S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

01/05/2016 - 04:23

అన్ని జ్ఞానాల లాగానే విచక్షణను కలిగి ఉండటం కూడా గొప్ప జ్ఞానంగానే చెప్పవచ్చు. మంచి చెడుల విశే్లషణలో ఏది మంచి, ఏది చెడు అనే జ్ఞానాన్ని సక్రమమైన విధానంలో కలిగి వుండటమే విచక్షణ.
కొన్ని పరిస్థితులలో మనం ఒకటి మంచి పని అని తెలిసి, ఆ పనిని ప్రయత్న పూర్వకంగా చేస్తాం. కొన్నిసార్లు అప్రయత్నంగా ఏది మంచో, ఏది చెడో తెలియకుండానే చేస్తాం. ఏది ఏమైనా ప్రతి పనీ దాని ప్రతిఫలాన్ని మనకు తప్పక ఇస్తుంది.

01/04/2016 - 04:41

వికసించిన పుష్పం చూపులకు ఆహ్లాదాన్నిస్తుంది. వికసించిన హృదయం సదా భగవంతుని తనలో స్మరిస్తుంది. ఆధ్యాత్మిక వికాసం కలిగిన వ్యక్తి సాధనతో మరింత లోతులకు అనగా తనలోకి తాను పయనించగలడు. అలా పయనించినపుడు అతని యొక్క ఆత్మ వికసిస్తుంది. ఈ రకమైన ఆత్మవికాసం అలనాడు శ్రీకృష్ణుడి బోధన విన్న అర్జునుడికి కలిగింది. అంతక్రితంవరకూ అర్జునుడు యుద్ధం చేయుటకు సంశయించాడు. నావాళ్ళతో నేను యుద్ధం చేయాలా?

01/03/2016 - 00:43

భగవంతుడు సృష్టించిన ఈ చరాచర జగత్తంతయు ప్రకృతిగా పరిగణింపబడుతున్నది. పంచ భూతాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు అరణ్యాలు, అందులో జీవ జంతువులు అన్నియూ ప్రకృతిలోని భాగాలే. ఈ సృష్టి సమతుల్యాన్ని కాపాడే చెట్లు, గుట్టలు, అరణ్యాలు, పర్వతాలు తగ్గితే మానవుని మనుగడయే కష్టం.

01/01/2016 - 23:12

మనసు, వాక్కు, కర్మలనే త్రికరణాలలో మనస్సుతో చేసే వాటికే ఫలితం ఉంటుంది. జ్ఞానేంద్రియమైన జిహ్వ ఎన్నో పలుకవచ్చు. కాని అవి మనస్ఫూర్తిగా కానప్పుడు వాటి ఫలితం ఉండదు. అలాగే హృదయ పూర్వకంగా చేయని కర్మ కూడా ఫలితాన్నివ్వదు. అందుకే మనం ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలంటారు. మనం మన మనసును దేనిమీదైనా లగ్నం చేసినపుడు వాక్కు కర్మలపై దృష్టి ఉండదు. వాటి ప్రభావం ఉండదు.

12/31/2015 - 04:21

‘యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత / అభ్యుత్దాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్’ అనే భగవద్గీతలోని ఈ శ్లోకం అందరికీ తెలుసు లేదా వినే వుంటారు. ఎక్కడెక్కడ, ఎపుడెప్పుడు ధర్మానికి తగ్గుదల సంభవిస్తుందో, అధర్మానికి విజృంభణం సాగుతుందో ఆ సమయాల్లో, ఆ యుగంలో ఆ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణు రూపములో మాత్రమే కాక ఆయా యుగాలకి సరిపడే రూపంలో అవతరిస్తానని తెలిపాడు.

12/29/2015 - 22:48

ఈ జగత్తుయందు మానవాళిని పురాణ పురుషులు ఎందరో భిన్న రకములుగా విభజించి ఉన్నారు. అది వృత్తిని బట్టి కావచ్చు మనస్తత్వమును బట్టి కావచ్చు. అదే విధముగా కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీశ్రీశ్రీ జగద్గురు చంద్రశేఖర సరస్వతివారు సైతం ఈ ప్రపంచమునందు మెలిగే మానవాళిని నాలుగు రకములుగా గుర్తించారు. స్వామివారి లెక్కల ప్రకారం మానవాళి నాలుగు రకముల మనస్తత్వములు కలవారు.

12/29/2015 - 01:56

రామనామం ఎక్కడున్నా భాష్పపూరిత జలనయనాలతో కనిపించేరూపం ఒక్క ఆంజనేయునిదే అయఉంటుంది. చిన్నతనంలోనే సూర్యబింబాన్ని అందుకోబోయన చిరుత మారుతి ఎంతబలవంతుడో ఎవరికైనా అర్థమవుతుంది. అట్లాంటి ఆ బలశాలి సముద్ర లంఘనం చేయడానికి ఎవరు బలాఢ్యులో అని సందేహపడుతుంటే అసమానపరాక్రమశాలి అయ ఉండికూడా తనకు బలమున్నది అన్న సంగతి చెప్పకుండా అందరితో సహా తాను సందేహమనస్కుడయ్యాడు.

12/27/2015 - 22:23

ప్రస్తుతం ప్రపంచంలో మానవుడు ఏదో ఒక సమస్యతో బాధింపబడుతున్నాడు. శారీరక మానసిక అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు మానసిక అశాంతి, దారిద్య్రం, అవినీతి మొదలగు రకరకాల కుటుంబ సామాజిక, శారీరక మానసిక సమస్యలకు బలవుతున్నారు. సుఖం, శాంతి లేని అల్పాయుషుతో జీవిస్తున్నారు.

12/26/2015 - 21:27

అరిషడ్వర్గాల్లోని మదము అహంకారాన్ని సూచించే లక్షణమే. అధికత్వ భావన ప్రదర్శనమే అది. గర్వం దాని మరో రూపం. మన పురాణేతిహాసాల్లోని చాలా పాత్రలు అహంకారానికి నెలవులే. దుర్యోధనుడు అభిమానధనుడు. అహంభావమే అంతర్లయ. మహాభారతం ఉద్యోగ పర్వంలో కృష్ణరాయబార ఘట్టంలో చెప్పవలసిన హితవు ఎవరు చెప్పినా లక్ష్యపెట్టడు దుర్యోధనుడు. అప్పుడు ఆ సభలో వున్న పరశురాముడు కూడా తన మాటగా దంభోద్భవుడు అనే మహారాజు కథ చెబుతాడు.

12/25/2015 - 22:51

ఆధ్యాత్మిక జగత్తు అంతా భక్తి చుట్టూ పరిభ్రమిస్తూ యుంటుంది అంటే అతిశయోక్తి లేదు. భక్తి అంటే భిన్న అభిప్రాయాలు యున్నప్పటికీ అంతిమ లక్ష్యం మోక్షము. ఒక మూల ముక్కు మూసుకుని కూర్చొని లౌకిక విషయాలకు అతీతంగా ఉంటూ స్మరణ చేయుట భక్తి అని పెక్కుమంది అభిప్రాయం. కానరాని కానలలో భగవంతుని స్మరిస్తూ కాలం గడుపుట భక్తి అని మరికొందరి అభిప్రాయం. కాని భక్తికి పరిమితి లేదు. ప్రదేశమూ లేదు.

Pages