, గుండ్రని ముఖం, చతురస్రాకార ముఖం, పొడవైన మెడ, చిన్న మెడ, వెడల్పాటి నుదురు..

06/27/2018 - 23:30

సంతోషం!
ఎక్కడ దొరుకుతుంది
సంతోషం? సమాధానం
కొంచెం కష్టం

బొమ్మలతో
స్నేహితులతో ఆడుకోవడం
పిల్లలకు సంతోషం

ఆటపాటలతో
గడపడం
ఎదిగే పిల్లలకు
సంతోషం
తాము కన్నకలలను
సాకారం చేసుకోవడం
యువతకు సంతోషం

సంతానాన్ని చక్కగా
చూసుకోవడం తల్లిదండ్రులకు
సంతోషం

Pages